ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ నగరంలోని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోల ఆగ్రహాం కట్టలు తెంచుకొంది. దాంతో శుక్రవారం ఉదయం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల్ని భారీగా నిలిచిపోయాయి.
అలాగే బెంజి సర్కిల్తోపాటు ఆ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దాంతో అటు మచిలీపట్నం, ఇటు ఏలూరు వైపు నుంచి వచ్చే వాహానాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. వీటితోపాటు బుడమేరు వంతెనపై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు సంయుక్తంగా నూజివీడు - విజయవాడ రహదారిపై బైటాయించారు. దాంతో నూజివీడు నుంచి విజయవాడ వైపు, విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే వాహనాలు బారీగా నిలిచిపోయాయి.