current charges
-
చంద్రబాబు సర్కారు మరో భారీ బాదుడు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో ఎడాపెడా బాదేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో భారీ బాదుడుకు కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధంచేసింది. తద్వారా ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపేందుకు చకచకా ఏర్పాట్లుచేస్తోంది. సాధారణ రివిజన్లో భాగంగా 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని పైకి చెబుతున్నా దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేలా భూముల విలువలను సవరించేందుకు చాపకింద నీరులా కసరత్తు జరుగుతోంది.భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో భూములను పలు రకాలుగా వర్గీకరించారు. వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమి.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారుల ఆనుకుని ఉన్న భూమి.. ఇలా పలు రకాలుగా విభజించారు. ఉదా.. ఒక ఏరియాలో మెట్ట భూముల విలువ రూ.5 లక్షలుగా, మాగాణి భూముల విలువ రూ.10 లక్షలుగా నిర్థారిస్తారు. ఎప్పుడైనా మార్కెట్ విలువలను వాటి ప్రకారమే పెంచడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్లను మారుస్తున్నారు.రూ.5 లక్షలున్న మెట్ట భూమిలో ఒకచోట రూ.5 లక్షలు, దీని పక్కనే ఉన్న దానికి రూ.7 లక్షలు నిర్ణయిస్తున్నారు. అంటే.. ప్రతీ క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటును ప్రవేశపెడుతున్నారు. అలాగే, జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపలున్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో పెడుతున్నారు. దీనికి కొత్తగా ‘లేయర్’ విధానమని పేరు పెట్టారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకుని ఉన్న భూమికి మరో రేటు, వాటి వెనకున్న వాటికి మరో రేటు నిర్ణయిస్తున్నారు.అలాగే, అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనుకున్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. ఇక వాణిజ్య స్థలాలకు సంబంధించిన క్లాసిఫికేషన్లను రకరకాలుగా మార్చి గ్రిడ్లు, లేయర్లు పెడుతున్నారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతీదాని రేటును మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచుతున్నారు.50–60 శాతం పెరిగే అవకాశం..ఇలా చేయడంవల్ల ప్రజల నెత్తిన మోయలేని భారం పడనుంది. దాదాపు ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలకు రెక్కలు రానున్నాయి. దీంతో.. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు 50–60 శాతం పెరగనుండడంతో క్రయవిక్రయాలు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన భారీగా ఉండనుంది. పైకి మాత్రం ఇది కేవలం 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతున్నా క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా ఈ బాదుడు భారీగా ఉండనుంది.అన్ని జిల్లాల్లో దాదాపు కసరత్తు పూర్తి..ఇక ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే అన్ని జిల్లాల్లో చాలావరకు పూర్తయింది. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లతో వారం, వారం సమీక్షలు జరిపి ఎలా చేయాలి, ఎంత పెంచాలో దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామ, ఏరియా మ్యాప్ తీసుకుని దాని ఆధారంగా రేట్లు పెంచేశారు. గ్రిడ్లు, లేయర్ల విధానంవల్ల కొన్నిచోట్ల ఇబ్బంది వస్తుందని కిందిస్థాయిలో అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయలేదు. ప్రతీ భూమి విలువను పెంచాలి్సందేనని ఆదేశాలు అందడంతో అందుకనుగుణంగా సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ భారం ప్రజలపై వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఒక పక్క వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రజల నెత్తిపై ఇంకా భారాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు
సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్ బిల్లింగ్ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నూతన టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ఉంది. రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: పోలీస్ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ) -
ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు
గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఛార్జీల చెల్లింపును రద్దు చేయడంతో పాటు ఆ తర్వాతి నెలల బిల్లును వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు కల్పిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీలో షూటింగ్స్ కోసం పర్మిషన్ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ ప్రసాద్... ఇలా చాలామంది వెళ్ళి గత జూన్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాం. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. మేం తొమ్మిది నెలల కరెంట్ ఛార్జీలు రద్దు అడిగాం. అయితే ప్రభుత్వం మూడు నెలలు రద్దు చేస్తూ, జీవో ఇచ్చింది. మిగతా నెలల బిల్లును కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ గారి డ్రీమ్. దానికి సంబందించిన అన్ని విషయాలూ పరిశీలిస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి. వీరనారాయణ్ బాబు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడుతూ – ‘‘ఏ, బీ సెంటర్స్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.5 లక్షల రుణాలపై వడ్డీ 50 శాతం మాఫీ చేయడం మంచి నిర్ణయం. ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం 6 నెలల గడువు తర్వాత ఒక ఏడాది వరకు వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుంది. థియేటర్స్ వారికి వెసులుబాటు కల్పించడంతో పాటు వేలాది సినీ కార్మికులకు తగిన జీవనోపాధి కలిగించేలా చేసిన జగన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో మాకు సహకరించిన హీరోలు చిరంజీవి, నాగార్జునలకు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్, విజయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
'సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు'
సాక్షి, విజయవాడ : విద్యుత్ బిల్లులో టారిఫ్ పెంచినట్టు నిరూపించాలంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీకి సవాల్ విసిరారు. శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు. ' టీడీపీ దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీకి పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవు. ఐదేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీది. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటు.రాష్ట్ర ప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోంది. రైతులకు తొమ్మిది గంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. మీ పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డే మీ దీక్షలు దొంగ దీక్షలన్నారు. టీడీపీ నేతలు ఎల్లోమీడియా సహకారంతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చంద్రబాబు పీపీఏలలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. టీడీపీకి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కరోనాకి భయపడి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉంది. టీడీపీ దొంగదీక్షల వల్ల మాకు ఒరిగేదేమీ లేదు' అంటూ విరుచుకుపడ్డారు. కాగా రాష్ట్రంలో ఐదు వందల యూనిట్లు దాటిన వారికి మాత్రమే తొంబై పైసలు పెరిగిందని ఎలక్ట్రికల్ డీఈ కోటేశ్వరరావు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కోటేశ్వరరావు వెల్లడించారు. (ఏపీలో 2500 దాటిన కరోనా కేసులు) -
హైదరాబాద్ రమ్మంటారా.. విజయవాడ వస్తారా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చంద్రబాబు .. ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అంటూ మండిపడ్డారు. అయితే అంతకు ముందు 'అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు' అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' -
మీ ‘పవర్’.. కాస్త ఆపండి!
నగరంలోని హైడెర్ష్కోఠ్ పీరం చెరువులోని గిరిధారి గేటెడ్ కమ్యూనిటీ నుంచి డిస్కంకు గతంలో నెలకు రూ.12 నుంచి 13 లక్షల వరకు విద్యుత్ బిల్లు వసూలయ్యేది. ఇటీవల ఆ గెటేడ్ కమ్యూనిటీ భవనంపై సోలార్ రూఫ్టాఫ్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి గతంలో ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు రాగా.. సోలార్ పలకల ఏర్పాటుతో ప్రస్తుతం రూ.40 లక్షలు తగ్గింది. నిథిమ్ క్యాంపస్ నుంచి నెలకు రూ.2.50 లక్షలు తగ్గింది. వాణిజ్య సంస్థలు, వ్యక్తిగత గృహ వినియోగదారులు తమ నెలవారి విద్యులు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ నెట్ మీటరింగ్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటుండటంతో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల పవర్ సేల్స్ భారీగా పడిపోతున్నాయి. ఆయా వినియోగదారుల నుంచి డిస్కంకు రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి... భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రానుండటంతో ఇప్పటి నుంచే రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని డిస్కంలు భావించాయి. ఆ మేరకు మీ ‘పవర్’కాస్తా ఆపండి అంటూ అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తితో డిస్కంల సేల్స్ తగ్గిపోయాయా..? సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్లకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బ్రేకులు వేస్తున్నాయా...? అంటే అవువనే అంటున్నారు విద్యుత్ అధికారులు. సంప్రదాయ విద్యుత్‌తో పోలిస్తే హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకుని ఉండటం, ఆ ఉత్పత్తికి అవసరమైన వనరులు కూడా పరిమితంగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లపై 40 శాతం, పది కిలో వాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లకు 20 శాతం రాయితీ ఇస్తుండటంతో నెలకు సగటున 300పైగా యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్‌పై దృష్టి సారించారు. పవర్ సేల్స్ పడిపోతుండటంతో... విద్యుత్ సంస్థలు ఏటా కరెంట్ చార్జీలు పెంచుతుండటం, నిర్ధేశిత సమయానికి ఆలస్యంగా రీడింగ్ నమోదు చేస్తుండటం వల్ల స్లాబ్‌రేట్ మారిపోతోంది. అధిక మొత్తంలో బిల్లులు వస్తుండటంతో దీని నుంచి బయటపడేందుకు చాలా మంది రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ద్వారా 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకుపైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాయి. ఇలాగే నెట్ మీటరింగ్ కనెక్షన్లు ఇచ్చుకుంటూ పోతే డిస్కం పవర్ సేల్స్ భారీగా పడిపోయి వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు భావిస్తున్నారు. దీంతో రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. సోలార్ రూఫ్ టాప్నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తోంది. డిస్కంలకే విక్రయం... వంద ఎస్ఎఫ్టీ స్థలంలో ఒక కేవీఏ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కేవీఏ ప్యానల్ రోజుకు సగటున ఐదు యూనిట్ల చొప్పున ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ల వరకు పని చేస్తుంది. ఒక కేవీఏ ప్యానల్‌కు రూ.52 వేలు అవుతుండగా, ఈ మొత్తంలో కేంద్రం 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. అపార్ట్మెంట్లకు రూఫ్ టాప్ ప్యానల్‌కు 20 శాతం సబ్సిడీ వస్తుంది. సోలార్ ప్యానళ్ల ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. సీపీడీసీఎల్ పరిధిలో రోజుకు సగటున 90 మెగావాట్ల (అంటే 45,000 యూనిట్ల) సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది. డిస్కం ఆయా జనరేషన్ సంస్థల నుంచి అవసరాన్ని బట్టి యూనిట్‌కు రూ.6 నుంచి రూ.11 వరకు వెచ్చించి కొనుగోలు చేసి గృహ వినియోగదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఆదాయం తగ్గి డిస్కం సేల్స్ పడిపోయి, సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండటంతో అనధికారిక ఆంక్షలు కొనసాగించాల్సి వస్తున్నట్లు డిస్కంలు ప్రకటిస్తున్నాయి. ఆంక్షలు పెట్టడం అన్యాయం ఇంటిపై ఒకసారి సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు లబ్ధిచేకూర్చే ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించాల్సిన డిస్కంలు తమ రెవెన్యూ పడిపోతుందనే ఆలోచనతో సోలార్ నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగి స్తుండటం అన్యాయం. – బి.అశోక్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ అసోసియేషన్ మీ ‘పవర్’తగ్గించండి... ‘సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల జారీతో డిస్కం పవర్ సేల్స్ పడిపోతున్నాయి. సంస్థకు అంతో ఇంతో రెవెన్యూఇచ్చే వినియోగదారులే నెట్ మీటరింగ్‌కు వెళ్లిపోయి.. నెలవారి బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇది డిస్కంల నష్టాలకు ఓ కారణమవుతోంది. సోలార్ ఎనర్జీ దూకుడు తగ్గించాలని కోరుతూ ఇప్పటికే టీఎస్ రెడ్కోకు విజ్ఞప్తి చేశాం.’ (శనివారం రాత్రి ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో రఘుమారెడ్డి చేసిన వాఖ్యలుఇవి) – రఘుమారెడ్డి, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
కరెంట్ షాక్‌లకు కారకులెవరు?
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగినా.. కారు చౌకగా విద్యుత్ అందుబాటులో ఉన్నా చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీల మోత ఎందుకు మోగింది? కరెంట్ చార్జీల షాక్‌లకు కారకులెవరు? ఇప్పటికీ కొనసాగుతున్న ఈ భారాలకు చంద్రబాబు స్వలాభాపేక్షే కారణమయ్యిందా? కర్ణాటకలోని కుడిగీ విద్యుత్ కేంద్రం పీపీఏని పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తేలిగ్గా దొరకుతాయి.. కర్ణాటకలోని కుడిగీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచీ యూనిట్ రూ. 4.80కి ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో 2010లోనే కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 360 మెగావాట్ల ఈ పీపీఏ వల్ల విభజన తర్వాత కూడా ఏపీకి ఏడాదికి 2,681 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందేది. ఈ విద్యుత్ చౌకగా లభించేది. 360 మెగావాట్లకు ఫిక్స్డ్ చార్జీలు (ప్లాంట్ నిర్మాణ వ్యయం) కింద రూ. 317 కోట్లు చెల్లించాలి. 2,681 మిలియన్ యూనిట్లకు లెక్కగడతారు కాబట్టి యూనిట్‌కు రూ. 1.20 మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్ పడుతుంది. ఇక బొగ్గు, ఇతర చార్జీలు (వేరియబుల్ కాస్ట్) యూనిట్‌కు రూ. 3.58 అవుతుంది. అన్నీ కలుపుకుంటే యూనిట్ రూ. 4.80కే లభిస్తుంది. కానీ కుడిగీతో ఉన్న ఒప్పందం ప్రకారం ఏడాదికి 2,681 మిలియన్ యూనిట్లు తక్కువ ధరకే తీసుకునే అవకాశం ఉన్నా స్వలాభం కోసం చంద్రబాబు ఇతర ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ నియంత్రణ మండలిపై ఒత్తిడి తెచ్చి కుడిగీ నుంచి 392 మిలియన్ యూనిట్లే తీసుకోవాలని షరతుపెట్టేలా చేశారు. దానివల్ల చౌకగా వచ్చే 2,681 మిలియన్ యూనిట్లు తీసుకునే అవకాశం లేకుండా పోవడమే కాదు 392 మిలియన్ యూనిట్లు మాత్రమే కొనడం వలన ఏటా ఫిక్స్డ్ చార్జీల కింద అదనంగా రూ. 274 కోట్లు ఎన్టీపీసీకి కట్టాల్సి వస్తోంది. ఇది రాష్ట్రప్రభుత్వానికి నష్టమే కాక అదనపు భారం కూడా.. ఇదంతా ప్రజలపైనే విద్యుత్ చార్జీల రూపంలో పడుతోంది. అందుకే మార్కెట్లో చౌకగా విద్యుత్ దొరికినా విద్యుత్ వినియోగదారులపై భారం తప్పడం లేదు. ప్రైవేట్ విద్యుత్‌పైనే ప్రేమెక్కువ.. ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారుల మీదే గత ప్రభుత్వం ప్రేమ చూపించింది. సౌర విద్యుత్ ధర గరిష్టంగా రూ. 6.99, పవన విద్యుత్ గరిష్టంగా రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత సర్కార్ 25 ఏళ్లుకు పీపీఏలు చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ స్వల్పం. కానీ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. గత ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇప్పుడు కేంద్ర విద్యుత్ కావాలన్నా చౌకగా లభించే వీల్లేకుండా పోయింది. కుడిగీ విషయానికే వస్తే అనుకున్న ప్రకారం 2,681 మిలియన్ యూనిట్ల విద్యుత్ తీసుకుని ఉంటే యూనిట్ రూ. 4.80లకే లభించేంది. కానీ 392 మిలియన్ యూనిట్లే తీసుకోవడం వల్ల పీపీఏ చేసుకున్న మొత్తానికి ఫిక్స్డ్ ఛార్జీ చెల్లిస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు కుడిగీ విద్యుత్ ఫిక్స్డ్ చార్జీనే యూనిట్ రూ. 8.10 పడుతోంది. వేరియబుల్ కాస్ట్ మరో రూ. 3.58 అదనం. అంటే యూనిట్ రూ. 11.68 అవుతోంది. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల డిస్కమ్‌లు నష్టపోతున్నాయని నిపుణుల కమిటీ అధ్యయనంలో తేలింది. -
మొండి బకాయిలకు వన్‌టైం సెటిల్మెంట్
సాక్షి, ఆదిలాబాద్: పెండింగ్ బకాయిలు విద్యుత్ శాఖకు పెను భారంగా మారాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.53 కోట్లు గ్రామపంచాయతీ బకాయిలు ఉండగా రూ.1.20 కోట్ల మున్సిపల్ బకాయిలు ఉన్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పెండింగ్ బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీ, మున్సిపల్‌తో పాటు విద్యుత్ శాఖకు ఊరట లభించనుంది. పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్గా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా, విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఆయా శాఖల నుంచి స్పందన కరువైంది. సీఎం నిర్ణయంతో విద్యుత్ శాఖ అధికారులకు ఉపశమనం కలగనుంది. మొండి బకాయిలకు మోక్షం లభించే అవకాశం వచ్చిందని ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం రూ.130 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వీటిలో రైల్వే రూ.6లక్షల వరకు, టెలిఫోన్ రూ.25 లక్షల వరకు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.62 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖ రూ.1.10 కోట్ల వరకు, రెవెన్యూ రూ.19 లక్షల వరకు, ఉన్నత విద్య శాఖ రూ.90లక్షల వరకు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.25 లక్షల వరకు, గిరిజన సంక్షేమ శాఖ రూ.43 లక్షలు, మున్సిపల్ రూ.1.20 కోట్లు, మేజర్ గ్రామపంచాయతీలు రూ.16.20 కోట్లు, మైనర్ గ్రామపంచాయతీలు రూ.36.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. నెలనెలా చెల్లించాల్సిందే... మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసిన తర్వాత జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, మున్సిపల్ అధికారులు నెలనెలా బిల్లులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. పెండింగ్ విద్యుత్ బకాయిలు ప్రభుత్వం చెల్లించనుండడంతో నెలనెలా బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా వసూలు చేయాలని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపట్టలేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాడలేని ప్రిపెయిడ్ మీటర్లు.. మొండి బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ శాఖ ప్రిపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది క్రితమే ప్రకటించినా ఇంతవరకు దాని జాడలేకుండా పోయింది. ప్రిపెయిడ్ మీటర్లు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమర్చలేదు. ప్రస్తుతం మ్యానువల్‌గానే బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రిపెయిడ్ మీటర్లు బిగిస్తే సిమ్‌కార్డు తరహాలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే దారిలేక తప్పనిసరిగా బిల్లులు చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు ప్రిపెయిడ్ మీటర్ల విధానం అమలుకు నోచుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు.. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలకు స్విచ్‌లను ఏర్పాటు చేసేందుకు పూనుకుంటున్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. జీపీ బకాయిలే అధికం జిల్లాలో గ్రామపంచాయతీ బకాయిలే అధికంగా ఉన్నాయి. రూ.53 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. మున్సిపల్ బకాయిలు రూ.1.20 కోట్ల వరకు ఉన్నాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ వినియోగదారులు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలి. – ఉత్తం జాడే, విద్యుత్ శాఖ ఎస్ఈ, ఆదిలాబాద్ -
విద్యుత్ భారం తగ్గినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)ని కోరాయి. ప్రస్తుతం రూ. 6.40గా ఉన్న యూనిట్ చార్జీని రూ. 4.88కు తగ్గించాలని ప్రతిపాదించాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిస్కంలు గత వారం ఈఆర్సీకి విన్నవించాయి. మార్చిలోగా ఈ సిఫారసులను ఈఆర్సీ ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే వాటి నిర్వహణకు ఏటా దాదాపు 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుండగా వాటికి ప్రస్తుత చార్జీలే వర్తిస్తే రూ. 13,824 కోట్ల వ్యయం కానుంది. ఒకవేళ చార్జీల తగ్గింపునకు ఈఆర్సీ అనుమతిస్తే చార్జీల వ్యయం ఏకంగా రూ. 3,284 కోట్లు తగ్గి రూ. 10,540 కోట్లకే విద్యుత్ చార్జీల భారం పరిమితం కానుంది. ఏటా పెరుగుతున్న వినియోగం.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తయిన/కొనసాగుతున్న 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అందుబాటులోకి తేవడంతోపాటు మరో 8.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం కానుంది. అయితే ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా వీటికై 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ వినియోగం ఈ ఏడాది జూన్–జులై నాటికి 3,331 మెగావాట్లకు పెరగనుండగా 2018–19కల్లా 5,869 మెగావాట్లకు, 2019–20కల్లా 8,369 మెగావాట్లకు, 2020–21కల్లా 10,089, 2021–22కల్లా 11,495 మెగావాట్లకు పెరగనుంది. విద్యుత్ అవసరం పెరుగుతుండటం, దానికి తగట్లే యూనిట్‌కు రూ. 6.40పైసల మేర చెల్లించాల్సి ఉండటంతో నీటిపారుదలశాఖపై విద్యుత్ భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో యూనిట్‌పై వసూలు చేస్తున్న చార్జీని రూ. 4.50 పైసలకు తగ్గించాలని డిస్కంలను కోరింది. అయితే దీనిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డిస్కంలు ఈ మేరకు ఈఆర్సీ ముందు ప్రతిపాదనలు పెట్టాయి. యూనిట్ చార్జీ తగ్గింపు అవసరాన్ని ఈఆర్సీ ముందు బలంగా వాదించేందుకు నీటిపారుదలశాఖ ప్రత్యేకంగా ఓ కన్సల్టెంట్‌ను సైతం నియమిస్తోంది. దీనికితోడు తగ్గింపు అంశంపై ఈఆర్సీ ముందు తొలిసారి పిటిషన్ కూడా దాఖలు చేయనుంది. సాధారణంగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ యథావిధిగా ఆమోదిస్తుందని, ఆ దృష్ట్యా ప్రస్తుత చార్జీల తగ్గింపు ప్రతిపాదన సైతం ఆమోదం పొందుతుందని విద్యుత్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం : సీఎం
అమరావతి: సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై ఆయన శనివారం సమీక్షించారు. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఈ నెలాఖరున ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన జరుగుతుందని, జూలై నెల చివరకు విజయవాడ-ముంబయి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-ఇండోర్ విమాన సర్వీసులు నడుస్తాయని వివరించారు. గ్యాస్ పైపు లైన్ల ఏర్పాటులో జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ సర్కార్ దొంగదెబ్బ!
-
ఏపీ సర్కార్ దొంగదెబ్బ!
⇔ బడ్జెట్ సమావేశాలు ముగిసిన గంటల్లోనే కరెంట్ చార్జీల పెంపు ⇔ ఇది దుర్మార్గం, రాజకీయ దిగజారుడు ⇔ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోండి ⇔ లేదంటే భారీ మూల్యం తప్పదు: వైఎస్ఆర్ సీపీ అమరావతి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే విద్యుత్తు చార్జీలు పెంచటం టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ మనస్తత్వానికి, రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు చార్జీలు పెంచాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ పత్రికా ప్రకటనలో పలు విషయాలను పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లలోనే మూడుసార్లు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఆక్షేపించింది. విద్యుత్తు చార్జీల పెంపు మీద ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఏమన్నారో గుర్తుచేసుకోవాలని, కరెంట్ చార్జీలు వీలుంటే తగ్గిస్తాం అన్న చంద్రబాబు ముచ్చటగా మూడోసారి చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణమే రూ.800 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచుతూ అధికారికంగా ప్రకటన చేయడం అంటే ప్రజలను దొంగ దెబ్బతీయటమేనని పేర్కొంది. 2009తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సగం కంటే ఎక్కువగా తగ్గాయని, ఇలాంటి సమయంలో విద్యుత్తు చార్జీలను పెంచాల్సిన అవసరమే లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఎగవేయటం వల్లే డిస్కమ్‌లు ఆ భారాన్ని ప్రజల మీద మోపుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని పార్టీ అభిప్రాయపడింది. విద్యుత్ చార్జీల పెంపును వెంటనే వెనక్కు తీసుకొని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావటంతో పాటు భారీ మూల్యం చెల్లించుకొనక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 2017-18 ఏడాదికిగానూ 3.6 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఛార్జీల పెంపు నుంచి వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు లభించగా, అలాగే గృహ వినియోగదారులకు 1-200 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపు లేదు. 200 యూనిట్లు నుంచి 500 వందల యూనిట్ల వరకూ 3శాతం పెంచింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో రూ.800 కోట్లు భారం పడనుంది. -
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2017-18 ఏడాదికిగానూ 3.6 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఛార్జీల పెంపు నుంచి వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు లభించగా, అలాగే గృహ వినియోగదారులకు 1-200 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపు లేదు. 200 యూనిట్లు నుంచి 500 వందల యూనిట్ల వరకూ 3శాతం పెంచింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో రూ.800 కోట్లు భారం పడనుంది. -
పంచాయతీలకు కాసుల గలగల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను అవస్థలు పెడుతున్నా... గ్రామ పంచాయతీల్లో మాత్రం పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయి. పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నుల చెల్లింపునకు అవకాశం కల్పించడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. దాంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా పాతనోట్లతో పన్నులు, బకాయిలు చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో నాలుగు రోజులుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖజానా కళకళలాడుతోంది. పలు గ్రామాల్లో పాత బకాయిలతో పాటు వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లించా ల్సిన ఆస్తిపన్నును కూడా చెల్లిస్తుండడం గమనార్హం. ఇంతకుముందు ఇంటింటికీ తిరిగి పన్ను కట్టాలని అడిగినా వసూళ్లు జరిగేవి కావని, ఇప్పుడు పన్ను చెల్లించేం దుకు పాతనోట్లతో జనం బారులు తీరుతు న్నారని కొందరు గ్రామ పంచాయతీల సర్పంచులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతనోట్లతో ఆస్తిపన్ను చెల్లించుకునే అవకా శాన్ని మారుమూల గ్రామాలు సైతం వినియోగించుకుంటున్నారని.. ముఖ్యంగా పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఆస్తి పన్నులు వంద శాతం వసూలయ్యే అవకాశం కనిపిస్తోందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపు తుండడాన్ని గమనించి పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో రోజువారీగా దండోరా వేయిం చడంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డుకో పన్ను వసూలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే పంచాయతీ సిబ్బందే ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేసి రసీదులు అందజేస్తున్నారు. మొత్తంగా గత 4 రోజుల్లో అనూహ్యంగా రూ.21 కోట్లకు పైగా పన్నులు వసూలు కావడం, పాత నోట్లతో పన్ను చెల్లింపునకు కేంద్రం మరింత గడువు ఇవ్వడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆస్తిపన్ను వసూలుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చొరవ చూపడం, కొత్త జిల్లాల్లో డీపీవోలుగా నియమితులైన అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరచడంతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌తో అదనపు నిధులు పాత బకాయిలతో పాటు ఈ ఏడాది వంద శాతం ఆస్తిపన్ను వసూలైన గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి పెర్ఫార్మెన్స్ గ్రాంటు రూపేణా అదనపు నిధులు అందనున్నాయి. కేంద్రం ఇచ్చే ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌లో 50 శాతం నిధులను గతేడాది కంటే ఐదుశాతం అధికంగా ఆస్తిపన్ను వసూలు చేసిన గ్రామ పంచాయ తీలకు, మరో 50 శాతం నిధులను ఈ ఏడాది వంద శాతం పన్నులు వసూలు చేసిన గ్రామ పంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ.105 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్ లభించగా.. వచ్చే ఏడాది రూ.195 కోట్లను ఇవ్వనున్నారు. సాధారణంగా వచ్చే అభివృద్ధి నిధులకు తోడుగా మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఇస్తారు. దీంతో అభివృద్ధి పనులకు మరింత తోడ్పాటు లభిస్తుంది. -
