
'రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు'
సమైక్యంధ్ర మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.
హైదరాబాద్: సమైక్యాంధ్ర మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20 తేదీన విజయవాడలో భారీ బహిరంగ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు అవసరం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం సమావేశమైన ఏపీఎన్జీవోలు తమ భవిష్య కార్యచరణను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సీమాంధ్ర నేతలపై మండిపడ్డారు.
ఈనెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏపీఎన్జీవోలు ప్రకటించారు. 19, 20 తేదీల్లో బ్యాంకుల సహా ప్రభుత్వకార్యాలయాల ముట్టడించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 6నుంచి 8వరకూ లైట్లు ఆపి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అవగాహన సదస్సులు, అనంతరం మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు.