
చంద్రబాబు లెక్కతప్పింది: ఎంపీ జేసీ
రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
విజయవాడ: రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విభజన తర్వాత జరుగుతాయనుకున్న పంపకాల విషయంలో చంద్రబాబు లెక్కతప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అదే సమయంలో రాజధానికి ఉండే హంగులన్నీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పంటల రుణమాఫీ వందశాతం జరుగుతుందని, అయితే సమయం పడుతుందని చెప్పారు. టీడీపీలో తమకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నారని, ఇక్కడ తనకెలాంటి ఇబ్బంది లేదని దివాకర్ రెడ్డి చెప్పారు.