'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకాయిలు చెల్లించ వచ్చన్న వెసులు బాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దయిన నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరు తుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకాయిలు వసూలవుతున్నాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీకి రూ.157 కోట్లు జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.157 కోట్లు వసూలయ్యాయి. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూలైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యాయి. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యాయి. కొందరు వినియోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. పెరిగిన బకాయిల చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి మొండి బకాయిలు పెద్ద ఎత్తున వసూలవు తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ–చలాన్లను కూడా వాహన దారులు రద్దయిన నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ–సేవ, ఈ–సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు త్వరలో చార్జీల మోత మోగనుంది. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడుకు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. ఈ సందర్భంగా సామాన్య, గృహ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ చార్జీల పెంపుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. 100 యూనిట్ల లోపు ఎలాంటి పెంపుదల ఉండదని.. 100 యూనిట్ల పైబడి స్వల్ప పెరుగుదల ఉంటుందని సమాచారం. విద్యుత్ చార్జీల పెంపుకు అధికారులు ప్రతిపాదనలు ఇవ్వగా, ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంచాలన్నదానిపై గురువారం తుది నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంచనున్నారు. 30 కిలోమీటర్ల లోపు పల్లెవెలుగు బస్సుల్లో రూపాయి, 30 కిలోమీటర్ల పైన 2 రెండు రూపాయలు, పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో 10 శాతానికి మించకుండా ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. -
కరెంటు బాదుడుకు బ్రేక్
చార్జీల పెంపునకు సీఎం ససేమిరా చివరి క్షణంలో వాయిదా పడిన పెంపు రూ.1,736 కోట్లకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చివరి క్షణంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకించడంతో విద్యుత్ చార్జీల పెంపుపై పీటముడి పడింది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కొత్త టారీఫ్‌ను ప్రకటిస్తే వచ్చేనెల 1 నుంచి చార్జీల పెంపును అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సిద్ధమయ్యాయి. చార్జీల పెంపునకు సీఎం ఒప్పుకోకపోవడంతో మరోనెల పాటు వాయిదా పడే పరిస్థితి నెలకొంది. నష్టాలు తగ్గించుకోండి.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోసం డిస్కంలు కొత్త టారీఫ్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఈఆర్సీ.. డిస్కంలు ప్రతిపాదించిన కొత్త టారీఫ్ పట్టికను యథాతథంగా అనుమతించింది. అయితే డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 500 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తగ్గించడంతో చార్జీల పెంపుతో ప్రజలపై పడే భారం రూ.1,736 కోట్లకు పరిమితమైంది. సీఎం ఆమోదముద్ర వేస్తే తక్షణమే కొత్త టారీఫ్ ప్రకటించేందుకు ఈఆర్సీ ఎదురుచూస్తోంది. అయితే సీఎం అనుమతించలేదు. డిస్కంలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నందున చార్జీల పెంపు తప్పదని, సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 1999లో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లేదని ఆయన అధికార వర్గాలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం డిస్కంలు 14 శాతం నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా గట్టెక్కాలని సీఎం సూచించినట్లు సమాచారం. గృహాలకు మినహాయింపు ? మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ గృహ వినియోగదారులపై భారం మోపడానికి మరింత విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చార్జీల పెంపు నుంచి గృహ వినియోగదారులకు పూర్తిగా మినహాయించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, వ్యాపార రంగాలపై కొంత మేర చార్జీలను పెంచినా గృహ వినియోగదారులపై భారం వేయొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. గృహ కేటగిరీలో 0-100 యూనిట్ల మధ్య విద్యుత్ వాడకంపై గత పదేళ్లుగా యూనిట్‌కు రూ.1.45 మాత్రమే వసూలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో బొగ్గు, ఇంధనం, రైల్వే రవాణా చార్జీలు భారీగా పెరగడంతో గృహ వినియోగదారులపై సైతం చార్జీలు పెంచక తప్పదని అధికారులకు సీఎంకు నివేదించారు. సీఎంను ఒప్పించి గృహ వినియోగంపై సైతం చార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘విద్యుత్ చార్జీల పెంపును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపరుచుకొని నష్టాలను అధిగమించాలని ఆదేశించారు. డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉండడంతో చార్జీలు పెంచకతప్పదని సీఎంకు వివరించాం. సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. చార్జీలు పెంచకపోతే డిస్కంలు ఆర్థికంగా కుప్పకూలుతాయి’’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
విద్యుత్ చార్జీల బాంబు!
1,100 కోట్ల రూపాయలు ఏప్రిల్ నుంచి విద్యుత్తు బాదుడుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం? 941 కోట్ల రూపాయలు 2015-16లో బాబు సర్కారు పెంచిన కరెంటు చార్జీలు సాక్షి, హైదరాబాద్: మరోసారి కరెంటు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచిన బాబు సర్కారు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరో రూ.1,100 కోట్లకు పైగా ప్రజలపై అదనపు భారం వేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. బాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మొత్తం రూ.2 వేల కోట్లకు పైగా భారం మోపుతూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. 2016-17 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి మొత్తం రూ. 22 వేల కోట్లు వసూలు చేయాలని పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.17,700 కోట్ల ఆదాయాన్ని డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.3,188 కోట్లు ఇచ్చింది. వచ్చే ఏడాది కూడా ప్రభుత్వం ఇదే మొత్తం సబ్సిడీగా ఇచ్చే పక్షంలో రూ.1,100 కోట్లకు పైగా అదనపు ఆదాయం అవసరమవుతుందని డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమైనా ఇవ్వాలని లేదా చార్జీల పెంపుద్వారా రాబట్టుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రజలపై భారం వేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. వాస్తవానికి అధిక ధర వెచ్చించి ఎడాపెడా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్న ప్రభుత్వం.. అందుకవుతున్న వ్యయాన్ని కూడా తానే భరించాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇప్పుడు కూడా రూ.1,100 కోట్లకు పైగా చార్జీల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఉచిత విద్యుత్ కూడా కత్తెర వేసే యోచనలో ప్రభుత్వం ఉందని, ఆ మేరకు సబ్సిడీ కూడా తగ్గిస్తే ప్రజలపై మరింత భారం (రూ.1,100 కోట్లకు అదనంగా) పడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా అవసరాన్ని బట్టి శ్లాబుల్లో మార్పునకూ రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళను వచ్చే ఏడాది కూడా యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. భవిష్యత్‌లోనూ విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందనే అశాస్త్రీయమైన లెక్కలు కడుతూ వచ్చే ఏడాది సైతం ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించాలని నిర్ణయించింది. నేడు ఏఆర్‌ఆర్‌లు మాత్రమే! విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గురువారం 2016-17 వార్షిక ఆదాయ, అవసర నివేదికలు మాత్రమే సమర్పించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఏఆర్‌ఆర్‌లలో కేవలం రాబోయే సంవత్సరానికి విద్యుత్ డిమాండ్ ఎంత? ఎంత మొత్తంలో రాబడి ఉండాలనే అంశాలనే పేర్కొంటారు. శ్లాబ్‌ల వారీ వివరాలతో చార్జీల (టారిఫ్) ప్రతిపాదనలను ఆ తర్వాత ఇచ్చే వీలుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొత్త విద్యుత్ చార్జీలకు ఈఆర్సీ ఆమోదం లభిస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఉచితానికి 3 వేల ఎంయూల కోత! రాష్ట్రంలో ఏటా 54 వేల మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఇందులో 11,700 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి సరఫరా అవుతోంది. 2015-16లో వరుసగా తుపాన్లు రావడం, ఖరీఫ్, రబీ సాగు తగ్గడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 3 వేల మిలియన్ యూనిట్ల వరకు తగ్గింది. ప్రభుత్వం ఇప్పుడు దీన్నే కొలమానంగా తీసుకునే ఆలోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 వేల మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ విద్యుత్‌కు కత్తెరేయాలని భావి స్తోంది. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ను తక్కువగా చూపించి, ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. సబ్సిడీని తగ్గిస్తే ఆ మేరకు విద్యుత్ చార్జీల్లో పెంపుదల (రూ.1,100 కోట్లకు అదనంగా) చోటు చేసుకుంటుందన్నమాట. ఒకవేళ డిమాండ్ పెరిగితే ఉచిత విద్యుత్ సరఫరాను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 50 నుంచి 100 యూనిట్ల వరకూ ఉన్న శ్లాబ్ రేట్‌ను తగ్గించే యోచనపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. -
కోతలుండవు కానీ..మోత తప్పదు..
భారీగా పెరగనున్న కరెంటు చార్జీలు 2018-19 నాటికి డిస్కంల నష్టాలు రూ.29,398 కోట్లు నష్టాలను అధిగమించేందుకు కరెంటు చార్జీలు 13 శాతం మేర పెంచక తప్పదు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు 2014-15 సంవత్సరం ముగిసే నాటికి రూ.13,867 కోట్లకు పేరుకుపోయాయి. విద్యుత్ కొనుగోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కరెంటు చార్జీల పెంపుదల లేకపోతే 2018-19 చివరి లోగా నష్టాలు రూ.29,398 కోట్లకు ఎగబాకనున్నాయి. ఒక్క 2018-19లోనే రూ.5,082 కోట్ల నష్టాలను డిస్కంలు మూటగట్టుకోనున్నాయి. కేవలం ఆ ఒక్క ఏడాది నష్టాలను అధిగమించేందుకు ఏకంగా 13 శాతం విద్యుత్ చార్జీలు పెంచాల్సి రావొచ్చు. ఏటేటా పేరుకుపోతున్న నష్టాలను అధిగమించేందుకు భవిష్యత్తులో భారీగా విద్యుత్ చార్జీలను పెంచుకోక తప్పదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ‘24ఁ7 పవర్ ఫర్ ఆల్’పథకం కింద 2018-19లోగా రాష్ట్రంలో అందరికీ నిరంతర విద్యుత్ సరఫరా సదుపాయం కల్పించేందుకు ఈ నెల 11న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ రంగ వాస్తవ స్థితిని తెలిపే సమగ్ర సమాచారంతోపాటు విశ్లేషణలు, భవిష్యత్ కార్యాచరణ వివరాలను ఈ ఒప్పంద పత్రంలో పొందుపరిచారు. ఈ పత్రాన్ని ‘సాక్షి’ సంపాదించింది. అందులోని ముఖ్యాంశాలపై ఈ వారం ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ చార్జీల మోత తప్పదా? ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా డిస్కంల భవిష్యత్ ఆర్థిక పరిస్థితిపై నాలుగు సందర్భాల్లో ప్రభుత్వం విశ్లేషణ చేసింది. 2018-19 నాటికి డిస్కంల నష్టాలు ఏ మేరకు పేరుకుపోనున్నాయి? 2018-19లో ఉత్పన్నమయ్యే నష్టాలను అధిగమించేందుకు సగటున ఎంత శాతం టారిఫ్ పెంచాల్సి ఉంటుందన్న ప్రశ్నలకు ఇందులో సమాధానాలున్నాయి. పెరుగుతున్న విద్యుత్ కొనుగోలు ధరలు, విద్యుత్ చార్జీల్లో పెంపు లేకుండా ‘ప్రస్తుత స్థితి’ యథాతథంగా కొనసాగితే పరిస్థితి ఎలా ఉండనుంది? అలాగే కేంద్రం నుంచి నిధులు రాకుంటే ఎలా ఉంటుంది? సాంకేతిక వాణిజ్య నష్టాల మొత్తం(ఏటీ సీ లాస్) ఒక శాతం పెరిగితే ఏం జరుగ నుంది? డిస్కంల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తే ఎంత ఉపశమనం కలగనుంది? ఈ నాలుగు సందర్భాల్లో విద్యుత్ చార్జీలను ఏ మేరకు పెంచాల్సి ఉంటుందో ఈ కింది పట్టికలో చూడవచ్చు. 7.6 లక్షల ఇళ్లకు కరెంటు లేదు విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లకు 2017-18లోగా విద్యుదీకరణ చేసేం దుకు కార్యాచరణ రూపొందించారు. 2015 మార్చి 31 నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 44,532 ఇళ్లు, గ్రామీణ ప్రాంతా ల్లో 7,21,588 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదు. పవర్ ఫర్ ఆల్ కింద 2017-18లోగా వీటికి విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. ఉత్తర డిస్కం పరిధిలో 44,532 పట్టణ గృహాలు, 3,20,020 గ్రామీణ గృహాలు, దక్షిణ డిస్కం పరిధిలో 4,01,568 గ్రామీణ గృహాలకు విద్యుదీకరణ జరపాల్సి ఉంది. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాయితీ(ఉచిత విద్యుత్)కి అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించేందుకు మళ్లీ సర్వే నిర్వహించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. నష్టాలు, రాయితీల భారాన్ని తగ్గించుకునేందుకు మూడంచెల్లో వ్యవసాయ విద్యుత్‌కు మీటరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీంతో నష్టాల నుంచి వ్యవసాయ విద్యుత్‌ను వేరు చేసి వాస్తవిక నష్టాలను తెలుసుకోడానికి వీలు కలుగనుంది. కెపాసిటర్లు, ఐఎస్ఐ మార్కు పంపుసెట్లను తప్పనిసరి చేయనున్నారు. ఒప్పందం ప్రకారం ఈ మేరకు చర్చలు చేపట్టాలి.. ► స్వల్పకాలిక చర్యగా వ్యవసాయ, ఇతర వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు తక్షణమే మీటర్లను బిగించాలి. ► మధ్యకాలిక చర్యగా అన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేయాలి ► దీర్ఘకాలిక చర్యగా వ్యవసాయ వినియోగదారులందరికీ మీటర్లు బిగించాలి తలసరి వినియోగం ఎక్కువే జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోల్చితే రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం అధికంగా ఉంది. 2014-15లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,394 యూనిట్లు కాగా దేశంలో సగటు వినియోగం 1,010 యూనిట్లు మాత్రమే. కేంద్రం నుంచి 75 శాతం నిధులు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం(ఐపీడీఎస్), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీవై) పథకాల కింద రూ.9,973 కోట్లతో రానున్న మూడేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. అందరికీ విద్యుత్ పథకంలో రాష్ట్రం చేరినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పథకాల కింద 75 శాతం వాటా భరించనుంది. అంటే రూ.7,480 కోట్లు అందిస్తుంది. -
కోతలు.. వాతలు
♦ అనధికార విద్యుత్ కోతలతో వెతలు ♦ ఏజెన్సీలో మరీ దారుణం ♦ ఎల్‌ఆర్‌లు లేవంటున్న అధికారులు ♦ ఈ నెల నుంచే కొత్త చార్జీలు సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చేసింది..తనతో పాటు విద్యుత్ కోతలను తీసుకొచ్చింది. జిల్లాలో అధికారికంగా ప్రకటించకపోయిన్పటికీ, మండల, గ్రామ స్థాయిలో అనధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇవి కేవలం స్థానికంగా ఏర్పడే ఇబ్బందుల వల్లనే తప్ప లోడ్ రిలీఫ్ విధించాల్సిన పరిస్థితి ఇంకా రాలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల విద్యుత్ బిల్లులో కొత్త ధరలు పడనున్నాయి. ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన 2015-16 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్ ప్రకారం కొత్త ధరలతో బిల్లుల భారం పడనుంది. జిల్లాలో 12 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి రోజుకు అందించే విద్యుత్ 16 మిలియన్ యూనిట్లు. ఆ మేరకు విద్యుత్ కోటా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి విద్యుత్ కోతలు విధించడం లేదంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొన్ని గ్రామాల్లో దాదాపు ఒక పూటంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక నీటిపథకాలు పనిచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసుకుని తెచ్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆశాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా ఏజెన్సీలో ఉండే ప్రత్యేక పరిస్థితులు, సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్న మాట వాస్తవమేనని దానిని అధిగమించడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. మరోవైపు ఈ నెల నుంచి జిల్లా ప్రజలపై నెలకు రూ.10.22 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడుతోంది. 200 యూనిట్లు పైబడి వాడే ప్రతి వినియోగదారుడిపై చార్జీల భారం తప్పదు. ఓ వైపు కోతలు, మరో వైపు చార్జీల వాతలు ఈ నెల నుంచే జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. -
ఇది ప్రజా వ్యతిరేక చర్య: ఉత్తమ్ కుమార్
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని, ప్రజా వ్యతిరేక చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొగ్గు, ముడి చమురు ధరలు సగానికి పైగా తగ్గిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సబబు కాదని ఆయన సోమవారిమిక్కడ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, రూ.816 కోట్ల భారాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
హైదరాబాద్ : విద్యుత్ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమన్నారు. ఆయన చెప్పిన లెక్కలు తప్పని తాను నిరూపిస్తే.. చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బొగ్గు రేట్లు 102 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గాయని, అలాంటప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదన్నారు. చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, కేంద్రం అదనపు విద్యుత్ ఇస్తుంటే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల బకాయిలను కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దు చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
లెక్కలు తప్పని తేలితే, రాజీనామా చేస్తారా?
-
'బాబు చక్కటి అబద్ధాలతో కథలు చెప్పారు'
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కటి అబద్ధాలతో కథలు చెప్పారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం ప్రకటన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ గతం గురించి తాము మాట్లాడక తప్పటం లేదని... చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే పరిశ్రమల టారిఫ్‌ను తగ్గించారన్నారు. గతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు... కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్‌ను ఎందుకు కాపాడారని, విప్ జారీ చేసి మరీ ఆ ప్రభుత్వాన్ని కాపాడారని వైఎస్ జగన్ అన్నారు. ఆనాడు ఉన్నది తెలుగు కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. -
'బాబు అబద్ధాలతో కథలు చెప్పారు'