హైదరాబాద్: ప్రముఖ తెలుగు గాయకుడు గజల్ శ్రీనివాస్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీఎన్జీవో సభలో జాతీయ గీతాన్ని కించపరిచారని ఆరోపణల కింద అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సెప్టెంబర్ నెలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై వివాదం రాజుకుంది. అప్పటి సభలో జాతీయ గీతాన్ని శ్రీనివాస్ అవమానపరిచారంటూ ఫిర్యాదు నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది.