వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. అయిదు రోజుల తర్వాత వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీకి హాజరు అవుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనుంది. దీంతో ప్రజలపై ఏకంగా రూ.941కోట్లు భారం పడనుంది. కాగా ఎనిమిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిన్నటితో ముగిసింది.