ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్ఫష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు శనివారం హైదరాబాద్లో స్ఫష్టం చేశారు. సమైక్యాంధ్రగానే ఉంచాలన్న ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని పార్టీలకు శుభం కార్డు పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా వారి పక్షాన నిలబడి పోరాడే పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్లితే హైదరాబాద్ నగరంలో సమైక్య మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తాము నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటే తెలంగాణనే తట్టినట్లు అవుతుందని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.