ఢిల్లీకి బయలుదేరిన ‘సమైక్య’ రైలు | APNGOs going to Delhi in five special trains | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి బయలుదేరిన ‘సమైక్య’ రైలు

Published Sun, Feb 16 2014 3:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటేందుకు ఈనెల 17న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి రాత్రి 8 గంటలకు

లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్: విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటేందుకు ఈనెల 17న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ రైలుకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రత్యేక రైలు రెండు నెంబరు ప్లాట్‌ఫారం నుంచి బయలుదేరగా రైలులో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు,  ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద  ఎత్తున సమైక్యవాదులు బయలుదేరి వెళ్ళారు. ఈ ప్రత్యేక రైలు వెళుతుందని తెలుసుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున రైల్వే ప్రాంగణానికి చేరుకుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement