![adrushyam movie audio launch - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/9/Adrushyam.jpg.webp?itok=XtJKsIfK)
అంగనా రాయ్. జాన్
జాన్, అంగనా రాయ్, గాయని కల్పన, ప్రియ, తేజ రెడ్డి, హర్షద, జయవాణి, ‘జబర్దస్త్’ ఆర్పీ, వినోదిని, అప్పారావ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అదృశ్యం’. వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆల్‌డ్రిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కళాతపస్వి కె.విశ్వనాథ్ రిలీజ్ చేశారు. రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని ‘ఇలకొచ్చె జాబిల్లి...’ అనే మెలోడీ సాంగ్‌ని, ‘అందానికి అడ్రస్సే...’ అనే బీట్ సాంగ్‌ని వెన్నెలకంటిగారు రాశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి.
∙అంగనా రాయ్, జాన్
Comments
Please login to add a commentAdd a comment