సమైక్యాంధ్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు
‘ముఖ్యమంత్రివి డ్రామాలు’
Published Sun, Feb 2 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. శనివారం ఆయన పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కు అనుకూలంగా సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని కేం ద్రం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి, రాజ కీయ సంక్షోభం సృష్టిస్తే... పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదన్నారు. ఇప్పు డు తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో విభజన బిల్లును అడ్డుకునే సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ప్రశంసాపత్రాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు కెఎ నాయుడు, డీవీజీ శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాల కృష్ణ, ఎస్‌ఎన్‌ఎం రాజు, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement