
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని భోగట్టా.
అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం జాన్వీ కపూర్ అని సమాచారం. మరి... వార్తల్లో ఉన్నట్లు అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ మూవీలో ఐదుగురు నాయికలు ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment