'సీఎం కిరణ్ తొలి బంతి తెలంగాణకు అనుకూలం'
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చలో భాగంగా అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేసిన తొలి బంతి తెలంగాణకు అనుకూలంగానే ఉంది అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో అసెంబ్లీలో కీలక ఘట్టం ముగిసింది అని కోదండరాం వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ ఏర్పాటు విషయంలో అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఏమి జరిగినా తుది నిర్ణయం కేంద్రానిదే అని కోదండరాం అన్నారు.
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే.