హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కటి అబద్ధాలతో కథలు చెప్పారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం ప్రకటన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ గతం గురించి తాము మాట్లాడక తప్పటం లేదని... చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.
అదే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే పరిశ్రమల టారిఫ్ను తగ్గించారన్నారు. గతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు... కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను ఎందుకు కాపాడారని, విప్ జారీ చేసి మరీ ఆ ప్రభుత్వాన్ని కాపాడారని వైఎస్ జగన్ అన్నారు. ఆనాడు ఉన్నది తెలుగు కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.
'బాబు చక్కటి అబద్ధాలతో కథలు చెప్పారు'
Published Tue, Mar 24 2015 12:09 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement
Advertisement