సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలను కోరినట్టు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏపీఎన్జీవోలు సమైక్యంపై స్పష్టమైన హామీ కోరుతున్నారని చెప్పారు. విభజన వల్ల వచ్చే సమస్యలను ముసాయిదా రూపంలో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను కోరామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంలో చర్చించి కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్నామ్నాయం గురించి ఆలోచించలేదని మంత్రి వెల్లడించారు. చర్చల్లో ఎస్మా ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఇది ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయని చెప్పారు. సహేతుక ముగింపు వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులతో సమ్మెతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలకు విజ్ఞప్తి చేశారు.
ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలి: ఆనం
Published Sun, Sep 22 2013 6:38 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement