హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తే మరిన్ని అపోహలు పెరిగే ప్రమాదముందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు యూపీఏ సమన్వయ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో..రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర జాప్యం చేస్తే ప్రజల్లో అపోహలు పెరిగే అవకాశముందన్నారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభ అనేది పరిపాలనా అంశానికి సంబంధించినదన్నారు. ఆ విషయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారన్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, సభకు ర్యాలీలుగా రాకూడదని ఆంక్షలు కూడా విధించింది. సీమాంధ్రలు సభకు అనుమతిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.