
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చంద్రబాబు .. ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అంటూ మండిపడ్డారు.
అయితే అంతకు ముందు 'అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు' అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ'
Comments
Please login to add a commentAdd a comment