Lavanya Tripathi Put Condition To Varun Tej Before Marriage - Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందే వరుణ్‌కు కండీషన్‌.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న లావణ్య

Published Tue, Jun 13 2023 5:36 PM | Last Updated on Tue, Jun 13 2023 5:56 PM

Lavanya Tripathi Put Condition To Varun Tej For Marriage - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరై సందడి చేసింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఎక్కడా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట.

మీడియా, సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించినా.. స్పందించలేదు. చివరకు ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటకు వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఇటలీలో జరుగబోతుందట. 

(చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!)

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లికి ముందే వరుణ్‌కి ఓ కండీషన్‌ పెట్టిందట లావణ్య. ఆ కండిషన్ కు ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట.

ఇంతకీ ఆ కండీషన్‌ ఏంటంటే.. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత కూడా భరతనాట్యం చేయాలనేది ఆమె కోరిక. ఇదే విషయాన్ని వరుణ్‌కు చెప్పిందట. పెళ్లి తర్వాత ఏదైనా స్టేజ్‌పై భరతనాట్యం చేసే చాన్స్‌ వస్తే వదులుకోనని తేల్చి చెప్పిందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా.. ప్రొడక్షన్స్‌ వైపు వెళ్తానని చెప్పిందట. లావణ్య కండీషన్స్‌కి వరుణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement