హైదరాబాద్: ఏపిఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభనపై గత కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభజన విషయమై టీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేనని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు.
కాగా, ఏపి ఎన్జీఓల సమైక్య సభకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ కూడా విజయవంతమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సమైక్యవాదాన్ని బలంగా వినిపించాం: ఏపీఎన్జీవోలు
Published Sat, Sep 7 2013 6:19 PM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement