జాతీయనేతల కాళ్లు పట్టుకుంటానికి వెనుకాడం:అశోక్ బాబు | We do not hesitate to kneel down before National leaders to stop bifurcation: ashok babu | Sakshi
Sakshi News home page

జాతీయనేతల కాళ్లు పట్టుకుంటానికి వెనుకాడం:అశోక్ బాబు

Published Tue, Oct 22 2013 6:28 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

జాతీయనేతల కాళ్లు పట్టుకుంటానికి వెనుకాడం:అశోక్ బాబు

జాతీయనేతల కాళ్లు పట్టుకుంటానికి వెనుకాడం:అశోక్ బాబు

కాకినాడ:రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు అవసరమైతే జాతీయ నేతల కాళ్లు పట్టుకుంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జీతాలు వదులుకుని ఉద్యమించామని తెలిపారు. మరలా ఇటువంటి పరిస్థితి వస్తే తమ వేతనాలను వదులుకోవడానికి వెనుకాడమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని రెండు నెలలకు పైగా ఉద్యమించామని,.తాము మరలా ఉద్యమించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల చేసి ఉద్యమంలో వస్తారా?అని ప్రశ్నించారు.

 

తాము ప్రజాభిమానానికి అమ్ముడు పోయామని, తమపై ఆరోపణలు చేసే రాజకీయ నేతలు చేతనైతే దాన్ని కనుక్కోండని సవాల్ విసిరారు.  రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునే క్రమంలో అవసరమైతే జాతీయ నేతల కాళ్ల పట్టుకుంటానికి వెనుకాడమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement