ఏపీఎన్జీవోలకు ప్రభుత్వం జీతాలను నిలిపివేసినందుకు నిరసనగా తమ వేతనాలను కూడా తీసుకోకూడదని పలువురు విశాఖ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవోలకు ప్రభుత్వం జీతాలను నిలిపివేసినందుకు నిరసనగా తమ వేతనాలను కూడా తీసుకోకూడదని పలువురు విశాఖ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, అవంతి శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.