Budameru Bridge
-
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
విజయవాడలో బుడమేరు విలయం..ఈ ఫోటోలు చూడండి
-
బుడమేరు వరదలో గల్లంతైన తండ్రీ, కొడుకులు మృతి
-
బుడమేరు మిగిల్చిన కష్టం
-
యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్
-
యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్
గన్నవరం: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. మృతురాలే దాడి చేయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన ప్రియుడిపై దాడి చేయాలకున్న ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో రాణి ప్రాణాలు పోగొట్టుకుంది. తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్ కు పెళ్లి కుదరడంతో అతడిపై యాసిడ్ చేసేందుకు ఇద్దరు యువకులతో రాణి ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాన్ లో భాగంగానే కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో బుడమేరు వంతెన వద్ద శుక్రవారం రాత్రి రాజేష్, రాణిపై యాసిడ్ దాడి జరిగింది. అయితే దాడి సమయంలో రాణి బైకు పైనుంచి కింద పడిపోడంతో తలకు గాయమై ఆస్పత్రిలో మృతి చెందింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో కేసు మిస్టరీ వీడింది. -
బెజవాడలో రహదారులు దిగ్బంధనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ నగరంలోని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోల ఆగ్రహాం కట్టలు తెంచుకొంది. దాంతో శుక్రవారం ఉదయం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల్ని భారీగా నిలిచిపోయాయి. అలాగే బెంజి సర్కిల్తోపాటు ఆ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దాంతో అటు మచిలీపట్నం, ఇటు ఏలూరు వైపు నుంచి వచ్చే వాహానాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. వీటితోపాటు బుడమేరు వంతెనపై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు సంయుక్తంగా నూజివీడు - విజయవాడ రహదారిపై బైటాయించారు. దాంతో నూజివీడు నుంచి విజయవాడ వైపు, విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే వాహనాలు బారీగా నిలిచిపోయాయి.