Bharatanatyam
-
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షిణి కి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు. గురువు హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన 16వ ఏట వర్షిణి భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమంకు ఉపక్రమించింది. ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిధులు ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ.. భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు. రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని అన్నారు. సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ.. ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు. అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా భరతనాట్యం రంగప్రవేశం గావించిన వర్షిణి నాగంను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి వర్షిణి నాగంకు ప్రశంసా పత్రం ను ప్రదానం చేశారు. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా అభినందిస్తూ "సిలికానాంధ్ర సంపద" కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల విడుదల అభినందనాపత్రాన్ని "సంపద" అనుసంధానకర్త శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణికి అందజేశారు.ఈ కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువు హేమ భరతనాట్య శిక్షణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ చలంచర్ల ఏడుకొండలు, కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి విడుదల అయిన ప్రశంసా పత్రాలను వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు.అంతకు మునుపు స్థానిక హారిస్ సెంటర్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి వర్షిణి ప్రేక్షకులకు కనువిందు చేసింది. స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్ శిష్యురాలైన వర్షిణి భరతనాట్యంలో రంగప్రవేశం ప్రదర్శన చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు ఐదు వందలకు పైగా స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు హాజరై వర్షిణి ని అభినందించారు. విశ్రుత్ నాగం ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది. వర్షిణి తల్లిదండ్రులు వాణి - వెంకట్ నాగం ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గురుహేమ సత్యనారాయణ్‌కు సత్కారం చేశారు. వర్షిణి నాగం సోదరుడు చిరంజీవి. విశ్రుత్ నాగం ఈ సందర్భంగా వేదికపై ఏకదంతాయ వక్రతుండాయ, ఆనందామృతకర్షిణి, అన్నమయ్య కీర్తన "శ్రీమన్నారాయణ" మూడింటినీ భావయుక్తంగా ఆలపించాడు. విశ్రుత్ నాగం 15 ఏండ్ల వయస్సులో 2018లో విజయవాడలో కర్ణాటక సంగీతంలో రంగప్రవేశం చేసిన విషయాన్ని ఆహుతులు గుర్తుచేసుకున్నారు. ఒకే ప్రవాసాంధ్ర కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు వేర్వేరు విభాగాలలో ఆరు,ఏడు ఏళ్లల్లోనే రంగప్రవేశం చేయడం విశేషం అన్నారు. ఈ స్పూర్తితో ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుందని అన్నారు. (చదవండి: అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు) -
13 ఏళ్లకే అరంగేట్రం... చైనా బాలిక రికార్డు!
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయలకు ఎంతో గౌరవం ఉంది. మన ఆచార వ్యవహారాలను ఎంతగానో ఇష్టపడతారని ఎన్నోసార్లు తేటతెల్లమయ్యింది. అది తాజాగా బీజింగ్‌లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో నిజమని తేలింది. చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజింగ్‌లో చైనా బాలిక లీ ముజి (13) అరంగేట్రం (Arangetram) ప్రదర్శన సంచనలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా 'అరంగేట్రం' ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్చార్జ్ టీఎస్ వివేకానంద్ మాట్లాడుతూ..చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిన 'అరంగేట్రం' ఇది అన్నారు. ఇక్కడ లీ చైనీస్ ఉపాధ్యాయులచే చైనాలోనే ఈ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ప్రదర్శించడం విశేషం. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ షాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేగాదు లీ ప్రదర్శనం కోసం చెన్నై నుంచి విమానంలో సంగీత విద్వాంసుల బృందం తరలి వచ్చింది. కాగా, లీ ఈ నెలాఖారున ఆమె చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది. అరంగేట్రం అంటే?భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు.(చదవండి: తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!) -
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. వారి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని.. 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో ఖ్యాతి సంపాదించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. -
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్‌లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్‌కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్‌లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్‌లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్‌లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్‌ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్‌కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Actress Sreeleela: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు..ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్
శ్రీలీల పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యాన్సుల వల్ల ఈమెని ట్రోల్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కనబెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలలో మళ్లీ పాత అమ్మాయి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక సినిమాల్లోకి వచ్చిన క్లాస్ డ్యాన్సులు పక్కనబెట్టి మాస్ డ్యాన్సులు చేయడం షురూ చేసింది. దీంతో పాత శ్రీలీలని చాలామంది మిస్ అయ్యారు. తాజాగా హైదారాబాద్‌లో సమతా కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో దిగువనే ఉంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) After a long time, Sreeleela Bharatanatyam classical dance performance at #SamathaKumbh2024 That charm, elegance and expressions 😍✨ Literally got chills watching this I'M SO PROUD OF YOU @sreeleela14 🫡#Sreeleela ♥️🙏🏼 pic.twitter.com/xysonVncVP — Mighty Mate (@MightyMate118) March 2, 2024 -
అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్నాథ్ కోల్‌కతాకు చెందినవారు. పీహెచ్డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు. My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening. Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood. Well the reason , accused details everything are not revealed yet or perhaps no one… — Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024 అమర్నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్‌కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. Deep condolences to family & friends of deceased Amarnath Ghosh in StLouis, Missouri. We are following up forensic, investigation with police & providing support. @IndianEmbassyUS @MEAIndia — India in Chicago (@IndiainChicago) March 1, 2024 -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
గిఫ్టెడ్ ఆర్టిస్ట్ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు
-
పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరై సందడి చేసింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఎక్కడా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా.. స్పందించలేదు. చివరకు ఎంగేజ్మెంట్ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటకు వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఇటలీలో జరుగబోతుందట. (చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లికి ముందే వరుణ్‌కి ఓ కండీషన్ పెట్టిందట లావణ్య. ఆ కండిషన్ కు ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత కూడా భరతనాట్యం చేయాలనేది ఆమె కోరిక. ఇదే విషయాన్ని వరుణ్‌కు చెప్పిందట. పెళ్లి తర్వాత ఏదైనా స్టేజ్‌పై భరతనాట్యం చేసే చాన్స్ వస్తే వదులుకోనని తేల్చి చెప్పిందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా.. ప్రొడక్షన్స్ వైపు వెళ్తానని చెప్పిందట. లావణ్య కండీషన్స్‌కి వరుణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. -
Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు
భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు.... ‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి. చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది. డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్‌లో ‘రాగమాల డ్యాన్స్ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది. ‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి. ‘రాగమాల ట్రైనింగ్ సెంటర్’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు. ‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి. పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది. ‘క్రియేటివ్ పర్సన్ లేదా ఆర్టిస్ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి. భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం. డీప్ లవ్, డెడికేషన్, డిసిప్లిన్. ‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం... ‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్ ఇన్ వాటర్’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు వచ్చింది. ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు. ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు. నోట్స్ రెడీ ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్‌లు నోట్స్‌తో రెడిగా ఉన్నారు. -
Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!
‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది. ఒక డాక్టర్ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు చూరగొనడమే డాక్టర్ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సినీగీతాల భరతనాట్యం! ‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్‌తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్‌కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్‌లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్‌గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్‌కు అంతరాయం రానిచ్చేది కాదు. నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్ అది. ఆ రోజు అక్టోబర్ 29. అందుకే 29 పాటల థీమ్ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్ఫ్మార్మెన్స్ చిరంజీవి గారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. అమ్మాయి పుడితే బహుమతి! డాక్టర్‌గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్‌లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్‌లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్ ప్రీతి. సమాజానికి తిరిగి ఇవ్వాలి! గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్ ప్రీతి ‘బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె. –వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి వైద్యయోగం! యోగసాధన దేహాన్ని, మైండ్‌ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్ నెర్వస్ సిస్టమ్తోపాటు పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్‌కి రిలాక్సేషన్నిస్తూ కామ్‌గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది. – డాక్టర్ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ -
సింగపూర్‌లో ఒంగోలు తెలుగు తేజం భరతనాట్య అరంగేట్రం
సింగపూర్: ప్రకాశం జిల్లా మైనంపాడుకు చెందిన గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి నృత్యాభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఐదేళ్ల ప్రాయం నుంచే నాట్యం అభ్యసించిన సాయి తేజస్వి అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాల్లో అవార్డులను, 2019లో త్యాగయ్య టీవీ కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందారు. సోదరి ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమంలో సాయి గురువు శ్రీలిజీ శ్రీధరన్ రూపకల్పన చేసిన నృత్యాలతో తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను అలరించారు. శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను అందుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు శ్రీమతి పద్మజా రెడ్డి సాయితేజస్వి ని ఆశీర్వదించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి శ్రీ వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిధులుగా విదూషి డా.ఎం.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త శ్రీమతి సునీత రెడ్డి హాజరై సాయి తేజస్వికి దీవనెలు, అభినందనలు అందించారు. ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు. హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం భావితరానికి స్ఫూర్తిదాయకమనీ, భారతీయ కళలకు గర్వకారణమని సభికులు ప్రశంసించారు. -
వావ్.. అంకుల్ స్టెప్పులిరగదీశాడు కదా..!
సరదాగానో, ఇంట్లో ఎవరు లేనప్పుడో, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో డ్యాన్స్ చేయడం కామన్. కానీ సంప్రదాయ నృత్యం చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భరత నాట్యం, కూచిపుడి వంటి డ్యాన్స్‌లు చేయడం చాలా కష్టం.. అది కూడా ఆ నృత్యాలకు సంబంధించిన వస్త్రాలు ధరించి. కానీ ఇక్కడ ఉన్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యతో నోరు వెళ్లబెడతారు. మాములుగా భరతనాట్యం డ్రెస్ ధరించి.. డ్యాన్స్ చేయడానికి ఆడవారే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ పురుషుడు భరతనాట్యం డ్రెస్ ధరించి.. ఎంతో అందంగా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పైన చొక్క, కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఉన్నాడు. ఇక అతడు ఎంతో అద్భుతంగా.. చాలా సులభంగా.. అందంగా భరతనాట్యం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతో అందంగా, క్లియర్‌గా చేశారు.. అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
చిన్న విరామం
‘‘లాక్డౌన్ వల్ల భరతనాట్యం నేర్చుకునే వీలు కుదిరింది’’ అంటున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. లాక్డౌన్ వల్ల తన రోజులు ఎలా గడుస్తున్నాయన్న విషయంపై ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘లాక్‌డౌన్‌ను ప్రకటించగానే ముందు నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే నేనెప్పుడూ పనితో బిజీగా ఉండాలనుకుంటాను. గతంలో క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యత సంపాదించాలని ప్రయత్నించాను. అప్పట్లో కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల వల్ల నాకు కొంత ఖాళీ సమయం దొరికింది. దీంతో నేను ఎప్పుట్నుంచో కలలు కంటున్న భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇందుకోసం కొన్ని వారాలుగా ప్రతిరోజూ రెండు గంటలు ఆన్లైన్ క్లాసులను ఫాలో అవుతున్నాను. కానీ కాస్త బ్యాక్‌పెయిన్ రావడంతో ప్రాక్టీస్‌కు చిన్న విరామం ఇచ్చాను. ఈ నొప్పి తగ్గాక సాధన ప్రారంభిస్తాను. ఇంకా ఈ లాక్డౌన్ సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను థియేటర్లో చూడలేకపోయిన సినిమాలను ఇప్పుడు చూస్తున్నాను. టీవీ సీరియల్స్‌ను కూడా ఫాలో అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. -
అరివీరమణివణ్ణన్
మగధీరులకు మాత్రమే పరిమితమైన సిలంబమ్ యుద్ధకళలో ఇప్పుడు నారీమణులూ తమ ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. ఐశ్వర్యా మణివణ్ణన్ అనే కేరళ యువతి ఆ ప్రావీణ్యానికి ఒక ప్రతీకాత్మకశక్తిలా నిలిచారు! గులాబీ బోర్డరున్న నెమలి కంఠం రంగు చేనేత చీర కట్టుకుందామె. సంప్రదాయబద్ధంగా పేరంటానికి వెళ్తుందేమో అనిపించేలా ఉంది ఆహార్యం. చూపరుల అంచనాను తలకిందులు చేస్తూ ఒకచేతిలో కర్ర, మరో చేతిలో బరువైన కత్తి పట్టుకుని బరిలో దిగింది. భరతమాత, తెలుగుతల్లిలాగానే యుద్ధమాత పాత్ర పోషిస్తోందేమో అనుకుంటే పొరపాటే. ఆమె ఆ పాత్రలో నటించడం లేదు, ఆ పాత్రలో జీవిస్తోంది. ఆమె కేరళకు చెందిన ముప్పై ఏళ్ల ఐశ్వర్యా మణివణ్ణన్. మీసాలను వంచింది! బరిలో మగవాళ్లతో పోటీపడి యుద్ధం చేస్తోంది ఐశ్వర్య. ఒక చేతిలో కంబు (కర్ర), మరో చేతిలో వాల్ (కత్తి) గాలిని చీలుస్తూ విన్యాసాలు చేస్తున్నాయి. వాటికి దీటుగా ఐశ్వర్య దేహం నేల మీద నుంచి రెండడుగుల పైకి లేచి ప్రత్యర్థి దాడిని తిప్పి కొడుతోంది. జానపద కథలో యువరాణిని తలపిస్తోందామె. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమె చేస్తున్న యుద్ధకళ పేరు సిలంబమ్. అది మూడు వేల ఏళ్ల నాటి కేరళ యుద్ధవిద్య. ‘ఇంతటి నైపుణ్యంతో యుద్ధం చేయడం మగవారికి మాత్రమే సాధ్యం’ అనుకుంటూ వచ్చిన సంప్రదాయపు భ్రాంతిని చీల్చి చెండాడుతోంది ఐశ్వర్య. ఆమెను చుట్టుముడుతూ మగ సిలంబమ్ వీరులు ఒక్కొక్కరుగా బరిలోకి వస్తున్నారు. వారందరినీ ఏకకాలంలో ఎదుర్కొంటోందామె. ఆమె ఛేదించింది మగవారికి పరిమితం అనుకున్న యుద్ధవిద్యా వలయాన్ని మాత్రమే కాదు, శౌర్యానికి, వీరత్వానికి ప్రతీకగా మగవాళ్లు మెలితిప్పుకున్న మీసాలను కూడా ఆమె తన కత్తి మొనతో కిందకు వంచింది. భరతనాట్యం నుంచి ఐశ్వర్య మొదట్లో భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమె గురువు కవితా రాము సిలంబమ్ సాధన చేయమని సూచించడంతో ఐశ్వర్య ఇలాంటి మలుపు తీసుకుంది. నిజానికి కవితా రాము సిలంబమ్ సాధన చేయమని చెప్పిన ఉద్దేశం వేరు. సిలంబమ్ సాధన ద్వారా దేహదారుఢ్యం ఇనుమడించి, శరీరాకృతి చక్కగా తీరుతుంది, కాబట్టి భరతనాట్య సాధన సులువవుతుందనే ఉద్దేశంతో చెప్పారామె. గురువు చెప్పినట్లుగానే సిలంబమ్ సాధన మొదలు పెట్టిన తర్వాత భరతనాట్యం కంటే సిలంబమ్ సాధన చేయడాన్ని బాగా ఎంజాయ్ చేయసాగింది ఐశ్వర్య. అప్పటి నుంచి పూర్తి స్థాయి సిలంబమ్ యుద్ధకళకే అంకితమైంది. ‘ఇది ఓ సముద్రం, ఈదుతూ సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని మెళకువలు ఒంటపడతాయి. భరతనాట్యం ఎంతోమంది చేస్తారు. సిలంబమ్ సాధన అమ్మాయిలు చేయరు. అయితే ఇది ఆత్మరక్షణనిచ్చే కళ. అమ్మాయిలకు చాలా అవసరం కూడా. ఈ విషయాన్ని ప్రచారం లోకి తీసుకురావాలి. ఈ కళకు ప్రాచుర్యం కల్పించాలన్నదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’ అన్నారు ఐశ్వర్య. – మంజీర పతకాల రాణి మలేషియాలో 2016లో జరిగిన ఏషియన్ సిలంబమ్ చాంపియన్ షిప్ పోటీల్లో వివిధ కేటగిరీలలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించింది ఐశ్వర్య. ‘‘సిలంబమ్ యుద్ధకళ దేహ దారుఢ్యాన్ని మాత్రమే కాదు మానసిక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ధ్యానం వంటిది. దేహం, మెదడు ఏకకాలంలో దృష్టిని కేంద్రీకరిస్తూ సాధన చేయాలి. రెండింటి మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. సిలంబమ్ సాధనలో ఈ సమన్వయం మెరుగవుతుంది. సిలంబమ్ సాధనకు వయసు పరిమితులేవీ ఉండవు. ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాను. చాలా స్కూళ్లు వాళ్ల కరికులమ్‌లో సిలంబమ్ మార్షల్ ఆర్ట్‌ను చేర్చడానికి సిద్ధమవుతున్నాయి’’ అన్నారు ఐశ్వర్య. -
నృత్యగాన చైతన్యం
సామాజిక సమస్యలపై స్పందించే గుణం లేకుంటే కళాకారులెలా అవుతారని ప్రశ్నించే సంధ్యామూర్తి (65) .. భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలిచిన శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ఎంతోమందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతూనే మహిళాభ్యుదయ సాధన కోసం స్త్రీ చైతన్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ∙ బుడిబుడి అడుగులతోనే నా మూడేళ్ల ప్రాయం నుండే మా నాన్నగారు పీఎస్ శర్మ నన్ను నాట్య ప్రవేశం చేయించారు. నేను అనంతపురంలోనే పుట్టి పెరిగాను. మా నాన్న అప్పట్లో లలితకళాపరిషత్తు సెక్రటరీగా ఉండేవారు. మైసూరు నుండి అనంత కొచ్చిన నాట్యకోవిదులు వరదరాజఅయ్యంగార్ వద్ద భరతనాట్యం, కూచిపూడిలో పార్వతీశం వద్ద కూచిపూడి నేర్పించారు. చెన్నైకు చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూకైలాస్ నాటకంలో బాల వినాయకునిగా నటించాను. దేవదాసీలనేవారు మా చిన్నప్పుడు మహిళలు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో సభ్యసమాజం భావించేది. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. మా నాన్నగారికి కళపై ఉన్న అభిమానంతో నాకు పద్నాలుగేళ్లు వచ్చేవరకు చెప్పించి ఆ తర్వాత మానిపించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆనాటి సమాజానికి భయపడడం వల్ల ఇక నా నాట్యం ఆగిపోయిందనే భావించాను. అప్పట్లో భరతనాట్యమే నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో శాస్త్రీ నృత్యమంటే భరత నాట్యమే. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవారు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ పట్టింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లందరూ రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. వారి స్ఫూర్తి కారణంగానే నేను రంగస్థలంపై ప్రయోగాలు చేయగలిగాను. తొలి నాట్య పాఠశాల 1969లో మేము శ్రీ నృత్య కళానిలయం స్థాపించాము. బహుశా జిల్లాలోనే తొలి సంగీత, నాట్య పాఠశాల అదే కావొచ్చు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు కళానిలయంలో శాస్త్రీయ నృత్యాలు నేర్చుకున్నారు. ఎంతో మంది నాట్య గురువులుగా కూడా మారారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మీ ‘విదూషీ’ శిక్షణ పొందారు. విదేశాలలో ప్రదర్శనలు నాకు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాలు తిరిగాము. అక్కడ కూడా నేను నాట్యం నేర్పించేదాన్ని. అనంతకొచ్చేసిన తర్వాత మా శిష్యబృందంతో న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా లాంటి అన్ని ప్రధాన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి పలు దేశాలలో ప్రదర్శనలిచ్చాము. పరాయి రాష్ట్రాలలోనూ అనంత కీర్తి మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలల కంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరత నాట్యం నేర్పించాను. ఇప్పటికీ అక్కడి నా శిష్యులు నన్ను పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నాను. సమస్యల పట్ల స్పందించాలి ప్రస్తుత సమాజం గందరగోళంగా మారుతోంది. అడుగడుగునా బాలికలకు భద్రత లేకుండా పోతోంది. అవగాహన లేని వయసులో అర్థం పర్ధం లేని ప్రేమలతో కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. వీటన్నిటికి పరిష్కారమార్గం కళలు చూపిస్తాయి. సమాజంలో సమస్యలు వచ్చినపుడు.. మహిళా సమస్యలపై కళాకారులు స్పందించాలి. వారైతేనే సమస్యను సున్నిత కోణంలో వివరించగలరు. మేము బాలికలకు ఇదే విషయమై రోజూ కొంత సమయమైనా కేటాయించి మాట్లాడుతుంటాం. – గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం -
యునెస్కోలో భరత నాట్య ప్రదర్శన
లండన్: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పరిశోధకురాలు బాలాదేవీ చంద్రశేఖర్ తన ప్రదర్శన ద్వారా చరిత్ర సృష్టించనున్నారు. గురువారం ఆమె పారిస్‌లోని యునెస్కో(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి)లో వివిధ దేశాలకు చెందిన 100 మంది సమక్షంలో ‘బృహదీశ్వర’ అంశంపై భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘ఇది చాలా అరుదైన ప్రదర్శన. భారతీయ ప్రాచీన కట్టడాలపై ఆసక్తి కలిగించేందుకు, మన దేశం, సంస్కృతులపై అవగాహన పెంచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది’ అని బాలాదేవి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా ‘బృహదీశ్వర’ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. -
సన్నీలియోన్ వద్దు.. భరతనాట్యం ముద్దు!
సాక్షి, బెంగళూరు : బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. బెంగళూరులో నిర్వహించే న్యూఇయర్ వేడుకల్లో సన్నీలియెనపాల్గొనాల్సి ఉంది. సన్నీలియోన్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో వివాదాలకు దారితీసింది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం సన్నీలియోన్ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందూ అతివాద సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నీలియోన్ రాకను వ్యతిరేకిస్తూ.. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కొద్ది రోజుల నుంచి ఉద్యమాలను నిర్వహిస్తోంది. సన్నీలియోన్ రాకవల్ల కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని రక్షణ వేదిక పేర్కొంటోంది. న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి కర్ణాటక రక్షణ వేదికకు అనుకూలంగా స్పందించారు. సన్నీలియోన్ పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అయితే సన్నీలియోన్ ప్రోగ్రాం స్థానంలో భరతనాట్యం, ఇతర సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించడం విశేషం. సన్నీలియన్ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని కర్ణాట రక్షణ వేదిక ప్రకటించింది. కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆమెను ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేసిన విషయం విదితమే. -
ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం
న్యూయార్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే వారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ఐరాస తరఫున కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మహిళాదినోత్సవం రోజున ఐరాసలో నృత్యంచేసే అవకాశంరావడం గర్వంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ నాట్య ప్రదర్శన చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం ఆమె తనదైన రీతిలో రిహార్సల్ చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్ సతీమణి అయిన ఐశ్వర్య ఇటీవల ‘స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్: ద స్టోరీ ఆఫ్ ఏ గర్ల్ అమాంగ్ ది స్టార్స్’ అనే పుస్తకం రాశారు.