నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీజేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అని వర్గాల ప్రజలు, తెలంగాణ వాదులు బంద్‌లో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ జాగృతి..
తెలంగాణ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీటీఎఫ్...
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు నిరసన గా జరిగే బంద్‌కు ఏపీటీఎఫ్ మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పన్నాల గోపాల్‌రెడ్డి, ఆర్. రామనర్సయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన రా ష్ట్రంలో తమ సంఘం కూడా తెలంగా ణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుందని వారు పేర్కొన్నారు.
టీజాక్ట్...
బంద్‌కు టీ-జాక్ట్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా చైర్మన్ వి.లక్ష్మీనారాయణ యాదవ్, కో-చైర్మన్‌లు ఘనపురం భీమయ్య, ఎస్. శేఖర్, ఎన్. సోమలింగం, నర్సిరెడ్డి, మోతీలాల్‌నాయక్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. కేం ద్రం తెలంగాణపై వివక్షను విడనాడాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ నోరుమెదపని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇప్పు డు హఠాత్తుగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి విరాళాలు అందజేస్తామని ముందుకు రావడం పెద్ద నాటకమని ఎద్దేవా చేశారు.
బంద్‌ను విజయవంతం చేయాలి
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి
నల్లగొండ రూరల్ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బంద్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ వా దులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, వర్తక, కర్షకులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.
తెలంగాణ బంద్‌కు మద్దతు
Published Thu, May 29 2014 1:11 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement