వారంలో కేబినేట్ నోట్.. త్వరలో అసెంబ్లీలో తీర్మానం: షబ్బీర్ ఆలీ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎన్జీఓలపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మండిపడ్డారు. సభా వేదికపై పలువురు నాయకులు ఫోటోలు పెట్టుకున్నవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన నాయకులను ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం, కుతుబ్ షాహీలను ఏపీఎన్జీఓలు ఎలా మరిచిపోతారని నిలదీశారు.
ఏపీఎన్జీఓ నాయకులు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణవాదులు రెచ్చిపోనందుకు నా సలాం అని షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లో రక్షణ లేనిది సీమాంధ్రలుకు కాదు.. తెలంగాణ వాదులకేనని ఆయన అన్నారు. ఎపీఎన్జీఓలు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణప్రాంత ప్రజలు సంయమనంతో వ్యవహరించినందుకు సలాం అని అన్నారు.
హైదరాబాద్ లో సభలెన్ని పెట్టుకున్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని షబ్బీర్ తెలిపారు. వారం రోజుల్లో కేబినేట్ నోట్ ప్రవేశపెడుతారని..త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రానికి తాము సూచించామని మీడియా సమావేశంలో వెల్లడించారు.