
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి చనిపోయేందుకు ప్రయత్నించిన ఈమె.. గత రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్లి ఆమెని రక్షించారు.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)
ఇంతకీ ఏమైంది?
కల్పన నివాసముంటున్న వర్టేక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డి చెప్పిన దానిబట్టి చూస్తే.. కల్పన భర్త ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. సాయంత్రం నాలుగన్నరకు కాల్ లిఫ్ట్ చేస్తే సాయం కావాలని అన్నారు. నేను ఆయనకు అపార్ట్ మెంట్ సూపర్ వైజర్ నంబర్ ఇచ్చారు. భర్త ఫోన్ చేసినా సరే కల్పన కాల్ లిఫ్ట్ చేయలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అప్పటికే తన భార్య అపస్మారక స్థితిలో ఉందని ఆయన అన్నారు.
దీంతో మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లొచ్చి డోర్స్ పగలగొట్టి చూడగా.. కల్పన బెడ్ పై పడి ఉంది. దీంతో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశామని సెక్రటరీ చెప్పుకొచ్చారు. ఈ విల్లాలో ఐదేళ్లుగా వీళ్లు నివాసముంటున్నారని, గత రెండు రోజులుగా మాత్రం కల్పన భర్త ఇంట్లో లేరని అన్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
కల్పన, ఆమె భర్త మంచిగా ఉండేవారు. మాతో మాట్లాడేవారు. ఇద్దరు మధ్య ఏమైనా ఎలాంటి విభేదాలు ఉన్నాయో మాకు తెలియదు. విల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా కల్పన వచ్చేవారని సదరు సెక్రటరీ చెప్పుకొచ్చారు.
కానీ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఈమె భర్తని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనని చూసేందుకు సింగర్స్ సునీత, శ్రీకృష్ణ తదితరులు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)
గాయని కల్పన భర్త ప్రసాదను హాస్పిటల్ నుండి కేపీఎచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం..@pskkp_cyb @hydcitypolice https://t.co/qG9WggK9aH pic.twitter.com/QWSYlN5720
— Telangana Awaaz (@telanganaawaaz) March 4, 2025