
తొలిసారి 16 వేల మెగావాట్లను అధిగమించిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు నమోదైంది. బుధవారం ఉదయం 7.55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు పెరిగింది. ఈనెల 10న ఏర్పడిన 15,998 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డును తాజాగా రాష్ట్రం అధిగమించింది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లను దాటడం ఇదే తొలిసారి.
వేసవి ప్రారంభంలోనే విదుŠయ్‌త్ డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.