
3 వేల మంది నాట్య ప్రదర్శన.. నాలుగు రికార్డుల నమోదు
సమతాస్ఫూర్తి కేంద్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): మూడు వేల మంది చిన్నారులు.. నర్తించిన వివిధ నృత్య రూపకాలు నాలుగు రికార్డులను నమోదు చేశాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతాస్ఫూర్తి కేంద్రం ఇందుకు వేదిక గా మారింది.
సమతాకుంభ్–2025 తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘంటసాల పవన్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం చే సిన నాట్యం ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల చిన్నారులు వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య గోల్డెన్ స్టార్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చిన్నారులకు మంగళశాసనాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment