22న హైదరాబాద్ తరలిరావాలి | Ashok Babu called to samaikyandhra people to come to Hyderabad on 22nd | Sakshi
Sakshi News home page

22న అందరూ హైదరాబాద్కు తరలిరావాలి

Published Sun, Jan 19 2014 7:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అశోక్‌ బాబు - Sakshi

అశోక్‌ బాబు

విజయవాడ: ఈ నెల 22న సమైక్యవాదులు అందరూ పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనపెట్టి ఛలో హైదరాబాద్‌కు  కదిలిరావాలని ఏపిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపు ఇచ్చారు.  ఈరోజు ఇక్కడ జరిగిన ఏపీజేఎఫ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలతో సంబంధంలేకుండా అందరూ సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.


పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. గాంధేయమార్గంలో ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఫలితాలు రావని చెప్పారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని  అశోక్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement