harshakumar sons
-
ఎవడ్రా సమైక్యాంధ్ర అంటోంది
-
ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయుల దాడి
రాజమండ్రి నగరంలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం ముట్టడించారు. ఆ సమయంలో అక్కడ కట్టిన హర్షకుమార్ ఫ్లెక్సీని సమైక్యవాదులు చించేశారు. ఆ ఘటనపై హర్షకుమార్ తనయులు మండిపడ్డారు. అనంతరం వారు ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. దాంతో ఏపీ ఎన్జీవోలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తు కళాశాలకు చెందిన బస్సులను ధ్వంసం చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.