సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో వాతావరణం మొత్తం మారిపోయింది. రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవలే 317 జీవోను పునఃసమీక్షించాలని కరీంనగర్‌లో బండి సంజయ్ జాగరణ దీక్షచేపట్టారు.
కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌కు బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment