ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారి తప్పనిసరి: హైకోర్టు | Government employees have must and should accountability, says Highcourt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారి తప్పనిసరి: హైకోర్టు

Published Fri, Sep 20 2013 12:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారి తప్పనిసరి: హైకోర్టు - Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారి తప్పనిసరి: హైకోర్టు

ప్రజా సమస్యలపై ఏ వ్యవస్థ స్పందించనప్పుడు చర్యలకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉందని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది.

 

ప్రభుత్వ ఉద్యోగులున్నది ప్రజాసేవ చేయడానికే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారితనంతోపాటు పారదర్శకత ముఖ్యమని పేర్కొంది. అయితే ఏపీఎన్జీవోలు చేస్తుంది సమ్మె కాదని, పోరాటమని ఆ సంఘం తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అలాగే సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయితే వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని హైకోర్టుకు తెలిపారు. ఆ కేసు సంబంధించిన వాదనలు హైకోర్టులో కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement