ఉగాది పండుగ రద్దీ దృష్ట్యా గురు, శుక్రవారాల్లో గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
గుంటూరు మీదుగా నేడు, రేపు ప్రత్యేక రైళ‍్లు
Published Thu, Mar 30 2017 7:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు: ఉగాది పండుగ రద్దీ దృష్ట్యా గురు, శుక్రవారాల్లో గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు - హుబ్లీ జనసాధారణ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబర్ 07225) గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 4.30గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది. హుబ్లీ - గుంటూరు జనసాధారణ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబర్ 07226) శుక్రవారం వేకువజామున 5.30 గంటలకు హుబ్లీలో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు గుంటూరు చేరుకుంటుందని వివరించారు.
Advertisement
Advertisement