ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు యాత్ర: అశోక్‌బాబు | Why is chandra babu going on tour, questions Ashokbabu | Sakshi
Sakshi News home page

ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు యాత్ర: అశోక్‌బాబు

Published Sat, Aug 31 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు యాత్ర: అశోక్‌బాబు

ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు యాత్ర: అశోక్‌బాబు

సాక్షి, హైదరాబాద్: ఎవరి ఆత్మగౌరవం తగ్గిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర తలపెట్టారని ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా యాత్ర ప్రారంభిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని శుక్రవారం ఆయన ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ హెచ్చరించారు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.
 
  తెలంగాణలో పాదయాత్ర సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చానని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో ఆత్మ గౌరవ యాత్ర ప్రారంభానికి ముందే సమైక్యవాదంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. నెల రోజులుగా సీమాంధ్రలో జనం రోడ్లమీదకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యాత్రలు చేస్తే వారు భరించే పరిస్థితుల్లో లేరని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement