ఒక్క ముక్క మాట్లాడారో లేదో మైక్ కట్ ..
హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సభలో గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతుండగానే మరోసారి మైక్ కట్ అయింది. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ కోరినా ఫలితం లేకపోయింది. వైఎస్ జగన్ ఒక్క ముక్కమాట్లాడారో లేదో మైక్ కట్ కావటం గమనార్హం. మరువైపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా విద్యుత్ ఛార్జీల పెంపుకు బీజేపీ వ్యతిరేకమన్నారు.
కాగా సభ వాయిదా అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆసెంబ్లీ ఆవరణలో మీడియాపై ఆంక్షలు దారుణమన్నారు. గతంలో ఇలాంటివి తానెప్పుడూ చూడలేదని... దీనిని ప్రశ్నించేది ఎవరు అని ఆయన అన్నారు.