ఏపీఎన్జీవోలు సభల పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతాంగా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల మీడియా కథనాలు వెలువరించింది.
ఈ నేపథ్యంలో ఈటెల పై విధంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆ సభకు కిరణ్ సర్కార్ అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు టిఎన్జీవోలు నగరంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.