singer kalpana
-
పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన
ప్రముఖ నేపథ్యగాయనిగా పేరు సంపాందించుకుంది కల్పన (Singer Kalpana). తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడింది. సంగీతంపై అమితమైన మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించింది. శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్‌లోనైనా అవలీలగా కల్పన ఆలపిస్తుంది. 'మనోహరం' సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్‌తో ఫుల్ టైమ్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారింది. ఎమ్ఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కెవి, మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కలిసి ఆమె పనిచేశారు. వరల్డ్‌వైడ్‌గా 3 వేల స్టేజ్ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిన కల్పన బిగ్‌బాస్‌లో కూడా అలరించింది. అయితే ఎంతో సక్సెస్ సాధించిన కల్పన జీవితంలో కూడా ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ''25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. అనేక వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. ఒక పాప ఉంది. ఉద్యోగం లేదు. అన్నీ కోల్పోయిన నేను ఆఖరికి చనిపోవాలనుకున్నా. కానీ సింగర్ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పాల్గనమని ఎంకరేజ్ చేశారు. చదవండి: అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటికి నాకు మలయాళం అస్సలు తెలియదు. కసితో వెళ్లాను. నా కుమార్తె కోసం విల్లా గెలవాలనుకున్నాను. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో కష్టపడి ఆ పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ గెలుపు తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది'' అని ఇటీవల తెలిపారు సింగర్ కల్పన. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
ఇలకొచ్చె జాబిల్లి
జాన్, అంగనా రాయ్, గాయని కల్పన, ప్రియ, తేజ రెడ్డి, హర్షద, జయవాణి, ‘జబర్దస్త్’ ఆర్పీ, వినోదిని, అప్పారావ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అదృశ్యం’. వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్పై రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆల్డ్రిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కళాతపస్వి కె.విశ్వనాథ్ రిలీజ్ చేశారు. రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని ‘ఇలకొచ్చె జాబిల్లి...’ అనే మెలోడీ సాంగ్‌ని, ‘అందానికి అడ్రస్సే...’ అనే బీట్ సాంగ్‌ని వెన్నెలకంటిగారు రాశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి. ∙అంగనా రాయ్, జాన్ -
బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ!
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్లో మరోసారి ఎలిమినేషన్ ప్రక్రియ రక్తికట్టింది. ఇప్పటికే ఈ షో నుంచి మహేశ్ కత్తి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం నాటి ఎపిసోడ్లో సింగర్ కల్పన కూడా ఇంటి దారి పట్టారు. ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా.. యువ హీరో నవదీప్ వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఎలిమినేషన్ జోన్లో ఈ వారం చివరివరకు దీక్ష, హరితేజ, కల్పనలు ఉండగా.. వీరిలో సింగర్ కల్పనను ప్రేక్షకుల తీర్పు మేరకు బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపివేస్తున్నట్టు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. మంచి గాయనిగా పేరొందిన కల్పన వెళ్తూ .. వెళ్తూ.. తనదైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌లోని తోటి సభ్యులను ఉద్దేశించి పాటలు పాడుతూ, ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బా నవ్వించారు. ఇక, తన అంచనా ప్రకారం బిగ్ బాస్ టైటిల్ ప్రిన్స్ గెల్చుకునే అవకాశం ఉందని కల్పన తెలిపారు. హౌస్‌లో డబుల్ మైండ్ ఎవరికి ఉంది అని ఎన్టీఆర్ అడుగగా.. ధనరాజ్ అని బదులిచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి దీక్షను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా యువ హీరో నవదీప్ హౌజ్‌లోకి ప్రవేశించాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న మొమైత్ఖాన్ ఇప్పటికే డ్రగ్స్ కేసులో సిట్ విచారణను ఎదుర్కొన్నారు. సిట్ విచారణ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు స్వయంగా ఆమె వెంట వచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న మరో నటుడు నవదీప్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచింది.