హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల కవరేజ్పై మీడియాకు స్పీకర్ కార్యాలయం ఆంక్షలు విధించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇతర ప్రత్యక్ష ప్రసారాలు కవర్ చేయొద్దని ఆదేశాలు సూచించింది. విరామం సమయంలో మీడియా పాయింట్ వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లపైనా ఆంక్షలు విధించింది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే..చూపించవద్దంటూ స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ నడుస్తున్నంతసేపూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.