ఎవడ్రా సమైక్యాంధ్ర అంటోంది | APNGOs leaders attacked by MP Harshakumar sons at Rajahmundry | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 5 2013 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

సమైక్యవాదులపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు దాడి చేశారు. ఎవడురా సమైక్యాంధ్ర అంటోంది అంటూ కర్రలతో వీరంగం సృష్టించారు. అంతేకాకుండా భద్రతా సిబ్బంది కూడా దాడులు చేసేలా ప్రోత్సహించారు. .... హర్షకుమార్ సుపుత్రుల వీరంగం చూడండి... అంతకు ముందు అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ తనయులు సమైక్యవాదులపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను నిరసిస్తూ రాజమండ్రిలోని హర్షకుమార్‌కు చెందిన కాలేజ్‌ను సమైక్యవాదులు ముట్టడించారు. ఎంపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ .. కళాశాల ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో హర్షకుమార్‌ తనయులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది .. సమైక్యవాదులపై దాడులకు దిగారు. కర్రలతో కొట్టడంతో, వారు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. దాడికి నిరసనగా .. సమైక్యవాదులు కళాశాల ప్రాంగణంలో చెత్త వేయడంతో మరోసారి ఘర్షణ చెలరేగింది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, సమైక్యవాదులపైనే విరుచుకుపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement