power demand
-
హైదరాబాద్‌లో అప్పుడే దంచేస్తున్న ఎండలు
భానుడు భగ్గుమంటున్నాడు. తాజాగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు (High Temperature) 35.7 డిగ్రీలు నమోదు కాగా.. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపషమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు పనిచెప్పారు. దీంతో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) అమాంతం పెరిగింది. సగటున విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా.. అది తాజాగా 70ఎంయూకి దాటింది.సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు, కనిష్టంగా 21.3 డిగ్రీలు నమోద య్యాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలను ఆన్ చేస్తున్నారు. మొన్నటి వరకు మూలన పడిన కూలర్లు (Air Coolers) మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఇంట్లోనే కాదు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి (February) మొదటి రెండో వారం వరకు గ్రేటర్లో రోజు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 70 ఎంయూ దాటింది. అత్యవసరమైతేనే.. ఎల్సీలకు అనుమతి విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ చర్యలు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజు లైన్లను సరి చేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పక్కగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వర్క్స్ నిర్వహిస్తుంది. వారం పది రోజుల్లో వీటిని కూడా పూర్తి చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్, రెండో మూడో వారంలో టెన్త్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియరెన్స్ (ఎల్సీ)లకు స్వస్తి చెప్పింది. అత్యవసరమైతే తప్ప.. ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు.ఫిబ్రవరిలోనే.. ఏప్రిల్ డిమాండ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ట (3435 మెగావాట్లు)డిమాండ్.. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే (3455 మెగావాట్లు) నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మే చివరి నాటికి రోజు సగటు డిమాండ్ 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళికలు 60 శాతానికి మించి లోడు ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ప్రత్యమ్నాయ మార్గాలకు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 571 (33కేవీ) సబ్స్టేషన్లు ఉండగా, వీటి సామర్థ్యం 9,675 ఎంవీఏగా ఉంది. కొత్తగా మరో 213(33/11 కేవీ) సబ్స్టేషన్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ఆయా సబ్స్టేషన్ల నిర్మాణ పనులు అప్పగించి, నిర్ధేశిత లక్ష్యం లోగా వాటిని పూర్తి చేయించాలని డిస్కం నిర్ణయించింది. అంతేకాదు కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, ఏడు వేల కిలో మీటర్ల 11 కేవీ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదవండి: హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలుసీఎండీ ముషారఫ్ ఫరూఖీ రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఈలు, సీజీఎంలు, డీఈలతో సమావేశాలు ఏర్పాటు చేసి, లైన్ల పునరుద్ధరణ, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, కూకట్పల్లి, గండి మైసమ్మ, అమీన్‌పూర్‌లలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.212.20 కోట్లతో బౌరంపేటలో కొత్తగా నిర్మించిన 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఈ నెలాఖరు లోగా ఛార్జ్ చేయనున్నారు. ఫైళ్ల పెండింగ్‌పై సీఎండీ సీరియస్ సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో కొత్త కనెక్షన్ల జారీకి సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటాన్ని సీఎండీ ఫారూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా కనెక్షన్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టాల్సి వచి్చందని నిలదీసినట్లు తెలిసింది. నిర్దేశించిన గడువులోగా కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని కొంత మంది ఇంజినీర్లు తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితిలో మార్పు రాకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలిసింది. -
విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు నమోదైంది. బుధవారం ఉదయం 7.55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు పెరిగింది. ఈనెల 10న ఏర్పడిన 15,998 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డును తాజాగా రాష్ట్రం అధిగమించింది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లను దాటడం ఇదే తొలిసారి. వేసవి ప్రారంభంలోనే విదుŠయ్త్ డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
కరెంట్ ‘కాలి’పోతోంది
సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చర్యలు ఎండలకు భయపడి జనం బయటకు రావడం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు. అవుట్డోర్ వర్క్స్ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్ అకస్మాత్తుగా 500 వాట్స్ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్ డ్రాల్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది. ఇంతలా కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్ ఉన్పప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు, సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు. అన్నిటా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్ఫార్మర్లను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్ స్థంభాల మీద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి. స్థంభం కూలిపోతే, దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చడానికి సమయం పడుతోంది. ఈ లోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్ శాఖ ఉంది. -
ఎక్కడా విద్యుత్ కోతలు లేవు
సాక్షి, అమరావతి: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడటంలేదు. మండు వేసవి వస్తే గత ప్రభుత్వంలో గంటల తరబడి విద్యుత్ కోతలు గుర్తొస్తాయి. టీడీపీ హయాంలో గృహ వినియోగదారులకు పెట్టిన ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్)లు, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. కానీ గత ఐదేళ్లలో ప్రజలు వేసవి విద్యుత్ కష్టాలను మర్చిపోయేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. ముందస్తు ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దారు. దీనిద్వారా ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందుతోంది. ఈ వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ భారీగా 236 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడా విద్యుత్ కోతలు, అవాంతరాలు లేకుండా సరఫరా జరుగుతోంది. అయితే వేసవిలో సబ్ స్టేషన్లు, లైన్ల మరమ్మతులకు చేపట్టాల్సిన సాధారణ మెయింటెనెన్స్, వ్యవసాయ ఫీడర్లను ఇతర ఫీడర్లతో వేరుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, భారీ ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగులు పడటం, ఉడుతలు, బల్లులు, పక్షులు, పాములు వంటి చిరు ప్రాణులు ఫీడర్లను దెబ్బతీయడం వంటి కారణాల వల్ల పలు ప్రాంతాల్లో స్వల్ప కాలం పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది.అది కూడా 23 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే. ఇది మినహా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృధ్వీతేజ్, ఆంధ్రప్రదేశ్ మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీ కె.సంతోషరావు స్పష్టం చేశారు. వారు ‘సాక్షి’కి బుధవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. » అనంతపురం సర్కిల్ పరిధిలోని 33/11కెవి సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఆ మండల పరిధిలోని గ్రామాల్లో 28వ తేదీన విద్యుత్ సరఫరా ఉండదని ఈనెల 27న పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశాం. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాం. » కదిరిలోని 132/33 కెవి సబ్స్ట్షేన్ సమీపంలో పిడుగుపాటు కారణంగా సబ్ స్టేషన్ మరమ్మతుకు గురవడంతో దాని పరిధిలోని తొమ్మిది 33/11 కెవీ సబ్స్టేషన్లకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాం. » వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేయడం ద్వారా గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్తును సరఫరా చేసే పనులు జరుగుతున్నాయి. అందుకోసం లైన్ క్లియరెన్స్æ తీసుకోవడం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. » రాజమహేంద్రవరం 33/11 కేవీ తాడితోట సబ్ స్టేషన్‌లోని 11 కేవీ గాంధీపురం ఫీడర్పై ఉదయం 07.20 గంటలకు చెట్ల కొమ్మలు పడటం వల్ల కాసేపు కరెంట్ ఆగింది. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) స్విచ్‌ను మార్చి, కొమ్మలను తొలగించి 45 నిమిషాల్లోనే సరఫరాను పునరుద్ధరించారు. » శ్రీకాకుళం సర్కిల్ ఇచ్ఛాపురం టౌన్లో ఇన్కమింగ్ వైపు ఉన్న లైవ్ వైర్, క్రాస్ ఆర్మ్‌కి మధ్య బల్లి తాకింది. దీంతో ఏఎస్ పేట కాలనీ వద్ద హై టెన్షన్ (హెచ్‌టీ) ఇన్కమింగ్ సైడ్ జంపర్ కట్ అయ్యింది. దీనివల్ల ఇచ్ఛాపురంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేవలం 23 నిమిషాల్లోనే దీనిని సరిచేసి విద్యుత్తు సరఫరా చేశాం. రాష్ట్రంలో ఇంతకు మించి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేవు. పరిశ్రమలు, గృహ, వాణిజ్య వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వినియోగం జరిగింది. గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. -
డిమాండ్‌కు తగ్గట్లు కరెంట్ కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటికాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్ డిమాండ్ 11,926 మెగావాట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడకుండా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్ నుంచి 21.635 మి.యూ, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. నెల రోజుల్లో పవన విద్యుత్ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్ ఫోర్కాస్ట్ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్‌టెర్మ్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కోసం ముందస్తు బిడ్లు దాఖలు చేస్తున్నాయి. తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. -
కరెంట్ కోతలుండొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వేసవిలో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లభ్యత ఉందని.. ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రతతో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కరెంట్ పోయిందనే ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు జారీ చేశారు. అత్యవసర సేవలైన విద్యుత్, తాగునీటి సరఫరాలపై తొలుత సమీక్ష నిర్వహించాలని సీఎం భావించినా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం సూచనలు జారీ చేశారని సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నా, కోత లేకుండా విద్యుత్‌ను అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు. తాగునీటి సరఫరాకు యాక్షన్‌ప్లాన్ అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్‌వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. గ్రామాలవారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్రస్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరత అధిగమించేందుకు వాటర్‌ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటకు చేరేలా చూడాలని, అందుకు సరిపడా ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండోవారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. – గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ వినియోగం ఉంటే.. 2024 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో సగటున రోజుకు 251.59 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది. – గత ఏడాది మార్చి 14న అత్యధికంగా 297.89 ఎంయూల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది 308.54 ఎంయూల వినియోగం జరిగి కొత్త రికార్డును సృష్టించింది. – గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. -
విద్యుత్ డిమాండ్‌కు తగిన ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, దానికి తగినట్లు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్ చెప్పారు. దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థలు, ఉత్పత్తి సంస్థలు కలిసికట్టుగా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరిందని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సమైక్యంగా పనిచేయాలని గత ఏడాది ఎస్ఆర్పీసీ నిర్ణయించిందని, ఇదే లక్ష్యంతో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్చించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పదిశాతం పెరుగుతుందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) అంచనా వేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ డిమాండు పెరుగుదల ఇలాగే ఉంటుందని కేంద్ర ఇంధనశాఖ (పవర్ సెక్టార్) కూడా అంచనా వేసిందన్నారు. అందువల్లే గడువు దాటిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసేయకుండా పకడ్బందీగా మరమ్మతులు చేసి 2030 వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని ఆదేశించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలు త్వరితగతిన మరమ్మతులు (ఓవరాయిలింగ్) పూర్తిచేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీకి కొంత అనుకూలం కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్లు గత ఏడాది సీవోడీ చేసుకుని వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడం రాష్ట్రానికి చాలా వరకు కలిసి వచ్చే అంశమని చెప్పారు. గత నెలలో డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో అదనంగా 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ అంశం థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంపుదల, సరఫరాలో సమస్యలపై చర్చించి ఉత్తమ పరిష్కార మార్గాలకు అన్వేషించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ కె.వి.భాస్కర్, ఏపీ జెన్కో డైరెక్టర్లు బాబ్జీ (థర్మల్), సయ్యద్ రఫి (హెచ్ఆర్), ఎస్ఆర్పీసీ 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ మెంబర్ సెక్రటరీ అసిత్సింగ్, పలువురు ఉన్నతాధికారులు, ఎన్టీపీసీతోపాటు దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌కో, జెన్కో ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
సాగుకు పగలు మాత్రమే విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని.. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటివేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటే సౌర, పవన విద్యుత్‌తో తీర్చవచ్చ ని వివరించింది. ఈ నెల 1న దేశంలో పగటిపూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు (ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లకు సమానం) పెరిగిపోయినా తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈ నెల 1న ఆ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని.. అందువల్ల వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగటివేళలకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఈ నెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ లేఖలోని వివరాల మేరకు.. 23 శాతం పెరిగిన డిమాండ్ దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఆ నెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్ యూ నిట్లకుపైగా విద్యుత్ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్‌తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మి.యూనిట్ల కొరత ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. దక్షిణాదిలోనే కొరత అధికం దేశవ్యాప్తంగా చూస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జలవిద్యుదుత్పత్తి జరగగా.. ఈసారి 40 గిగావాట్లలోపే ఉండటం గమనార్హం. జూన్–సెపె్టంబర్ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉండగా.. 2–3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలుండగా.. గ్యాస్ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. విద్యుత్ డిమాండ్ తీర్చడానికి కేంద్రం సూచించిన చర్యలివీ.. ♦ విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలి. ♦ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలి. ♦ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టు కోవాలి. ళీ నాణ్యత లేని బొగ్గు, యాష్ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక.. 12–14 గిగావాట్ల విద్యుత్ లభ్యత లేకుండా పోయింది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలి. ♦ ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకో వాలి. ళీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్‌ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్‌ను పవర్ ఎక్స్చేంజి ల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలి. ♦ డిమాండ్ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. ♦ నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలి. -
విద్యుత్ వినియోగానికి పరిమితులు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం ప్రకటించాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్ని రంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్‌గానీ లేదు. సెప్టెంబర్ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్–సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు అభ్యర్థన పంపించాయి. ఆ అభ్యర్థన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండ్‌తో పరిశ్రమలకు ఊరట రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిగా తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్షలో అభిప్రాయానికి వచ్చారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి అమలు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి కారణంగా.. కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో పరిమితి–నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని కమిషన్‌కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. రోజుకి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.9.10 వెచ్చించి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రావిుక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్‌గానీ, విద్యుత్ వాడకంలో పరిమితులుగానీ లేవని తెలియజేస్తున్నాం. – కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
భవిష్యత్ వెలుగులకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లుగా భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేయకపోతే అకస్మాత్తుగా తలెత్తే దుష్పరిణామాలు అంధకారంలో ముంచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)ను రూపొందించాయి. రానున్న పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేశాయి. పెట్టుబడులు ఎంత పెట్టాలనే దానిపై లెక్కలుగట్టాయి. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇచ్చిన ఈ నివేదికలపై శనివారం ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. నిజానికి.. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యలయంలో జరిగే ఈ విచారణ ఈసారి విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరగనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటైన మరుసటిరోజే తొలి బహిరంగ విచారణ జరుగుతుండటం విశేషం. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికపై ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంత అవసరం.. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకూ 5వ కంట్రోల్ పీరియడ్‌కు, 2029–30 నుంచి 2033–34 వరకూ 6వ కంట్రోల్ పీరియడ్‌కు వివిధ అంశాలపై సమగ్ర అంచనా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం.. ప్రస్తుతం సోలార్ రూఫ్‌టాప్ సిస్టం సామర్థ్యం రాష్ట్రంలో 150.152 మెగావాట్లుగా ఉంది. ఇది 2034 నాటికి 661.88 మెగావాట్లకు పెరుగుతుంది. అలాగే, విద్యుత్ వాహనాలు ప్రస్తుతం 68,975 ఉన్నాయి. వీటి సంఖ్య 2034 నాటికి 10,56,617కు చేరుతుంది. ఇవి ప్రస్తుతం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతుండగా, పదేళ్లకు 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇక గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఏడాదికి 17,330 మిలియన్ యూనిట్లు ఉంది. 2034 నాటికి ఇది 31,374 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. అన్ని కేటగిరీలకూ కలిపి ప్రస్తుతం 65,228 మిలియన్ యూనిట్లు ఉండగా, 2034కు 1,30,899 మిలియన్ యూనిట్లు అవసరమవుతుంది. సాంకేతిక, పంపిణీ నష్టాలు పోనూ 1,45,331 మిలియన్ యూనిట్లు ఉంటే తప్ప అందరి అవసరాలు తీరవు. విద్యుత్ ఎలా వస్తుందంటే.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)కు 3,410 మెగావాట్ల థర్మల్, 1,774 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవికాక.. ♦ విజయవాడ వీటీపీఎస్‌లో 5వ యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ♦ లోయర్ సీలేరులో 230 మెగావాట్లు, పోలవరంలో 560 మెగావాట్ల 1 నుంచి 7 యూనిట్లు 2024–25లో, 8 నుంచి 12 యూనిట్లలో 400 మెగావాట్లు 2025–26లో, అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ 1 నుంచి 8 యూనిట్లలో 1,200 మెగావాట్లు 2027–28లో, ఇక్కడే 150 మెగావాట్ల 9వ యూనిట్ 2028–29లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. ♦ మొత్తంగా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యం 5,184 మెగావాట్లుకు అదనంగా 3,340 మెగావాట్ల సామర్థ్యం ఏపీ జెన్కో ద్వారా తోడవ్వనుంది. ♦ ఇవికాక.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇండిపెండెంట్ పవర్ జనరేటర్లు, సౌర, పవన విద్యుత్ వస్తుంది. ♦ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 3 వేల మెగావాట్లు, 2027లో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లు రానుంది. ♦ ఈ విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. ♦ ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు 10 నుంచి 2029 నాటికి 71కి పెరగనున్నాయి. లైన్లు కూడా 969.15 సర్క్యూట్ కిలోమీటర్లు నుంచి 4,837.16 సీకేఎంకు విస్తరించనున్నాయి. ♦ ఈ మొత్తం ట్రాన్స్మిషన్ కోసం రూ.15,729.41 కోట్లు వ్యయం కానుంది. ♦ ఇదికాక మౌలిక సదుపాయాల కల్పన, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికి మరింతగా ఖర్చుచేయనున్నారు. -
Fact Check: ఆరుబయట ఉంటే తడవదా!?
సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు.. ‘కోత’ లేకుండా సరఫరా.. ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్‌లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్‌కు అదనంగా బహిరంగ మార్కెట్లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది. వర్షాకాలంలో సర్వసాధారణం వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. -
భారీగా విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 13వేల మెగావాట్లకు మించిపోయింది. ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్ డి మాండ్ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది. గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో యాజమాన్యం అంచనా వేస్తోంది. జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. రోజూ రూ.30 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్ కొనసాగించడానికి పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. -
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ) : నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దక్షిణాదిన ఈ ఏడాది మే, జూన్ నెలల్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసి దక్షిణ ప్రాంతీయ గ్రిడ్ సామర్థ్యాన్ని నిరూపించామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ రంగ అభివృద్ధి నిమిత్తం శుక్రవారం విశాఖపట్నంలో మొదలైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) 47వ సమావేశం శనివారం ముగిసింది. ప్రాంతీయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న విజయానంద్ అధ్యక్షతన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్పీసీతో పాటు 45వ టెక్నికల్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీసీసీ) సమావేశం కూడా జరిగింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులకు రాష్ట్ర విద్యు త్ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలు ఆతిథ్యం ఇచ్చా యి. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభు త్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని.. దీనికి ఖర్చుచేసే మొత్తాన్ని రైతుల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు బదిలీ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం అమలుచేస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృథి్వతేజ్ ప్రతినిధులకు వివరించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ.. ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగ సంస్థలు, వాటి నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవడం, అందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.. దక్షిణ గ్రిడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్పీసీ, ఎస్ఆర్ఎల్డీసీ సంస్థల నుంచి అవసరమైన సలహాలు పొందడం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించారు. అలాగే, అంతర్రాష్ట్ర విద్యుత్ రవాణా చేసే ఇంట్రా స్టేట్ లైన్లకు సెంట్రల్ పూల్ నుంచి ట్రాన్స్మిషన్ చార్జీలను పొందేందుకు గతేడాది డిసెంబర్ 6న ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది. -
ఉత్పత్తిలో జెన్కో పరుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఏటా 8% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు అంచనాలకు మించి జెన్కో 45.38% విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతోంది. తత్ఫలితంగా ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న సామర్థ్యం.. నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో ఇటీవల 800 మెగావాట్ల 8వ యూనిట్లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరగనుంది. మరోవైపు మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇతర చిన్న జలవిద్యుత్ కేంద్రాల మాదిరి ఇది సీజన్లో పనిచేసేది కాదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి జెన్కో అనుమతి తీసుకుంది. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనుంది. సరికొత్త రికార్డులు.. రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండ్ గతేడాది మే నెలలో 5,947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1,989.37 మిలియన్ యూనిట్లు (33.45 శాతం) సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2,917.99 మిలియన్ యూనిట్ల (45.38 శాతం)ను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించింది. గతేడాది కంటే 989.37 మిలియన్ యూనిట్లు (12 శాతం) అధికంగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన భారం నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు చార్జీల పెంపు భారం తప్పుతోంది. ప్రభుత్వ సహకారం.. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో అత్యధిక భాగం ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్దేశించారు. వారి మార్గదర్శకం మేరకు, ప్రభుత్వ సహకారంతో తక్షణమే 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. అదే విధంగా థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి జూలైలో శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో థర్మల్, హైడల్, సోలార్ కలిపి ఏపీ జెన్కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,789.026 మెగావాట్లకు చేరుతుంది. – కేవీఎన్ చక్రధర్ బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
వేసవిలోను నిరంతర విద్యుత్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రణాళికాయుతంగా విద్యుత్ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఇంధనశాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లోను ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. 33 కేవీ సబ్స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్‌స్టేషన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని, మెరుగైన విద్యుత్ సరఫరాకు సహకరిస్తాయని తెలిపారు. దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు అర్హతే ప్రామాణికంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, తొమ్మిది గంటలపాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్ దరఖాస్తులకు గడువు ఉండకూడదన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయానికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు డిస్కం అధికారులు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుదీకరణను గడువులోగా పూర్తిచేయాలని మంత్రి కోరారు. పంపిణీ నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని, పారిశ్రామికసంస్థల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే పనులు అప్పగించిన సబ్స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లో ఓల్టేజీ ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
ఇక ‘పీక్’లో షాక్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ విధానంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సమీప భవిష్యత్తులో అధిక చార్జీలు విధించి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకు రాయితీ అందించాలనుకుంటోంది. ఈ మేరకు ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 14లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. పీక్ టైమ్‌లో మోత మోగనుంది... ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సంబంధించి వసూలు చేయాల్సిన చార్జీలు ఆయా కేటగిరీల సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండనున్నాయి. వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 20 శాతం, వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 10 శాతం అధిక టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించనుంది. ఇక స్మార్ట్‌మీటర్లు తప్పనిసరి... విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించిన వెంటనే ఈ మేరకు ‘టైమ్ ఆఫ్ డే’టారిఫ్‌ను వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 10 కిలోవాట్లలోపు గరిష్ట డిమాండ్గల పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు... 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయం మినహా మిగిలిన కేటగిరీల వినిమోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను అమలుచేయాలని గడువు విధించింది. ఈ గడువుల్లోగా ఆయా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్‌మీటర్లను తప్పనిసరిగా బిగించాల్సి ఉంది. ప్రస్తుత విధానంలో మార్పు ఏమిటి? సాధారణంగా పగటివేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రాత్రివేళల్లో గణనీయంగా తగ్గిపోతుంది. డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి అధిక ధరలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు రాత్రివేళల్లో డిమాండ్ లేక విద్యుత్ మిగిలిపోతోంది. దీనికి పరిష్కారంగా రాత్రివేళల్లో డిమాండ్‌ను పెంచి పగటివేళల్లో తగ్గించడం కోసం టైమ్ ఆఫ్ డే విధానాన్ని డిస్కంలు అమలు చేస్తున్నాయి. డిమాండ్ అధికంగా ఉండే ఉదయం 6–10 గంటలు, సాయంత్రం 6–10 గంటల మధ్య కాలంలో వినియోగించిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే టారిఫ్’పేరుతో అదనంగా రూపాయి చార్జీని విధిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉండే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే ప్రోత్సాహాకాలు’పేరుతో ఒక రూపాయి రాయితీ అందిస్తున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోని–పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, హెచ్‌టీ–2 (బీ) ఇతరత్రా వినియోగదారులు, ప్రార్థనా స్థలాలు, ఎయిర్‌పోర్టులు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజా ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నిర్దేశిత గడువులోగా వ్యవసాయం మినహా మిగిలిన అన్ని కేటగిరీల వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్, రాయితీ విధానం అమల్లోకి వస్తుంది. పీక్ డిమాండ్ ఎన్ని గంటలు? సూర్యరశ్మి ఉండే వేళల (సోలార్ హవర్స్)కు సంబంధించిన టారిఫ్.. ఆయా కేటగిరీల వినియోగదారుల సాధారణ టారిఫ్‌తో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉండాలి. రోజులో విద్యుత్ డిమాండ్ ఎన్ని గంటలపాటు గరిష్టంగా ఉంటుందనే విషయాన్ని ఈఆర్సీ/ఎస్డీఎల్సీలు ప్రకటిస్తాయి. దీని ఆధారంగా టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఖరారు చేస్తాయి. అయితే సూర్యుడు ఉండే వ్యవధికన్నా పీక్ డిమాండ్ గంటల నిడివి ఎక్కువ ఉండరాదు. అన్ని కేటగిరీల వినియోగదారులకు సంబంధించిన టారిఫ్‌ను డిస్కంల వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ, ఇతర చార్జీల విధింపుతో టారిఫ్‌లో జరిగే మార్పులను కనీసం నెల రోజుల ముందే వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు విద్యుత్ బిల్లు/ఎస్ఎంఎస్/మొబైల్ యాప్ ద్వారా తెలియజేయాలి. స్మార్ట్ మీటర్లతో పెరగనున్న లోడ్ స్మార్ట్ మీటర్లను బిగించాక నమోదైన గరిష్ట లోడ్ ఆధారంగా అంతకుముందు కాలం నాటి విద్యుత్ వినియోగంపై జరిమానాలు విధించడానికి వీలు లేదు. కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ వినియోగించినట్టు రికార్డు అయితే, దాని ఆధారంగానే ఆ నెలలో బిల్లులను జారీ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ సంవత్సరంలో నమోదైన మూడు గరిష్ట లోడ్ సామర్థ్యాల్లో అతి తక్కువ లోడ్‌ను ప్రామాణికంగా తీసుకుని సాంక్షన్డ్ లోడ్‌ను సవరించాల్సి ఉంటుంది. -
15,254 మెగావాట్ల గరిష్ట డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం ఉదయం 10:03 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,254 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే నమోదైన 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను మంగళవారం రాష్ట్రం అధిగమించింది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్లుగా పీక్ డిమాండ్ నమోదైంది. వేసవి మొదలవడంతో వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కోసం రైతులు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సాగు విస్తీర్ణం పెరగడం కూడా విద్యుత్ వినియోగాన్ని పెంచింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ సైతం గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రెండు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి 600 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో రోజువారీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్ సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి వరకు పీక్ విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. 13 రోజుల్లో రూ.600 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా విద్యుత్ సంస్థలు ఎఎక్స్చేంజి ల నుంచి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ నెలలో గత 13 రోజుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో 930 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. రోజుకు సగటున రూ. 45 కోట్ల వ్యయంతో 72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 4 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ పూచికత్తుతో తీసుకోవడానికి అనుమతిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 3 వేల కోట్ల రుణం కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలో ఈ మేరకు రుణం విడుదల కానుంది. -
గరిష్టానికి విద్యుత్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆర్థిక కార్యకలాపాలు బలంగా సాగుతుండడం, తయారీ రంగానికి కేంద్రం పెద్ద ఎత్తున మద్దతునిస్తూ ఉండడం, ప్రజల ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల కలసి విద్యుత్ వినియోగాన్ని ఏటేటా ఆల్‌టైమ్ గరిష్టానికి తీసుకెళుతున్నాయి. దీంతో డిమాండ్‌ను చేరుకునేందుకు విద్యుత్ తయారీ సంస్థలు (పవర్ ప్లాంట్లు), బొగ్గు గనుల కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జవవరిలో విద్యుత్ వినియోగం, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 13.5 బిలియన్ కిలోవాటర్ హవర్గా ఉంది. ఇది 12 శాతం వృద్ధికి సమానం. గ్రిడ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జనవరిలో గరిష్ట డిమాండ్ 211 గిగావాట్లుగా నమోదైంది. 2021 జనవరి నెలతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. థర్మల్ ప్లాంట్లు 16 బిలియన్ కిలోవాటర్ హవర్ మేర ఉత్పత్తిని అదనంగా చేశాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం అధికం కావడం గమనించాలి. ఏటేటా పెరుగుదల.. దేశంలో విద్యుత్‌కు డిమాండ్ ఉష్ణోగ్రతల ఆధారితం కాకుండా, నిర్మాణాత్మకంగానే పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్ 6 శాతానికి పైన పెరిగింది. కానీ, గడిచిన దశాబ్ద కాలంలో వార్షికంగా విద్యుత్ సగటు పెరుగుదల 4%గానే ఉండడం గమనించాలి. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నట్టు ‘పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్’ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. తయారీలో 55.4గా ఉంటే సేవల పీఎంఐ 57.2గా జనవరి నెలకు నమోదయ్యాయి. కంపెనీలకు సమస్యలు దేశీయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సరిపడా బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కోల్ ఇండియా ఒక్కటే 90% అవసరా లు తీరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది 12% అధికంగా బొగ్గు సరఫరా జరిగింది. కానీ, విద్యుదుత్పత్తి సంస్థల వాస్తవ అవసరాల కంటే ఇది తక్కువ కావడం గమనించాలి. అందుకే 10% వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసి వాడుకోవాలంటూ కేంద్రం సూచనలు సైతం చేసింది. రైల్వే శాఖ ఫిబ్రవరిలో రోజువారీగా 271 గూడ్స్ రైళ్లను బొగ్గు సరఫరా కోసం నడిపించింది. కానీ, వాస్తవ లక్ష్యమైన రోజు వారీ 313 రైళ్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాంట్లకు కావాల్సినంత బొగ్గును సరఫరా చేయడంలో రైల్వే వైపు నుంచి కొరత ఉంది. ప్రస్తుతం కంపెనీల వద్ద 12 రోజుల విద్యుత్ తయా రీ అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 9 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 2021లో 15 రోజులు, 20 20లో 28 రోజులు, 2019లో 18 రోజులతో పోలిస్తే బొగ్గు నిల్వలు తక్కువ రోజులకే ఉన్నట్టు తెలుస్తోంది. సరఫరా పెంచేందుకు చర్యలు.. బొగ్గు సరఫరా పెంచేందుకు గాను విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటూ జెన్కోలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశీ బొగ్గుతో కలిపి తయారీకి వినియోగించుకోవాలని సూచించింది. దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిచే ప్రైవేటు సంస్థలను సైతం గరిష్ట స్థాయిలో విద్యుత్ తయారీ చేయాలని ఆదేశించింది. పునరుత్పాదక విద్యుత్ తయారీని పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు కొంత వరకు ఉపశమనం కల్పించాయి. కానీ, బొగ్గు ఆధారిత సామర్థ్యంతో పోలిస్తే పునరుత్పాదక తయారీ సామర్థ్యం చాలా తక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికీ థర్మల్ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం సరఫరాలో బొగ్గు ఆధారిత విద్యుత్ 76 శాతం స్థాయిలో ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో పునరుత్పాదక ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ తయారీ 15 శాతం పెరిగింది. విండ్ ద్వారా 50 శాతం పెరగ్గా, సోలార్ ద్వారా 37 శాతం పెరుగుదల ఉంది. మధ్యకాలానికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దాంతో బొగ్గుపై ఆధారపడడం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. -
విద్యుత్ డిస్కంలకు షాక్! కరెంట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం మొదలవుతూనే విద్యుత్ డిస్కంలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న డిమాండ్ ఓవైపు, అవసరానికి తగినంత సరఫరా చేయలేక మరోవైపు కిందామీదా పడుతున్న డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం మీద పడుతోంది. ‘దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల’ విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో అమ్ముకోడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. ఈ అంశంలో ఐఈఎక్స్ వేసిన పిటిషన్‌పై సీఈఆర్సీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీని ప్రభావంతో ఈ వేసవిలో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేసే రాష్ట్రాలపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమితితో నష్టాల పేరిట.. గతేడాది వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సరిపడా అందుబాటులో లేక తీవ్ర కొరత ఏర్పడింది. ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధర యూనిట్‌కు రూ.20కు మించిపోయాయి. అత్యధిక ధరతో కొనుగోళ్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీఈఆర్సీ.. విద్యుత్ ధర యూనిట్‌కు రూ.12 మించరాదని పరిమితి విధిస్తూ 2022 మే 6న సుమోటోగా ఆదేశాలు జారీ చేసింది. అయితే దిగుమతి చేసుకున్న బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్ ధరలు సాధారణంగానే ఇంతకన్నా అధికంగా ఉంటాయి. పరిమితి కారణంగా అవి ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ విక్రయించలేక నష్టపోతున్నట్టు కేంద్రం గుర్తించింది. అలాంటి ప్లాంట్లు ఎనర్జీ ఎక్స్చేంజీల్లో అధిక ధరతో విద్యుత్ విక్రయించుకోవడానికి వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతేడాది అక్టోబర్ 11న ‘హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ‘ఎన్రాన్’ విద్యుత్ ధర ఆధారంగా.. కొత్త విధానానికి అనుగుణంగా.. దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించేందుకు అనుమతి కోరుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజీ గతేడాది చివరిలో సీఈఆర్సీలో పిటిషన్ వేసింది. తర్వాత ఈ ధరను రూ.99 వరకు పెంచాలని అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. మహారాష్ట్రలోని రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ (పూర్వపు ఎన్రాన్ సంస్థ)కు చెందిన విద్యుత్‌ను ఇటీవల యూనిట్‌కు రూ.58.98 భారీ ధరతో విక్రయించినట్టు వివరించింది. ఆ ప్లాంట్ విద్యుత్ వేరియబుల్ కాస్ట్(గ్యాస్/ఇంధన వ్యయం) యూనిట్ రూ.58.48గా ఉందని.. దానికి అనుగుణంగా అధిక ధరను నిర్ణయించాలని కోరింది. దీనిపై సీఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) అధిక ధరను సమర్థించింది. సీఈఆర్సీ దీనిని పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 100 శాతం దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మాత్రమే ‘హైప్రైస్ డే అహెడ్ మార్కెట్’ సెగ్మెంట్ కింద, అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.50 ధరతో విక్రయించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై కొంతకాలం పరిశీలన జరిపిన తర్వాత పునః సమీక్షిస్తామని తెలిపింది. అయితే రెండు దశాబ్దాల కింద ఎన్రాన్ విద్యుత్ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్లాంటు విద్యుత్ ధరను పరిగణనలోకి తీసుకుని గరిష్ట ధరను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడో ఆప్షన్‌గానే.. అధిక ధర విద్యుత్! ఎనర్జీ ఎక్స్చేంజీలో ఈ అధిక ధర (హైప్రైస్ సెగ్మెంట్) విద్యుత్ విక్రయాన్ని మూడో ఆప్షన్‌గా చేర్చారు. ‘డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ విధానం కింద ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో తొలుత సౌర, పవన విద్యుత్ వంటి గ్రీన్ విద్యుత్‌ను అమ్మకానికి పెడతారు. వాటి విక్రయాలు పూర్తయ్యాక థర్మల్ విద్యుత్‌ను విక్రయిస్తారు. ఈ రెండు సందర్భాల్లో బిడ్డింగ్‌లో పాల్గొని విద్యుత్‌ను పొందలేకపోయిన డిస్కంలు.. ‘హైప్రైస్’ విద్యుత్ కోసం బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కనీస ధర సున్నా నుంచి గరిష్ట ధర రూ.50కి మధ్య కోట్ చేయవచ్చు. ఎక్కువ ధరను కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్‌ను విక్రయిస్తారు. ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో కొనుగోళ్లు ఎందుకు? రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సాధారణంగా దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ప్లాంట్ల నుంచి నేరుగా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుంటాయి. వీటి విద్యుత్ ధర ఒప్పందాలను బట్టి యూనిట్‌కు రూ.4.5 నుంచి రూ.6 వరకు ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలు కాకుండా వివిధ ప్లాంట్లు, విద్యుత్ సంస్థల నుంచి బహిరంగ మార్కెట్లో ‘ఎనర్జీ ఎక్స్చేంజీ’ల ద్వారా విద్యుత్ విక్రయాలు కూడా జరుగుతుంటాయి. డిస్కంలు విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ‘డే ఎహెడ్ మార్కెట్ (డీఏఎం)’ సెగ్మెంట్ కింద ఎనర్జీ ఎక్స్చేంజీల ద్వారా అవసరమైన మేర కరెంటు కొని వినియోగదారులకు సరఫరా చేస్తుంటాయి. ఈ కొనుగోళ్ల కోసం ఆన్లైన్లో బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ధర కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్ లభిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రాల డిస్కంలు పోటాపోటీగా బిడ్డింగ్‌లో పాల్గొంటుండటంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. ‘కొనే’ రాష్ట్రాలకు భారమే గత ఏడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిఎక్ఛ్సేంజీల్లో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినా యాసంగి కోసం రైతులకు, ఇతర వినియోగదారులకు సరఫరా సాగించడానికి తెలంగాణ డిస్కంలు రోజుకు రూ.100 కోట్ల నుంచి రూ.165 కోట్లు ఖర్చుచేసి ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేశాయి. పలు ఇతర రాష్ట్రాలూ అత్యధిక ధరతో విద్యుత్ కొన్నాయి. ఇప్పుడు ‘దిగుమతి’ ప్లాంట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకునే అవకాశం రావడంతో.. ప్రస్తుత వేసవి లో విద్యుత్ కొనుగోళ్ల భారం పెరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 17,600 మెగావాట్ల మేర ‘దిగుమతి’ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయని.. వాటి విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోనున్నా యని చెప్తున్నారు. విద్యుత్‌ను ఎక్కువగా కొనే రాష్ట్రాలపై భారం పడుతుందని వివరిస్తున్నారు. -
సాంకేతికతతో ‘పవర్’ఫుల్‌గా ప్రసారం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రసార వ్యవస్థ(ట్రాన్స్మిషన్ నెట్వర్క్)ను మరింత బలోపేతం చేస్తోంది. నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసేందుకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ జీఐఎస్‌కు 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవు లైన్లు, 358 ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీంతో మొత్తం నెట్వర్క్ నిర్వహణ సులభతరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల విధులతో పాటు నెట్వర్క్ సమాచారాన్ని భౌగోళికంగా ఒకే ప్లాట్‌ఫాంపై మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్‌లను ఉపయోగించి డేటాను యాక్సెస్ చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాలకు రూపకల్పన జరుగుతోంది. అలాగే జీఐఎస్ వల్ల ఫీల్డ్ ఇంజనీర్లకు ప్రాథమిక సర్వే నిర్వహించడం సులభంగా మారింది. మరోవైపు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడానికి సహాయపడేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అంతర్గత డిమాండ్ అంచనా నమూనా(ఇన్‌హౌస్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్)ను కూడా అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 99 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్ అవసరాలను ముందే అంచనా వేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలు.. తమ కొనుగోళ్లలో కొన్ని రూ.కోట్లను పొదుపు చేసే అవకాశం ఉంది. ఏపీలో అభివృద్ధి చేసిన ఈ ఫోర్ కాస్టింగ్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లోనే మొదటిది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను తమకూ ఇవ్వాలని ఏపీని కోరుతున్నాయి. సీఎం ఆశయానికి అనుగుణంగా.. – బి.శ్రీధర్, సీఎండీ,ఏపీ ట్రాన్స్‌కో ఇటీవలే రెండు జాతీయ స్థాయి అవార్డులను గెల్చుకున్నాం. భవిష్యత్‌లోనూ విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌కో ఉత్తమ సాంకేతిక విధానాలను అమలు చేస్తోంది. డిస్కంలకు ఇవి సహాయపడతాయి. ఏపీ ట్రాన్స్‌కో విధానాలను తమకూ చెప్పాలని తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కోరాయి. -
లెక్క.. ఇక పక్కా!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో సరికొత్త సాంకేతికత రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి ఒక రోజు ముందు విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పవన విద్యుత్, సౌర విద్యుత్, మార్కెట్ సూచన, డిస్పాచ్ మోడల్, ఫ్రీక్వెన్సీ సూచనల కోసం 4 రోజుల ముందే డిమాండ్‌ను అంచనా వేసేలా ఎనర్జీ ఫోర్కాస్టింగ్ సాంకేతికత (నూతన సాఫ్ట్వేర్)ను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అభివృద్ధి చేసింది. భవిష్యత్ డిమాండ్‌ను ఎదుర్కొనేలా ఏపీ ట్రాన్స్‌కోకు ప్రస్తుతం 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 5532.161 సర్క్యూట్ కిలోమీటర్లు (సీకేఎం) ఉన్నాయి. మరో 12200.9 సీకేఎం 220 కేవీ లైన్లు ఉన్నాయి. 132 కేవీ లైన్లు 13568.18 సీకేఎం పొడవున విస్తరించాయి. వీటి ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏటా సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వచ్చే మార్చినాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు అత్యధికంగా 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీ ట్రాన్స్‌కో గ్రిడ్ నిర్వహణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుత లైన్లపై అదనపు భారం మోపకుండా ఈ అసాధారణ పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో ‘ఎనర్జీ ఫోర్కాస్టింగ్’ కూడా ఒకటని ఏపీ ట్రాన్స్‌కో చెబుతోంది. ముందస్తు అంచనాలతో ప్రయోజనాలు విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక సంప్రదాయ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) కాలం నుండి స్వల్పకాలిక ఒప్పందాలు (షార్ట్ టెర్మ్ టెండర్లు) వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎనర్జీ ఫోర్కాస్టింగ్ ద్వారా థర్మల్, సోలార్, విండ్, గ్యాస్ వంటి ప్రతి విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ నుండి డిస్కంలకు ఎంత విద్యుత్ పంపిణీ చేయాలో నాలుగు రోజుల ముందే తెలుసుకోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఇది అప్డేట్ అవుతుంటుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో విద్యుత్ పంపిణీ ఎక్కడి నుంచి ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. పవర్ జనరేటర్లు, డిస్కంలు తగిన బిడ్డింగ్ వ్యూహాలను రూపొందించడానికి ధర అంచనా డేటాను ఉపయోగిస్తున్నాయి. జనరేటర్ల ధరల గురించి కచ్చితమైన సూచనను తెలుసుకొంటే దాని లాభాలను పెంచుకోవడానికి బిడ్డింగ్ వ్యూహాన్ని రూపొందించవచ్చు. అలాగే మరుసటి రోజు కచ్చితమైన ధర ఎంతో అంచనా వేయగలిగితే డిస్కంలు సొంత ఖర్చులను తగ్గించుకోవడానికి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో, ఫ్రీక్వెన్సీ సూచనలు తెలుసుకోవడంలో జాతీయ స్థాయిలో విద్యుత్ రంగ నిపుణుల సహకారంతో నాలుగు రోజుల ముందే అంచనాలు రూపొందించడానికి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాం. గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి, అతి తక్కువ తేడాతో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయడానికి ఎనర్జీ ఫోర్కాస్టింగ్ మోడల్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్‌ను కొనొచ్చు. తద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. –బీ శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
దేశానికే ఏపీ దిక్సూచి.. ప్రకృతి శక్తితో నిరంతర విద్యుత్
సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రకృతి వనరులను ఒడిసిపట్టి చౌకగా, నిరంతరం విద్యుత్ లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సందర్భాల్లో సైతం ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేసేలా రాష్ట్రంలో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పంప్డ్ స్టోరేజీ పవర్ యూనిట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలు బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అడుగులు ముందే నిలవడం గమనార్హం. గ్రీన్కో ప్లాంట్‌లో సౌర, పవన, హైడల్ విధానాల్లో విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ప్రయోజనాలను సీఎం జగన్ వివరించారు. ఈరోజు ఒక అద్భుతమైన, చారిత్రక సన్నివేశం ఆవిష్కృతమవుతోందన్నారు. శంకుస్థాపన సందర్భంగా తాపీ చేతపట్టి సిమెంట్ వేస్తున్న సీఎం వైఎస్ జగన్ కాలుష్య రహితంగా.. ‘పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్‌ప్లాంటు)ను ‘గ్రీన్కో’ చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్ విద్యుత్ అందుతుంది. కాలుష్య రహితంగా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్న ‘గ్రీన్కోకు’ అభినందనలు. దేశానికి ఈ ప్రాజెక్టు దిక్సూచి కావాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరకే అనువైన విద్యుత్తు.. ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనది. 3 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. ఇందులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం కాగా 3,000 మెగావాట్లు సౌర విద్యుత్తు, 550 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి కానుంది. తద్వారా తక్కువ ధరకే స్థిరమైన, అనువైన నిరంతర విద్యుత్ 24 గంటలు అందుతుంది. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత క్లీన్ ఎనర్జీ. తగ్గనున్న శిలాజ ఇంధనాల వినియోగం ఈ ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్‌ల సముదాయం ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌పీక్ అవర్స్) సోలార్, విండ్ పవర్‌ను ఉపయోగించుకుని నీటిని రిజర్వాయర్‌లోకి పంప్ చేయవచ్చు. డిమాండ్ ఎక్కువగా (పీక్ అవర్స్) ఉన్నపుడు తిరిగి నీటిని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేసే అవకాశం ప్రాజెక్టులో ఉంది. రోజంతా పునరుత్పాదక శక్తి కలిగి ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. రాష్ట్రంలో ఈ రోజు మనం చేపడుతున్న ఇంధన పునరుత్పాదక ప్రక్రియ భవిష్యత్తులో యావత్ దేశానికి మార్గదర్శకం కానుంది. విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గిపోయి పునరుత్పాదక శక్తి ఇంధన విభాగం ముందంజలో నిలవనుంది. గ్రీన్ పవర్‌కు ప్రోత్సాహం పర్యావరణ సమతుల్యత, కాలుష్య రహితం చాలా కీలకం. ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ‘గ్రీన్కో’ ప్రాజెక్టును చేపట్టింది. మనం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. ‘గ్రీన్ పవర్’ (పర్యావరణ హితంగా) విధానాలతో విద్యుదుత్పత్తి ఎలా చేయవచ్చో ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి తెలియచేస్తోంది. గ్రీన్‌పవర్ ఉత్పాదక సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 33 వేల మెగావాట్లకుపైగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. మిట్టల్ కంపెనీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతోంది. ఈ సంస్థ 250 మెగావాట్ల విద్యుత్‌లో 100 మెగావాట్లను పునరుత్పాదక శక్తితో ఉత్పత్తి చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి దారి తీస్తుంది. గ్రీన్కో సంస్థకు సీఎం అభినందన ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సాకారం చేస్తున్న గ్రీన్కో సంస్థ ఎండీ అనిల్, బృందానికి ప్రత్యేక అభినందనలు. ‘గ్రీన్కో’కు ఎలాంటి సహాయం, సహకారం అవసరమైనా రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుంది. పైలాన్ ఆవిష్కరణ తొలుత ప్రాజెక్టు ప్రాంతం, పనులను పరిశీలించిన అనంతరం సీఎం జగన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు నిర్మాణం, విద్యుదుత్పాదనను వివరిస్తూ రూపొందించిన త్రీడీ నమూనాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవికిషోర్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, వెన్నపూస గోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంధన భద్రత రాష్ట్రంగా ఏపీ ‘పునరుత్పాదక విద్యుత్ పరిష్కారాలను అందించాలన్న అంతర్జాతీయ లక్ష్యాల కంటే ముందుగానే ఆ దిశగా అడుగులు వేయడం ‘గ్రీన్కో’కు గర్వకారణం. ముందుచూపు కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. దేశానికి ‘ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్’గా ఏపీ నిలవనుంది. విస్తృత వ్యాపార అవకాశాలతోపాటు అపార వనరులు, నౌకాశ్రయాలు, భూములు, ఖనిజాలు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2023 నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’ – అనిల్ చలమలశెట్టి, ‘గ్రీన్కో’ ఎండీ -
యుద్ధ ప్రాతిపదికన బొగ్గు సేకరణ
సాక్షి, అమరావతి: భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యుత్‌కు విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని ఇంధన శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో దాదాపు 32 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రికార్డు స్థాయిలో వినియోగం.. రాష్ట్ర్రంలో పీక్ డిమాండ్ రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్. ఈ నెల ప్రారంభంలో దాదాపు 11,767 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ప్రస్తుతం 9,711 మెగావాట్లుగా ఉంది. ఇక రోజువారీ విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా 200 మిలియన్ యూనిట్లను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. దీనిలో బుధవారం రూ.56.75 కోట్లతో 40.32 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌నుంచి యూనిట్ రూ.14.07 చొప్పున కొనుగోలు చేశారు. నెలలోపే టెండర్లు ఖరారు.. కొరతను అధిగమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోను ఆదేశించింది. దీంతో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. అదే విధంగా ఏపీజెన్కో 18 లక్షల టన్నుల కోసం, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) 13 లక్షల టన్నుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడా దొరకని బొగ్గు, విద్యుత్.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో 0.83 రోజులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 2.10 రోజులు, కృష్ణపట్నంలో 6.02 రోజులు, హిందుజాలో 4.24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలు లేకపోవడంతో మహానది కోల్ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్‌పై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి కూడా తగినంత బొగ్గు సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది. కొనుగోలు వ్యయం గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయికి చేరుకుంది. యూనిట్ రూ.12 నుంచి 16 వరకు పలుకుతోంది. పీక్ అవర్స్‌లో రూ.20కి కూడా కొనాల్సి వస్తోంది. -
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్‌లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు.. ఆరేళ్ల తరువాత తీవ్ర విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: విపరీతమైన వేడిగాలులు ఉక్కపోతతో ఆరేళ్ల తరువాత యావత్ దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది. బొగ్గు నిల్వలూ తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో పీక్–పవర్ డిమాండ్ గురువారం గరిష్ట స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో ఇది 8 శాతం వరకు పెరగనుంది. ఏప్రిల్ మొదటి 27 రోజుల్లో విద్యుత్ సరఫరా డిమాండ్ కంటే 1.88 బిలియన్ యూనిట్లు (1.6 శాతం) తగ్గింది. ఇదీ వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి.. ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరాచేసే పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడే అవకాశముందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పినదాని ప్రకారం.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన దాద్రీ–2, ఝజ్జర్ (ఆరావళి) పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది. దాద్రీలో ఒక రోజుకు మాత్రమే నిల్వలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. హరియాణా: గరిష్ట విద్యుత్ డిమాండ్ దాదాపు 9 వేల మెగావాట్లకు చేరుకోగా, సరఫరా దాదాపు 1,500 మెగావాట్లు తగ్గింది. 33.72 మిలియన్ యూనిట్ల కొరత కారణంగా గురుగ్రామ్‌లో 4–6 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర అవసరాలకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్‌ను తీసుకోవాలని హరియాణా నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్: దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల లోటు ఉంది. దాదాపు 23 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే, సరఫరా 20 వేల మెగావాట్లు. 29.52 మిలియన్ యూనిట్ల కొరతవల్ల గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో లోడ్ షెడ్డింగ్ ఏర్పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15 గంటల 7 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా అవుతోంది. బిహార్: డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో బిహార్ రోజుకు 200–300 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. రాష్ట్ర వినియోగం రోజుకు 6 వేల మెగావాట్లు కాగా వివిధ వనరుల నుండి 5,000–5,200 మెగావాట్లు అందుబాటులో ఉంటోంది. 15.90 మిలియన్ యూనిట్ల కొరత ఉంటోంది. రాజస్థాన్: విద్యుత్ డిమాండ్ 31 శాతం పెరిగింది. దీంతో విద్యుత్ కొరత 43.59 మిలియన్ యూనిట్లు ఏర్పడింది. ఇది రోజుకు 5 నుండి 7 గంటల విద్యుత్ కోతలకు దారితీసింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. కేరళ: ఈ రాష్ట్రంలో గురువారం నుంచి కరెంటు కోతలు మొదలయ్యాయి. బొగ్గు సంక్షోభం కారణంగా ఉత్పత్తి 400 మెగావాట్లు తగ్గడంతో విద్యుత్ కోత విధించాలని రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్ణయించింది. పంజాబ్: విద్యుత్ డిమాండ్ 40 శాతం పెరిగిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని వనరుల నుండి విద్యుత్ సరఫరా లభ్యత 1,679 లక్షల యూనిట్లు కాగా 30.65 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. రోపర్ థర్మల్ ప్లాంట్‌లో 8.3 రోజులు, లెహ్రా మొహబ్బత్ ప్లాంట్‌లో నాలుగు రోజులు, జీవీకేలో 2.4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు ఉంది. వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లో 5.28 మిలియన్ యూనిట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 6.71 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 13.72 మి.యూ, జార్ఖండ్‌లో 5.78 మి.యూ, ఒడిశాలో 2.69 మి.యూ, తమిళనాడులో 1.60 మి.యూ కొరత ఏర్పడింది. అలాగే, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు సైతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రోజుకి 2–8 గంటల మేర విద్యుత్ కోత విధిస్తున్నారు. ఏపీలో ఇదీ పరిస్థితి.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ 8.33 శాతం పెరిగింది. రోజువారీ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు ఉండగా 215 మిలియన్ యూనిట్లు సరఫరా జరుగుతోంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం కాస్త తగ్గినప్పటికీ వేసవి కారణంగా గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో డిమాండ్ తగ్గడంలేదు. థర్మల్ నుంచి 78.40 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ల నుంచి 37.82 మి.యూ, హైడ్రో 6.52 మి.యూ, గ్యాస్, సెయిల్ 8.74 మి.యూ, విండ్ 13.70 మి.యూ, సోలార్ 24.45 మి.యూ, హిందుజా 11.55 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 1.64 మిలియన్ యూనిట్లు చొప్పున అందిస్తున్నాయి. పవర్ ఎక్స్ఛేంజ్ల నుంచి 32.73 మిలియన్ యూనిట్లను రూ.12 నుంచి రూ.20 (యూనిట్) చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత అదుపులోకి వస్తోంది. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి సైతం పగటిపూట 7 గంటల విద్యుత్ అందుతోంది. 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు రాష్ట్రంలో మంగళవారం 226 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఏపీ జెన్కో, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల, సౌర, పవన, గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారా మొత్తం 197 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. 29 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడటంతో బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాయి. వ్యవసాయ రంగానికి 7 గంటలు, గృహావసరాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి 17.6 మిలియన్ యూనిట్ల మేర లోడ్ రిలీఫ్ అమలు చేసినట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంటలు చాలా వరకూ కోతలు పూర్తవ్వడం, కొన్ని పంటలు చివరి దశలో ఉన్నందున వ్యవసాయావసరాలకు రోజుకి 7 గంటలు విద్యుత్ సరఫరా సరిపోతుందని, అయినప్పటికీ కొన్ని చోట్ల 9 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలాఖరుకు పరిశ్రమలకూ సంపూర్ణంగా.. ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పవర్ హాలిడేలో భాగంగా ఈ నెల 11 వరకూ పరిశ్రమలకు 72.04 మిలియన్ యూనిట్ల లోడ్ రిలీఫ్ ఇచ్చినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయి సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కొన్ని పరిశ్రమలకు ముందు, మిగతా వాటికి తరువాత దశల వారీగా నియంత్రణలు తొలగిస్తామని ఆయన వెల్లడించారు. -
పరిశ్రమలకు 'పవర్' ఆంక్షలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబా టులో లేదు. దీంతో గృహ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంధనశాఖ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్యకేంద్రాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వ్యవసాయ, గృహావసరాలకు సర్దుబాబు చే యాలని నిర్ణయించింది. నిరంతరం పనిచేసే పరిశ్రమలు ప్రస్తుతం రోజులో వాడే విద్యుత్‌లో 50 శా తం లోడు తగ్గించాలని, ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని ఇంధనశాఖ కోరింది. మిగతా పరిశ్రమలు కూడా ప్రస్తుతం ఉన్న ఒకరోజుకు అద నంగా మరొక రోజు ‘పవర్ హాలీడే’ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పవర్ హాలీడే శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అంటే, ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. దీనిని జిల్లాలవా రీగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నియంత్రి స్తాయి. మాల్స్, వ్యాపార, వాణిజ్యసంస్థలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ నియంత్రణ పాటించాలని సూచించింది. ఈ సమయంలో హోర్డింగ్‌లు, సైన్ బోర్డుల విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివే యాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో ఏసీలు 50 శాతమే వాడాలని చెప్పింది. ఇంధన శాఖ అత్యవసర సమావేశం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడంతో ఇంధనశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగంపై సమీక్షించారు. దేశమంతటా కొరత ఏర్పడటంతో గుజరాత్ వంటి చాలా పారిశ్రామిక రాష్ట్రాలు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని గురువారం ఆయన సమీక్షించారు. పంట ముగింపు సీజన్, దేశవ్యాప్తంగా వేడిగాలుల కార ణంగా విద్యుత్ అందుబాటులో లేదని, రానున్న 15 రోజుల్లో పంటలు కోతకు రానున్నందున డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ విని యోగదారులకు నష్టం జరగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి లోడ్ రిలీఫ్ అమలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. కొందామన్నా దొరకడంలేదు వేసవి కాలం కావడంతో గృహ విద్యుత్ వినియోగం 5 శాతం, నీరు సమృద్ధిగా ఉండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కె సంతోషరావు, జె పద్మజనార్దనరెడ్డి, హెచ్ హరనాధరావులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. గత మూడేళ్లలో కోవిడ్ 19 కారణంగా పరిశ్రమలతో పాటు వాణిజ్య విద్యుత్ వాడకం కొంత తగ్గిందని, ఇప్పుడు కరోనా నుంచి బయటపడటంతో వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు అందుబాటులో లేకపోవడం, బహిరంగా మార్కెట్లో కొందామాన్న దేశవ్యాప్తంగా పవర్ ఎక్సే ్చజిల్లో 14 వేల మెగావాట్ల విద్యుత్‌కుగాను 2 వేల మెగావాట్లే అందుబాటులో ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. పరిస్థితి మెరుగుపడగానే పవర్ హాలీడే, ఆంక్షలు ఎత్తివేస్తామని వారు వివరించారు. అనివార్యంగా లోడ్ రిలీఫ్ ఏప్రిల్ 1న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 235 మిలియన్ యూనిట్లు ఉండగా, అందుబాటులో ఉన్న ఉత్పత్తి వనరులతో పాటు బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 64 మిలియన్ యూనిట్లు మాత్రమే లభించింది. ఈ డిమాండ్ 2021తో పోల్చితే 3.54 శాతం, 2020తో పోలిస్తే 46 శాతం ఎక్కువ. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ను తీర్చడానికి అన్ని దీర్ఘకాలిక ఉత్పత్తి వనరులను ఉపయోగించిన తర్వాత, రోజుకు దాదాపు 40 నుంచి 50 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. దీనిని అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ల నుండి కొనాలి. అయితే, దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజిల నుంచి విద్యుత్ కొంటున్నాయి. కానీ విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ఎక్స్చేంజిలలో కూడా అవసరమైన మేరకు దొరకడంలేదు. దీంతో అనివార్యంగా రాష్ట్రంలోని వ్యవసాయ, గృహ రంగాలకు రోజులో కొన్ని గంటలు అత్యవసర లోడ్ రిలీఫ్ జారీ చేయవలసి వచ్చిందని ఇంధన శాఖ వివరించింది. -
AP: పరిశ్రమలకు ‘పవర్’ రాయితీ!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చులో మిగిలిన మొత్తాన్ని ట్రూ డౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తొలిసారిగా 2021లో రూ.125 కోట్లు వెనక్కిచ్చిన రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022లో అమలయ్యేలా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. విద్యుత్ డిమాండ్‌లేని సమయాల్లో భారీ పరిశ్రమలకు వినియోగించిన విద్యుత్‌పై యూనిట్‌కు రూ.0.50 పైసల చొప్పున ప్రత్యేక రాయితీ ఇస్తామంటున్నాయి. డిమాండ్ లేని వేళలు.. 2006లో డిస్కంలు.. డిమాండ్‌ను బట్టి విద్యుత్ చార్జీల విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. సా.6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే విద్యుత్‌పై టైం ఆఫ్ ది డే (టీఓడీ) టారిఫ్ పేరుతో చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేస్తూ.. డిమాండ్ లేని వేళలు ఉ.10 గంటల నుంచి మ.3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 12 గంటల నుంచి ఉ.6 గంటల వరకు వినియోగించే విద్యుత్‌పై రిబేట్ ఇవ్వాలనేది డిస్కంల ఆలోచన. అంతేకాక.. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ డిమాండ్ లేని వేళల్లో రాయితీ ఇవ్వడానికీ సంసిద్ధంగా ఉన్నాయి. సమతూకం కోసమే.. విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంట్ కొనుగోలు కోసం విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ప్రకారం రోజులో కొన్ని గంటలకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే కుదరదు. 24 గంటల చొప్పున సరఫరా తీసుకోవాల్సిందే. దీనివల్ల డిమాండ్ లేని వేళల్లో కూడా జెన్కోలకు చెల్లించే చార్జీలు భారంగా మారుతున్నాయి. అదే విధంగా పీక్ అవర్స్‌లో ఒకేసారి అందరూ విద్యుత్ వినియోగించడంవల్ల గ్రిడ్‌పై భారం పడి తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రెండిటినీ సమతుల్యం చేయడానికి డిస్కంలు పరిశ్రమల్లో విద్యుత్ వినియోగాన్ని రాత్రివేళ ప్రోత్సహించాలని భావిస్తున్నాయి. దీనివల్ల పీక్ అవర్స్‌లో లోడ్ తగ్గుతుంది. పరిశ్రమలు ఏ, బీ, సీ షిఫ్టుల్లో పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరగడంవల్ల డిస్కంలకు బిల్లుల రూపంలో ఆదాయం వస్తుంది. దీంతో జెన్కోలకు చెల్లించే చార్జీల్లో సమతూకం వస్తుంది. ఈ నెలలోనే విచారణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2022–23 ఆర్థిక సంవత్సర వార్షిక సగటు ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు గత డిసెంబర్లో కొన్ని ప్రతిపాదనలు సూచించాయి. వీటిల్లో టీఓడీ కూడా ఒకటి. ఏఆర్ఆర్పై ఈ నెల 24, 25, 27 తేదీల్లో ఏపీఈఆర్సీ విశాఖపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి చివరి వారంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్ఆర్ అమల్లోకి వస్తుంది. – కె. సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
5 శాతం వడ్డీరాయితీ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కేంద్రం చేయూతనిస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విద్యుత్ పొదుపుపై మెరుగైన ఫలితాలు సాధించగలమని రాష్ట్ర ఇంధనశాఖ కేంద్రానికి లేఖ రాసింది. సమర్థ ఇంధనం, పొదుపు కోసం పరిశ్రమలు చేపట్టే చర్యలకు అవసరమైన పెట్టుబడులకు అయ్యే వడ్డీపై కనీసం 5 శాతం రాయితీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖకు రాష్ట్ర ఇంధన శాఖ లేఖ రాసినట్టు రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో సమర్థ ఇంధన చర్యలు వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఈ దిశగా రాష్ట్రం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరిశ్రమలు ఇంధన పొదుపు దిశగా అడుగులేయాలంటే ప్రస్తుతం ఉన్న ఉపకరణాలు సమూలంగా మార్చాల్సి ఉంటుంది. తక్కువ కరెంట్ వినియోగించే పరికరాలు వాడాలి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కేంద్ర ఇంధన పొదుపు సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అందిస్తోంది. ఉపకరణాలు, యంత్రాల కొనుగోలుకు వివిధ సంస్థలు రుణాలిస్తున్నాయి. అయితే కోవిడ్ కారణంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధనశాఖ పెట్టుబడులుగా పొందే అప్పుపై 5 శాతం రాయితీని కేంద్రం అందించాలని కోరింది. దీనివల్ల మరింత మెరుగైన ఇంధన పొదుపు చేయడానికి వీలుందని తెలిపింది. రాష్ట్రంలో వార్షిక విద్యుత్తు డిమాండ్ 61,818 మిలియన్ యూనిట్లు. ఇంధన సామర్థ్యం గల ఉపకరణాలను వాడితే వార్షిక వినియోగంలో కనీసం 15 వేల మిలియన్ యూనిట్ల (25 శాతం) పొదుపునకు ఆస్కారం ఉందని అంతర్గత ఆడిట్లో గుర్తించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటివరకు 2,932 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే పొదుపు చేయగలుగుతున్నారు. అతి ముఖ్యమైన పారిశ్రామిక రంగంలో పొదుపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే కొంతమేరైనా విద్యుత్ ఖర్చు తగ్గించే వీలుంది. -
Telangana: ‘పవర్’ఫుల్ డిమాండ్!
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనంతగా ఉండనుంది. గత ఏడాది వినియోగానికి అదనంగా 3 వేల మెగావాట్లు కలుపుకొని మొత్తంగా 6,520 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇరిగేషన్ శాఖ ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోని పంప్‌హౌస్‌ల్లో కనీసం నాలుగు నెలల పాటు మోటార్లను నడపాల్సి ఉంటుందంటూ లెక్కగట్టింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4,720 మెగావాట్ల విద్యుత్ అవసరాలుంటాయని విద్యుత్ శాఖకు నివేదించింది. –సాక్షి, హైదరాబాద్ ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల, కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు, పాక్షికంగా డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే సిద్ధమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వర్షాలు ఏమాత్రం సహకరించకపోయినా, కృష్ణా, గోదావరిలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా ఎంత విద్యుత్ అవసరాలు ఉన్నాయో లెక్కించాలని సూచించారు. ఇప్పటివరకు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్పీ, దేవాదుల, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా 1,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. అయితే ఈ ఏడాది దేవాదుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండిన నేపథ్యంలో దీనికి నీటి లభ్యత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో కనీసంగా 20 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇక్కడి అన్ని ప్యాకేజీల్లో కలిపి 48 మోటార్లు ఉండగా, 500 మెగావాట్లు అవసరమని లెక్కగట్టారు. ఇక పాలమూరులోని ప్రాజెక్టుల కింద కనీసం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృష్ణాలోకి వచ్చే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లోని 40 మోటార్లు తిరిగినా 800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరం కింద పెరగనున్న డిమాండ్ ఇక కాళేశ్వరం ద్వారా గత ఖరీఫ్‌లో పెద్దగా ఎత్తిపోతలు జరగలేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు 15 టీఎంసీలు ఎత్తిపోయగా, అనంతరం మూడు నెలల్లో 35 టీఎంసీలను ఎత్తిపోశారు. దీంతో పెద్దగా విద్యుత్ అవసరం పడలేదు. కానీ ఈసారి మేడిగడ్డ మొదలు బస్వాపూర్ వరకు రిజర్వాయర్లన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్‌తో పాటు 11.39 టీఎంసీల సామర్ధ్యం ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ సిద్ధమవుతోంది. ఇక 14 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపాలని నిర్ణయించారు. అంటే మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకే కనీసంగా 120 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉంది. దీంతోపాటే ప్రధాన రిజర్వాయర్ల కింద కాల్వల పనులు పూర్తవుతున్నాయి. దీనికి తోడు ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరందిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ద్వారా 250–300 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి వరకే 71 మోటార్లను నడపాల్సి ఉంటుంది. దీనికే 3,049 మెగావాట్ల విద్యుత్ కావాలి. దీని దిగువన బస్వాపూర్ వరకు నీటిని తరలించాలంటే మరో 28 మోటార్లను నడిపించాలి. దీనికి మరో 1,672 మెగావాట్లు అవసరం. ఇక పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా వానాకాలంలో నీటి ఎత్తిపోతలు సాధ్యపడేలా లేవు. అయితే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను మాత్రం స్థానిక ప్రవాహాల ద్వారా వచ్చే నీటితో నింపేలా ప్రణాళికలు వేశారు. వీటితో పాటే ఏఎంఆర్పీ, ఐడీసీ పథకాలను కలుపుకొని మొత్తంగా వానాకాలంలో అన్ని ఎత్తిపోతల పథకాల కింద 4 నెలల పాటు 607 మోటార్లు నడుస్తాయని, వాటి సామర్థ్యాన్ని బట్టి 6,520 మెగావాట్ల అవసరం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. గత ఖరీఫ్‌లో విద్యుత్ 2 వేల మెగావాట్లను కూడా దాటలేదు. యాసంగిలో 2,000–2,800 మెగావాట్లు వినియోగించినట్లు అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా విద్యుత్ అవసరాలు ఉండనున్నట్లు విద్యుత్ శాఖకు నివేదించింది. ప్రధాన పథకాల కింద అవసరాలు ఇలా.. -
ఏసీ 26 డిగ్రీల కన్నా తగ్గితే ఇల్లు గుల్లే
సాక్షి, అమరావతి: ఎండాకాలం.. 24 గంటలూ ఏసీ వేయడం మామూలే. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాదు.. ప్రజలకూ హాని కలుగుతోంది. 8నుంచి 10 గంటల పాటు ఏసీ వేస్తే ఏకంగా 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏసీల వినియోగంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ వివరాలను ఆ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2,800 మిలియన్ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మేలని ఇంధనశాఖ చెబుతోంది. దీనివల్ల తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణస్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది. ఇలా చేస్తే మేలు ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్ అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లల్లో రోజుకు 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయవచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. స్టార్ రేటెడ్ బెస్ట్ 5 స్టార్ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్ స్లి్పట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీతో రూ.2,500 వరకు పొదుపు చేయవచ్చు. ఇళ్లల్లో స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఏపీఎస్ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6% తగ్గుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్ టీఆర్ (టన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ (74,234 మెగావాట్లు)). పదేళ్లలోపే ఇది 250 మిలియన్ టీఆర్ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా 2030 కల్లా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. -
కరోనాతో కరెంటుకు డిమాండ్
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. రోజూ 228 మిలియన్ యూనిట్ (ఎంయూ)ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. సగటు విద్యుత్ వినియోగం 160 ఎంయూలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, కోవిడ్ ప్రభావం దీనికి కారణమని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న నేపథ్యంలో వినియోగం ఎక్కువవుతోంది. మే మొదటి వారానికి డిమాండ్ రోజుకు 235 ఎంయూలు దాటొచ్చని భావిస్తున్నారు. ఆ డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ రెండు నగరాలే కీలకం! విజయవాడ, గుంటూరు నగరాలు, సీఆర్డీఏ పరిధిలో 2019 ఏప్రిల్‌లో 267.53 ఎంయూల విద్యుత్ డిమాండ్ రికార్డయితే.. 2020 ఏప్రిల్‌లో ఇది 388.38 ఎంయూలకు చేరింది. 2021 మేలో ఇది 450 ఎంయూలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆస్పత్రులకే వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అనివార్యమవుతోంది. అన్నిచోట్ల 24 గంటలూ ఏసీలు వినియోగిస్తున్నారు. పగటి వేళల్లో డిమాండ్ పెరిగి విద్యుత్ లోడ్ అత్యధికంగా ఉంటోంది. దీనికితోడు కార్యాలయాల సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ప్రజలూ ఇల్లు దాటడం లేదు. ఫలితంగా గృహవిద్యుత్ వినియోగం 2019 కన్నా 20 శాతం ఎక్కువగా ఉందని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ అంతరాయాల్లేకుండా ఏర్పాట్లు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కోవిడ్ సెంటర్లు, ఆస్పత్రులకు విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాం. అవసరమైతే మార్కెట్లో విద్యుత్ కొంటాం. ఎట్టి పరిస్థితుల్లోను వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీచేశాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి ఆ రెండు నగరాలపై దృష్టి విజయవాడ, గుంటూరు నగరాల్లో వైద్యసేవలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది నిరంతర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఉన్నతస్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జోన్ల వారీగా పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశాం. లోడ్ పెరిగినా విద్యుత్ సరఫరాకు ఆటకం రావడం లేదు. మేలో మరింత అప్రమత్తంగా ఉంటాం. – పద్మా జనార్దన్‌రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ -
పల్లెపల్లెకూ 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: రాయలసీమలో విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఏపీ ట్రాన్స్‌కో ఈ రెండినీ సమన్వయం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. కొత్త లైన్ల ఏర్పాటు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు రూ.1,349 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. దీనివల్ల ప్రతీ పల్లెకు మరింత నాణ్యమైన విద్యుత్ అందబోతోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ వల్ల లో ఓల్టేజీ సమస్యను నివారించవచ్చని తెలిపారు. సీమ, కోస్తాంధ్ర అనుసంధానం రాయలసీమ, కోస్తా ఆంధ్రను అనుసంధానం చేసే 400 కేవీ లైను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్‌కో సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లాలోని తాళ్లయపాలెంలో 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేయనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఇది దోహద పడుతుంది. అనంతపురం జిల్లా హిందుపూర్, చిత్తూరు జిల్లా రాచగున్నేరి, ప్రకాశం జిల్లా పొదిలిలో గల 400 కేవీ సబ్ స్టేషన్లలో బస్ రియాక్టర్లను పెట్టడం వల్ల ఈ జిల్లాలలో 400 కేవి లైన్లలో వోల్టేజీ సమస్యలు పరిష్కరించొచ్చు. స్విచ్చింగ్ స్టేషన్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బ, వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 220 కేవీ స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోని 132 కేవీ సబ్ స్టేషన్‌ను 220 కేవీకి పెంచుతున్నారు. సిఎస్పురం, రుద్రసముద్రం సోలార్ పార్కుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. శరవేగంగా సోలార్ లైన్లు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, కర్నూలులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం విద్యుత్‌ను ఇతర కోస్తాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని తలారిచెరువు 400 కేవీ సబ్ స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి 400 కేవీ సబ్ స్టేషన్ వరకు 400 కేవీ లైన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని ట్రాన్స్‌కో ఉన్నాతాధికారి తెలిపారు. డిమాండ్ కన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అయితే, ఆ విద్యుత్తును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అదనపు విద్యుత్‌ను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్రం యోచిస్తోంది. -
ఉచిత విద్యుత్.. మరింత పకడ్బందీగా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ఇక నుంచి మరింత సమర్థవంతంగా పనిచేయనుంది. క్షేత్రస్థాయి నివేదికల తర్వాత విద్యుత్ సంస్థలు కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 6,663 వ్యవసాయ ఫీడర్లను బలోపేతం చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విడగొట్టి లోవోల్టేజీ సమస్య రాకుండా చేశారు. రూ.6610.5 కోట్లతో చేపట్టిన కొత్త ప్రాజెక్టులూ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ రబీ నుంచే వంద శాతం ఫీడర్ల ద్వారా విద్యుత్ ఇస్తున్న విద్యుత్ శాఖ.. వచ్చే ఖరీఫ్ నుంచి మరింత సమర్థవంతంగా ఫీడర్లను పనిచేయించే లక్ష్యంతో ఉంది. పెరుగుతున్న డిమాండ్ అధికారిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో పీక్ అవర్స్‌లో గ్రిడ్‌పై ఎక్కువ డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ చేపట్టారు. విద్యుత్ సంస్థలు రూ.6,610.5 కోట్లతో మొత్తం 85 కొత్త ప్రాజెక్టులు దాదాపు పూర్తికానున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల పొడిగింపు, అత్యధిక సామర్థ్యంగల హైపవర్ కండక్టర్ల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతోంది. ఈ విద్యుత్‌ను రైతుకు చేరవేసే దిశగా గ్రిడ్‌ను బలోపేతం చేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. నెట్వర్క్ బలోపేతం తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశామని ఆయన వివరించారు. -
'కష్టమైనా' కొంటున్నాం
సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి చెందిన పవన, సౌర విద్యుత్‌ను తీసుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పష్టంచేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నప్పటికీ పవన, సౌర విద్యుత్‌ను వచ్చినంతా తీసుకుంటున్నామని తెలిపింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలవల్ల కోత పెట్టలేని పరిస్థితి ఉందని వివరించింది. సాధ్యమైనంత వరకూ థర్మల్ విద్యుత్‌ను తగ్గించిన తర్వాతే వాటి వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. అదికూడా నిబంధనలకు అనుగుణంగా, గ్రిడ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే కేవలం 4 శాతంలోపే కోత పెడుతున్నామని తెలిపింది. ఈ సందర్భంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ లభ్యత, తీసుకున్నదీ గణాంకాలతో సహా ఇంధన శాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలు.. మా విద్యుత్ తీసుకోవాల్సిందే.. ► సాధారణంగా సెప్టెంబర్‌లో రోజుకు 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది వర్షాలవల్ల ఒక్కసారిగా పడిపోయింది. 14న ఏకంగా 143 ఎంయూలకు.. 26న 146 ఎంయూలకు పడిపోయింది. నెలాఖరు వరకూ పెద్దగా మార్పులేదు. ► ఒక్కసారే రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గితే.. ఉత్పత్తి తగ్గించడం తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకపోతే గ్రిడ్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ► కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 16 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరులను అనుమతించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఏలు చేయడంవల్ల 26 శాతం ఈ విద్యుత్ వస్తోంది. డిమాండ్ లేకపోయినా తమ విద్యుత్ తీసుకోవాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలపై భారం పడకూడదనే స్వల్పంగా ఉత్పత్తి తగ్గింపు నిబంధనల ప్రకారం కేవలం 3.78 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాం. దీనివల్ల ఆ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు. ముందుగా జెన్కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన తర్వాతే.. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండబట్టే అలా చేశాం. ఇది పీపీఏలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాన్ని ప్రైవేటు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు అర్థం చేసుకోవాలి. అవసరం లేకున్నా తీసుకుంటే, ప్రజలపై భారం పడుతుంది. – శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్ డిమాండ్!
ముంబై: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా విద్యుత్ డిమాండ్ క్రమంగా పుంజుకుని కరోనా ముందస్తు స్థాయికి చేరుతోంది. ఇండియా రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం ఈ మేరకు తన తాజా నివేదికను వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది. అయితే పారిశ్రామిక రంగంలో ఇంకా డిమాండ్ ధోరణులు కనిపించడం లేదని కూడా పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► అఖిల భారత స్థాయిలో చూస్తే, వార్షికంగా 2020 జూలైలో 6 నుంచి 13% విద్యుత్ డిమాండ్ రికవరీ నమోదయ్యింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్ మెరుగుదల దీనికి నేపథ్యం. దీనికితోడు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కూడా క్రమంలో పుంజుకుంటోంది. ► ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే, జూలైలో భారీ పారిశ్రామిక రాష్ట్రాల విద్యుత్ డిమాండ్ 6 నుంచి 15 శాతం తక్కువగానే ఉంది. పారిశ్రామిక రంగంలో క్రియాశీలత నెమ్మదిగా ఉండడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ► లాక్డౌన్ తరవాత మొదటి నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 13.1 శాతం పడిపోయింది. మార్చి 25 నుంచీ దేశంలో కఠిన లాక్డౌన్ అమలు సంగతి తెలిసిందే. ► నెలవారీగా చూస్తే, 2020 ఏప్రిల్‌లో విద్యుత్ డిమాండ్ 85 బిలియన్ యూనిట్లగా ఉంటే, జూలైలో ఇది 112 బిలియన్ యూనిట్లకు చేరింది. అయితే వార్షికంగా చూస్తే మాత్రం డిమాండ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ► 2020 ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్ 133 గిగావాట్లయితే జూలైలో ఇది 171 గిగావాట్లకు రికవరీ అయ్యింది. అయితే 2019 జూలైతో పోల్చితే ఇది ఇంకా 3.3 శాతం తక్కువే కావడం గమనార్హం. ► ఇక ఆగస్టు విషయానికి వస్తే, కోవిడ్–19 ముందస్తు స్థాయితో పోల్చితే 98 శాతానికి విద్యుత్ డిమాండ్ మెరుగుపడింది. డిస్కమ్‌లకు నష్టాలు! 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 5% నుంచి 6% వరకూ క్షీణతలోనే ఉండే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇది విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్స్) ఆదాయాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. ముఖ్యం గా అధిక టారిఫ్‌లు చెల్లించే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బల్క్ వినియోగ డిమాండ్ పడిపోవడాన్ని ఇక్రా ప్రస్తావించింది. ఈ పరిస్థితు ల్లో 2020–21లో డిస్కమ్‌లకు ఆదాయ వ్యత్యాసం అఖిల భారత స్థాయిలో రూ.42,000–45,000 కోట్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్కాస్ట్)ను విద్యుత్ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్‌పై ఎస్ఎల్డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. - ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి. - రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి. - ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. - ఏపీ డిస్కమ్‌లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (విద్యుత్ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. - ఈసారి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. - ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దేనికైనా సిద్ధమే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తాయి. - బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
‘కరెంట్’ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని భారీ సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని తోడుతుండటం, కొన్ని రోజులుగా వర్షాలు లేక పొలాలకు బోరుబావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్‌ను వినియోగిస్తుండడడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గత 3 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ రికార్డులపై రికార్డులు సృష్టించింది. 2018 సెప్టెంబర్ 11న నమోదైన 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇప్పటివరకు రికార్డు కాగా, ఈ నెల 28న 11,064 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదై కొత్త రికార్డు సృష్టించింది. మరుసటి రోజు 29న డిమాండ్ 11,638 మెగావాట్లకు చేరి అంతకు ముందురోజు ఉన్న రికార్డును చెరిపేసింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 11,669 మెగావాట్లకు చేరి మరో కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా, రానున్న 2 నెలల్లో డిమాండ్ పెరిగి 12,000 మెగావాట్లు దాటే అవకాశముందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. -
విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరగనుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించి వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు తొలిసారిగా సాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సమయానికి పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు 1,080 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థ (డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 600–2,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రారంభం కానున్న నేపథ్యం లో వచ్చే జూలై నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే సరికి రికార్డు స్థాయిలో 14,500 మెగావాట్లకు ఎగబాకనుందని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) అంచనా వేసింది. మార్చి 4న ఏర్పడిన 10,501 మెగావాట్ల విద్యుత్ డిమాండే ఇప్పటివరకు రాష్ట్ర అత్యధిక విద్యుత్ డిమాండ్‌కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు వచ్చే జూలైలో ఈ రికార్డు కనుమరుగు కానుంది. జూలైలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,000 మెగావాట్లకు చేరనుంది. బోరు బావుల కింద పంటల సాగు లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సగటున 8,200 మెగావాట్లకు తగ్గిపోయింది. జూలై నుంచి బోరు బావుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు కాళేశ్వరం కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యం లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేయండి.. వచ్చే జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నీటిపారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. భక్త రామదాసు, దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు గరిష్టంగా 1,080 మెగావాట్ల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపో తల కోసం అదనంగా 600–2,600 మెగా వాట్ల విద్యుత్‌సరఫరా చేయాలని నీటిపారుదలశాఖ కోరింది. ఈ ప్రాజెక్టుకు ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరమన్న లెక్కలను అందించింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే జూలై నుంచి అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్ల ను పిలిచామన్నారు. నిర్మాణంలో ఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నుంచి డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుందన్నారు. డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం! కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం డిస్కంలు ముందస్తుగా భారీ ఎత్తున విద్యుత్‌ను సమీకరించి పెట్టుకుంటున్నాయి. ఇందుకోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేక ఈ ప్రాజెక్టు కోసం సమీకరించిన విద్యుత్‌ను పూర్తిగా వాడుకోవడంలో విఫలమైనా డిస్కంలు భారీగా నష్టపోనున్నాయి. డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోనున్నాయి. థర్మల్, సోలార్, జల విద్యుత్ ప్లాంట్లు కలిపి రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 16,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 9,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మినహాయిస్తే జల, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎప్పడు అవసరముంటే అప్పుడు విద్యుదుత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 3,700 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2,441 మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నా ఆయా జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నప్పుడే జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వచ్చే జూలై నుంచి మరో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి. -
‘పగటి’కలే!
* వచ్చే ఖరీఫ్ నుంచి సాగుకు పగటిపూట 9 గంటల కరెంటు అనుమానమే * ఇక మిగిలింది ఎనిమిది నెలలు మాత్రమే * కార్యరూపం దాల్చని రూ. 2 వేల కోట్ల పనులు * ఇప్పటివరకు టెండర్లు కూడా పిలవని వైనం * రెట్టింపు కానున్న విద్యుత్ డిమాండ్ * కరెంటు అందినా సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచాలి * హామీ అమలుకు మరో రెండు, మూడేళ్లు పట్టే అవకాశం * అప్పటిదాకా పగలు 4 గంటలు, రాత్రిపూట 4 గంటలు ఇవ్వడంపై యోచన * ప్రస్తుతం సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం 8,800 మెగావాట్లు * 9 గంటల కరెంటుకు కావాల్సిన సామర్థ్యం 14,000 మెగావాట్లు * రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 6,0006,500 మెగావాట్లు * 9 గంటల కరెంట్‌తో పెరగనున్న డిమాండ్ 10,50011,000 మెగావాట్లు సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి పగటిపూటే కరెంట్.. 9 గంటలపాటు నిరంతర సరఫరా.. వచ్చే ఖరీఫ్ నుంచే అందిస్తాం..’ ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయి ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా కనిపించడం లేదు. ఈ హామీ నెరవేర్చడానికి కేవలం 8 నెలల సమయమే మిగిలి ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం దాదాపు రెట్టింపు స్థాయికి చేరాలి. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా పనులు కార్యరూపం దాల్చకపోవడంతో హామీ అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిమాండ్ మేరకు విద్యుత్‌ను సమీకరించుకున్నా... ఆ విద్యుత్‌ను సరఫరా, పంపిణీ చేసే వ్యవస్థలను స్వల్ప కాలంలో సిద్ధం చేసుకోవడం కాని పనే! ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకం అమలును మరో ఏడాది, రెండేళ్ల వరకు వాయిదా వేసుకోక తప్పదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. హామీని పాక్షికంగానైనా నెరవేర్చేందుకు కొన్ని మార్పులు చేయవచ్చనే చర్చ జరుగుతోంది. పగలు 4 గంటలు, రాత్రి 4 గంటలు చొప్పున 8 గంటల విద్యుత్ సరఫరా చేసే అంశం ఉన్నత స్థాయి వర్గాల పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 6,000-6,500 మెగావాట్ల మధ్యే ఉంది. ఈ విద్యుత్ అందించేందుకే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక సాగుకు వచ్చే ఏప్రిల్ నుంచి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. ఈ డిమాండ్ ఒక్కసారిగా 10,500-11,000 మెగావాట్లకు పెరుగుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత రబీలో (2015 మార్చి 28న) అత్యధికంగా 6,755 మెగావాట్ల సరఫరా జరగ్గా.. అందులో వ్యవసాయ విద్యుత్ వాటా 2,500 మెగావాట్లుగా ప్రభుత్వం లెక్కలేసింది. ప్రస్తుతం రెండు, మూడు విడతల్లో 6 గంటలకు మించకుండా సరఫరా చేస్తేనే వ్యవసాయ రంగానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇక పగలే 9 గంటలు నిరంతరంగా సరఫరా చేస్తే ఒక్క వ్యవసాయానికే ఈ డిమాండ్ 6,370 మెగావాట్లకు పెరగనుందని ప్రభుత్వ అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం డిమాండ్ 10,500-11,000 మెగావాట్ల మధ్య ఉండనుంది. అంటే.. 9 గంటల పథకానికి అదనంగా 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ అంచనాల ఆధారంగానే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సరఫరా, పంపిణీ రంగాలను పటిష్టం చేసేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల అంచనాలతో చేయాల్సిన పనులకు కేవలం 8 నెలలే మిగిలి ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే... రాష్ట్రంలో సాగుకు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం లభ్యమవుతున్న 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు అదనంగా మరో 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మిస్తున్న కేటీపీపీ-2 యూనిట్‌తోపాటు జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సౌర విద్యుత్ టెండర్లు ముగిసిన నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నిర్మాణంలో ఉన్న గాయత్రి థర్మల్ ప్రాజెక్టు నుంచి 600 మెగావాట్లు, థర్మల్ టెక్ ప్రాజెక్టు నుంచి 269 మెగావాట్ల వాటాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అనుకున్నట్లే ఈ ప్రాజెక్టులన్నీ గడువులోగా పూర్తై అదనంగా 5,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. సౌర విద్యుత్కేంద్రాలు ఆలస్యమైతే మాత్రం 2,500 మెగావాట్లకు మించి సామర్థ్యం పెరగదు. సరఫరా, పంపిణీలే అసలు సమస్య సాగుకు 9 గంటల విద్యుత్ పథకం అమలు కోసం సరిపడా విద్యుత్‌ను సమీకరిస్తే సరిపోదు. ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలూ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రం 8,800 మెగావాట్ల విద్యుత్ సరఫరా, పంపిణీ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. వచ్చే ఏప్రిల్‌లోగా 14,000 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంది. అలాగే కేవలం వ్యవసాయ అవసరాల కోసమే గ్రామగ్రామాన ప్రత్యేక సరఫరా, పంపిణీ లైన్లను వేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టినా రాష్ట్రంలోని 8,600 గ్రామాల్లో ఏకకాలంలో పూర్తి చేయడం సాధ్యం కాని పని. సరఫరా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ట్రాన్స్‌కో రూ.950.50 కోట్లతో, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి డిస్కంలు రూ.1,066.98 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనుల కోసం ఇంకా టెండర్లే పిలవలేదు. -
తగ్గిన విద్యుత్ డిమాండ్
నాన్ పీక్ అవర్స్‌లో యూనిట్ల నిలిపివేత బొగ్గు నిల్వలు పెంచేందుకు జెన్కో కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కొన్ని యూనిట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి ఉదయం వరకు (నాన్ పీక్ అవర్స్) యూనిట్లను ఆపేస్తున్నారు. ఇదే సమయంలో బొగ్గు సరఫరా కూడా పెరగడంతో ఏపీ జెన్కోకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా 500 మెగావాట్ల మేర డిమాండ్ తగ్గింది. గత రెండు రోజులుగా అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. దీంతో మరో 100 మెగావాట్ల వాడకం తగ్గింది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్, సింహాద్రిలో మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సోమవారం నాటికి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని రెండువేల మెగావాట్లు తగ్గించి.. 2,500 మెగావాట్లకు పరిమితం చేశారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొగ్గును నిల్వచేసేందుకు జెన్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
సోలార్ వెలుగులే దిక్కు!
విద్యుత్ సమస్యలనుంచి బయటపడటానికి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే మార్గమని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సౌర విద్యుత్‌పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో సాధ్యమైనంత మేరకు సౌరవిద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీలు, సబ్సిడీలు ప్రకటించి, ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. కాగా, రాష్ర్టంలో సౌర విద్యుత్ సేవలను అందరికంటే ముందు పొందేందుకు నాందేడ్ సిద్ధమవుతోంది. సాక్షి, ముంబై: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, కొరతను తట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగరాలలో బహుళ అంతస్తుల భవనాలు, టవర్లలో నివాసముంటున్న వారికి సౌర (సోలార్) విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఒక బృందాన్ని నియమించాలని విద్యుత్ శాఖ యోచిస్తోంది. ఈ భవనాల టెర్రెస్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే సొసైటీలకు వివిధ రాయితీలు, వీటి ఏర్పాటుకయ్యే వ్యయంలో సబ్సిడీ ఇవ్వాలనే పథకానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో అధ్యయనంచేసే పనులు త్వరలో ప్రారంభించనుంది. అంతా సవ్యంగా సాగితే రాష్ట్రంలోని అనేక నగరాల్లో సౌర విద్యుత్ వాడకం పెరుగుతుంది. దీంతో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విద్యుత్ కొరత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉంది. దీనికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి లేదు. ఫలితంగా అనేక గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో అత్యధిక శాతం లోడ్‌షెడ్డింగ్ విధించాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యుత్ వినియోగం పట్టణాల్లో, నగరాల్లోనే అత్యధికంగా ఉంటుంది. కాని పల్లెలు, గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉండటం బాధాకరం. చిన్న, కుటీర పరిశ్రమలపై దీని ప్రభావం విపరీతంగా పడుతోంది. విద్యుత్ కోతవల్ల ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయి వీటిపై ఆధారపడిన అనేక పేద కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సౌర విద్యుత్ ప్లాంట్లను తాముంటున్న భవనాల టైలపై ఏర్పాటు చేసుకునేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ’ ఒక కార్యక్రమం రూపొందించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో, ప్రధాన పట్టణాలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేయనుంది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఈ సదస్సులను నాందేడ్, పుణే యూనివర్సిటీల్లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే 50 శాతం నిధులు, ప్రైవేటు సంస్థలకు 25 శాతం నిధులు అందజేస్తుంది. ఇదే తరహాలో పెద్ద నగరాలలో టవర్లు, నివాస సముదాయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే ప్రత్యేక సబ్సిడీ ఇవ్వనుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను వినియోగించే నగరాలు, పట్టణాలలో నాందేడ్ ప్రథమ స్థానం దక్కించుకోనుంది. ఇక్కడ గురుద్వార్తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీ, ప్రముఖ కాలనీలు, కాంప్లెక్స్‌లలో త్వరలో సౌర విద్యుత్ వెలుగులు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగవంతంగా సాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి డి.పి.సావంత్ చెప్పారు.