సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్, ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తె లిపారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో వాయిదా వేసిన సీసీసీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వాయిదా పడిన ఉస్మానియా వర్సిటీ దూరవిద్య ఎంబీఏ పరీక్షలు ఈ నెల 26న, ఎంసీఈ పరీక్షలు అక్టోబర్ 13న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.