సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్న సీవూంధ్ర ఉద్యోగులకు స్పెషల్ అడ్వాన్స్ చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సమ్మెలో ఉన్నప్పటి పనిదినాల ఆధారంగా అడ్వాన్స్‌ను నిర్ధారించింది. ఏపీఎన్జీఓల సంఘం విజ్ఞప్తిమేరకు స్పెషల్ అడ్వాన్స్ చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. 60 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు సమ్మెలో పాల్గొన్న వారికి రెండు నెలల జీతాన్ని, 45 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు పాల్గొన్న వారికి నెలన్నర జీతం, 30 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు పాల్గొన్న వారికి నెల జీతాన్ని స్పెషల్ అడ్వాన్సుగా చెల్లించనున్నట్టు పేర్కొంది.
తిరిగి ఆ మొత్తాన్ని ఒకే విడతలో రికవరీ చేసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఏపీఎన్జీవోల సంఘం ప్రతినిధులు సోవువారం హైదరాబాద్‌లో వుుఖ్యవుంత్రి కిరణ్‌కువూర్‌రెడ్డితో సవూవేశమై, జీవో నంబర్ 177 ప్రకారం తవు సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం వుుఖ్యవుంత్రి పరిశీలనలో ఉంది. దీనిపై వుుఖ్యవుంత్రి సానుకూలంగా నిర్ణయుం తీసుకున్న పక్షంలో, ఉద్యోగుల సమ్మెకాలానికి చెల్లించే స్పెషల్ అడ్వాన్స్‌ను ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద సర్దుబాటు చేయుడానికి అవకాశం ఉంటుంది.