ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి దర్శక నిర్మాతగా మారా రని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ ఆరోపించారు.
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి దర్శక నిర్మాతగా మారా రని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన.. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మాటమార్చి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని మర్శించారు.
మరోసారి అడ్డుకునే కుట్ర
గతంలో కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేస్తే అడ్డుకున్న సీమాంధ్ర నాయకులు ప్రస్తుతం మరోసారి అదే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖరాశారని, ఇప్పుడు మాట మా ర్చి ప్రజల ఆకాంక్షను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్రుల సభకు అనుమతి ఇవ్వడం వెనుక సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేశ్‌రెడ్డిల కుట్ర దాగుందన్నారు. హైదరాబాద్ తెలంగాణదే అని, కేంద్ర పాలిత ప్రాంతానికి ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు.
తెలంగాణ బంద్ విషయమై జేఏసీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అయినా పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. పదవినుంచి తొలగించాలి తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు పల్ల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమా ల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించనున్నామన్నారు. వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు ఓమయ్య, ఎనుగందుల మురళి, రాజు గౌడ్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు