రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అప్రజాస్వామికంగా బిల్లును లోక్‌సభ ముందుకు తేవడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రజలంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ, ప్రజా, విద్యార్ధి, కార్మిక సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మెజార్టీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, చట్టసభల సంప్రదాయాలను పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రం, విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే...