సమైక్యాంధ్ర పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో బహిరంగసభ ఏర్పాటు చేస్తే అడ్డుకుని తీరుతామని తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది.
సాక్షి,హైదరాబాద్: సమైక్యాంధ్ర పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో బహిరంగసభ ఏర్పాటు చేస్తే అడ్డుకుని తీరుతామని తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. జాక్ చైర్మన్ పిడమర్తి రవి, కన్వీనర్ బాలరాజు, అధ్యక్షుడు మర్రి అనిల్‌కుమార్ గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులను కాదని హైదరాబాద్‌లో సమైక్య సభలు నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ప్రకటించింది. కాగా, హరికృష్ణ రాజీనామాకు నిరసనగా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
అదే రోజు ‘తెలంగాణ విద్యార్థి ప్రజా యుద్ధభేరి’
సీమాంధ్ర ఉద్యోగులు వచ్చేనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామని, అదే రోజును ‘తెలంగాణ విద్యార్థి ప్రజాయుద్ధభేరి’ పేరిట బహిరంగ సభ పెడతామని ఓయూ జేఏసీ నాయకులు భాస్కర్, అంబేద్కర్ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు.