సాక్షి, విజయవాడ : విద్యుత్ బిల్లులో టారిఫ్ పెంచినట్టు నిరూపించాలంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీకి సవాల్ విసిరారు. శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు. ' టీడీపీ దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీకి పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవు. ఐదేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీది. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటు.రాష్ట్ర ప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోంది. రైతులకు తొమ్మిది గంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్.
మీ పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డే మీ దీక్షలు దొంగ దీక్షలన్నారు. టీడీపీ నేతలు ఎల్లోమీడియా సహకారంతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చంద్రబాబు పీపీఏలలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. టీడీపీకి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కరోనాకి భయపడి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉంది. టీడీపీ దొంగదీక్షల వల్ల మాకు ఒరిగేదేమీ లేదు' అంటూ విరుచుకుపడ్డారు. కాగా రాష్ట్రంలో ఐదు వందల యూనిట్లు దాటిన వారికి మాత్రమే తొంబై పైసలు పెరిగిందని ఎలక్ట్రికల్ డీఈ కోటేశ్వరరావు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కోటేశ్వరరావు వెల్లడించారు.
(ఏపీలో 2500 దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment