మౌలిక సదుపాయాలు లేకుండా ఉద్యోగులను విజయవాడకు బదిలీ చేస్తామంటే కుదరదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు.
విజయవాడ : మౌలిక సదుపాయాలు లేకుండా ఉద్యోగులను విజయవాడకు బదిలీ చేస్తామంటే కుదరదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ వసతులు లేకుండా విజయవాడలో పని చేయటం కష్టమన్నారు. కొన్ని శాఖలు హైదరాబాద్ నుంచి కూడా పని చేయవచ్చునన్నారు. అవసరమైన శాఖలను ఉద్యోగుల ఇష్టపూర్వకంగా మాత్రమే బదిలీ చేయాలన్నారు. ఉద్యోగుకులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పీఆర్సీ చెల్లించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.