ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ: బాబు | chandrababu Naidu statement on electric charges | Sakshi
Sakshi News home page

ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ: బాబు

Published Tue, Mar 24 2015 11:53 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ: బాబు - Sakshi

ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ: బాబు

హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ చాలా అవసరమని, విద్యుత్ సంస్కరణలు తెచ్చిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు ఏపీఈఆర్సీ ప్రతిపాదన చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ బోర్డును లాభాల్లోకి తెచ్చామని, విద్యుత్ లోటు కూడా తగ్గించామన్నారు.  తమ హయాంలో విద్యుత్ ఉత్పత్తి బాగా పెంచామని, వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ రంగం పదేళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం ప్రకటన ముఖ్యాంశాలు:

ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఎఫ్సీఏ ఒక్క పైసా కూడా ఉండదు
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఛార్జీలు పెంచడం లేదు
200లోపు యూనిట్లు వాడితే విద్యుత్ ఛార్జీలు పెరగవు
86 శాతం మందికి ఒక్క పైసా కూడా ఛార్జీలు పెరగవు
14 శాతం మందికే విద్యుత్ చార్జీలు పెరుగుతాయి
పేదవాళ్లపై విద్యుత్ భారం వేయం
ఏపీ ఈఆర్సీ 22.5 శాతం  ఛార్జీలు పెంచాలని ప్రతిపాదిస్తే తిరస్కరించాను.
బడ్జెట్లో రూ.3,186 కోట్ల రెవెన్యూ లోటు ఉంది.
నాణ్యత కోసమే విద్యుత్ సంస్కరణలు
అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్ల వల్లనే సమస్యలు
రెగ్యులేటరి కమిషన్ను బలోపేతం చేశాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement