సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబా టులో లేదు. దీంతో గృహ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంధనశాఖ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్యకేంద్రాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వ్యవసాయ, గృహావసరాలకు సర్దుబాబు చే యాలని నిర్ణయించింది. నిరంతరం పనిచేసే పరిశ్రమలు ప్రస్తుతం రోజులో వాడే విద్యుత్‌లో 50 శా తం లోడు తగ్గించాలని, ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని ఇంధనశాఖ కోరింది.
మిగతా పరిశ్రమలు కూడా ప్రస్తుతం ఉన్న ఒకరోజుకు అద నంగా మరొక రోజు ‘పవర్ హాలీడే’ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పవర్ హాలీడే శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అంటే, ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. దీనిని జిల్లాలవా రీగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నియంత్రి స్తాయి. మాల్స్, వ్యాపార, వాణిజ్యసంస్థలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ నియంత్రణ పాటించాలని సూచించింది. ఈ సమయంలో హోర్డింగ్‌లు, సైన్ బోర్డుల విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివే యాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో ఏసీలు 50 శాతమే వాడాలని చెప్పింది.
ఇంధన శాఖ అత్యవసర సమావేశం
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడంతో ఇంధనశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగంపై సమీక్షించారు. దేశమంతటా కొరత ఏర్పడటంతో గుజరాత్ వంటి చాలా పారిశ్రామిక రాష్ట్రాలు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని గురువారం ఆయన సమీక్షించారు. పంట ముగింపు సీజన్, దేశవ్యాప్తంగా వేడిగాలుల కార ణంగా విద్యుత్ అందుబాటులో లేదని, రానున్న 15 రోజుల్లో పంటలు కోతకు రానున్నందున డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ విని యోగదారులకు నష్టం జరగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి లోడ్ రిలీఫ్ అమలు చేయాలని డిస్కంలను ఆదేశించారు.
కొందామన్నా దొరకడంలేదు
వేసవి కాలం కావడంతో గృహ విద్యుత్ వినియోగం 5 శాతం, నీరు సమృద్ధిగా ఉండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కె సంతోషరావు, జె పద్మజనార్దనరెడ్డి, హెచ్ హరనాధరావులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. గత మూడేళ్లలో కోవిడ్ 19 కారణంగా పరిశ్రమలతో పాటు వాణిజ్య విద్యుత్ వాడకం కొంత తగ్గిందని, ఇప్పుడు కరోనా నుంచి బయటపడటంతో వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు అందుబాటులో లేకపోవడం, బహిరంగా మార్కెట్‌లో కొందామాన్న దేశవ్యాప్తంగా పవర్ ఎక్సే ్చజిల్లో 14 వేల మెగావాట్ల విద్యుత్‌కుగాను 2 వేల మెగావాట్లే అందుబాటులో ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. పరిస్థితి మెరుగుపడగానే పవర్ హాలీడే, ఆంక్షలు ఎత్తివేస్తామని వారు వివరించారు.
అనివార్యంగా లోడ్ రిలీఫ్
ఏప్రిల్ 1న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 235 మిలియన్ యూనిట్లు ఉండగా, అందుబాటులో ఉన్న ఉత్పత్తి వనరులతో పాటు బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 64 మిలియన్ యూనిట్లు మాత్రమే లభించింది. ఈ డిమాండ్ 2021తో పోల్చితే 3.54 శాతం, 2020తో పోలిస్తే 46 శాతం ఎక్కువ. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ను తీర్చడానికి అన్ని దీర్ఘకాలిక ఉత్పత్తి వనరులను ఉపయోగించిన తర్వాత, రోజుకు దాదాపు 40 నుంచి 50 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. దీనిని అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ల నుండి కొనాలి. అయితే, దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజిల నుంచి విద్యుత్ కొంటున్నాయి. కానీ విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ఎక్స్చేంజిలలో కూడా అవసరమైన మేరకు దొరకడంలేదు. దీంతో అనివార్యంగా రాష్ట్రంలోని వ్యవసాయ, గృహ రంగాలకు రోజులో కొన్ని గంటలు అత్యవసర లోడ్ రిలీఫ్ జారీ చేయవలసి వచ్చిందని ఇంధన శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment