సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు | Government must give Permission to Samaikyandhra Meeting in Hyderabad: Ashok Babu | Sakshi
Sakshi News home page

సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు

Published Tue, Oct 1 2013 4:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు - Sakshi

సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమైక్య సభ నిర్వహించే హక్కు అందరికీ ఉందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఎవరు సభ పెట్టినా ప్రభుత్వం అనుమతించాలని ఆయన సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభకు వెళ్లాలా, లేదా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చినా సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

ఆంటోనీ కమిటీకి ఎలాంటి అధికారం లేదని, కేవలం పార్టీ కమిటీ మాత్రమేనని.. అలాంటి కమిటీకి తాము ఎలాంటి నివేదిక ఇవ్వబోమని తెలిపారు. రేపు అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్దకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఎంపీలు రాజీనామాలే చేయడమే కాకుండా అధికార హోదా వదులుకుని నియోజకవర్గాలకు రావాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement