Angana Roy
-
సెక్షన్ 497 నేపథ్యంలో...
సూపర్‌స్టార్ కృష్ణతో ‘శ్రీశ్రీ’, కొత్తవారితో ‘నాటకం’ వంటి సినిమాలు నిర్మించిన సాయిదీప్ చాట్ల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘సెక్షన్ 497 ఇండియన్ పీనల్ కోడ్’. సందీప్ జక్కం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అంగనారాయ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా గుంటూరులో ప్రారంభమైంది. సాయిదీప్ చాట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. మన దేశంలో వివాహ వ్యవస్థ రానురాను బీటు వారిపోతోంది. పాశ్చాత్య ధోరణులు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ వ్యవస్థను శాసిస్తున్నాయి. దాంతో యువతీ యువకులు సహజీవనం పేరుతో జీవనాన్ని సాగిస్తూ ఇష్టం లేనప్పుడు ఈజీగా విడిపోతున్నారు. మన సంప్రదాయాలు మరుగుపడిపోకుండా ‘సెక్షన్ 497’ అనే ఇండియన్ పీనల్ కోడ్ ఒకటి ఏర్పాటైంది. ఆ సెక్షన్ నేపథ్యంలోనే మా సినిమా ఉంటుంది. ఒక ఎస్పీ అల్లుడు డీఎస్పీని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు జరిగే పరిస్థితుల్ని కథగా రూపొందించాం. జూలై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, ఆగస్టులో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్కె. బాజి. -
ఇలకొచ్చె జాబిల్లి
జాన్, అంగనా రాయ్, గాయని కల్పన, ప్రియ, తేజ రెడ్డి, హర్షద, జయవాణి, ‘జబర్దస్త్’ ఆర్పీ, వినోదిని, అప్పారావ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అదృశ్యం’. వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్పై రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆల్డ్రిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కళాతపస్వి కె.విశ్వనాథ్ రిలీజ్ చేశారు. రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని ‘ఇలకొచ్చె జాబిల్లి...’ అనే మెలోడీ సాంగ్‌ని, ‘అందానికి అడ్రస్సే...’ అనే బీట్ సాంగ్‌ని వెన్నెలకంటిగారు రాశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి. ∙అంగనా రాయ్, జాన్ -
చిన్నారులతో నటి అంగనరాయ్
-
మహేష్‌తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ
-
మహేష్‌తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ
బెంగాలీ భామ అంగనా రాయ్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఆఫర్ కొట్టేసింది.ఇప్పటికే ఆమె తమిళ,మళయాళ,కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. మహేష్ బాబు నటిస్తూ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో గ్లామరస్ పాత్రలో అంగనా నటిస్తుంది. ఈ పాత్ర కీలకమైనది కావటంతో ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. మొత్తం 71 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి మరీ ఈ మద్దుగుమ్మని ఎంపిక చేసారట. 'ఇది నాకు ఓవరాల్ గా పదవ చిత్రం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజలకి నేను పెద్ద అభిమానిని.. మహేష్ తో కలసి నటించడం హ్యాపీగా ఉంది. తను చాలా మంచి వ్యక్తి. ఈ సినిమాలో నాది గ్లామరస్ క్యారక్టర్'. అని అంగనా రాయ్ తెలిపారు..